బెంగుళూరు 'నమ్మ మెట్రో'లో ఇంటర్నెట్.. ఫ్రీ.. ఫ్రీ

Posted By: Staff

బెంగుళూరు 'నమ్మ మెట్రో'లో ఇంటర్నెట్.. ఫ్రీ.. ఫ్రీ

బెంగళూరు నగర ప్రజలకు ‘నమ్మ మెట్రో’ (మన మెట్రో) పేరుతో 2006 జూన్ 24న ప్రధాని మన్మోహన్‌సింగ్ శంకుస్థాపన చేసిన మెట్రో ప్రాజెక్టు తొలిదశ సంచారాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కమల్‌నాథ్ గురువారం పచ్చ జెండా ఊపిన సంగతి తెలిసిందే. దక్షణ భారతదేశంలోని బెంగుళూరు మహా నగరంలో ఎంజీ రోడ్డు నుంచి బయ్యప్పనహళ్లి వరకు 6.7 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సంచారానికి ఈయన పచ్చెజండా ఊపారు.

ఇక మెట్లో రైలులో ప్రయాణించే పాసింజర్స్ కోసం బెంగుళూరు మెట్రో ఫ్రీగా వై-పై యాక్సెస్‌ని అందిస్తుంది. ఇలా ఫ్రీగా వై-పై యాక్సెస్‌ని పాసింజర్స్‌కు అందించడానికి గల కారణాలను కూడా వెల్లడించారు. ఐటి హాబ్‌గా పిలవబడే బెంగుళూరు మాహా నగరం ఎన్నో సాఫ్ట్ వేర్ కంపెనీలకు నిలియం. ఈ బెంగుళూరు మహానగరానికున్న మరో పేరు 'సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా'.

భారతదేశం మొత్తంలో ఎక్కవ మంది టెక్నికల్ ప్రోపెషనల్స్ నివసించే నగరంగా బెంగుళూరు ఇప్పటికే గుర్తింపు పొందింది. టెక్నాలజీ పరంగా ఎదుగుతున్న బెంగుళూరు మహా నగరంలో నమ్మమెట్రో సేవలను అందరూ టెక్నికల్ ప్రోఫెషనల్స్ ఉపయోగించుకునే విధానంలో ఈ ఫ్రీ వై-పై ప్రకటించడం జరిగిందన్నారు. నమ్మమెట్రో నగరానికి రావడం వల్ల ట్రాఫిక్ సమస్యలు కూడా కొంత వరకు తీరనున్నాయని తెలిపారు.

2014వ సంవత్సరం నాటికి నమ్మమెట్రో సేవలను 42.3 కిలోమీటర్ల వరకు విస్తరించనున్నామని మెట్రో అధికారులు తెలియజేశారు. నగరం మొత్తం మీద మెట్రో ఎక్కడెక్కడైతే ప్రయాణం చేస్తుందే అన్ని చోట్ల కూడా ఫ్రీ వై-పైని అందిస్తామని అన్నారు. వీటితో పాటు త్వరలో బెంగళూరులోని మిన్స్‌స్క్వేర్ నుంచి దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయం వరకు రూ. 6 వేల కోట్లతో హైస్పీడ్ రైలు ప్రాజెక్టును చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ హైస్పీడ్ రైలు గంటకు 145 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందన్నారు. నమ్మ మెట్రో కర్ణాటక ప్రజలకు దీపావళి కానుక అన్నారు.

కార్యక్రమంలో ముఖ్యమంత్రి డి.వి.సదానందగౌడ, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి మొయిలీ, రైల్వే సహాయ మంత్రి మునియప్ప, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీ తదితరులు పాల్గొన్నారు. మెట్రో రైలులో ఒక్కో ట్రిప్పునకు 1000 మంది ప్రయాణించవచ్చు. టికెట్టు ధర కని ష్టం రూ.10, గరిష్టం రూ.15. పూర్తి ఎయిర్ కండీషన్‌తో కూడిన రైలు బోగీల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు అమర్చడం జరిగింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting