యాప్స్ ద్వారా ఆటో, క్యాబ్‌లు బుకింగ్ చేస్తుంటారా.. ఇటీవల ఏం జరిగిందో తెలుసా?
భారత్‌లో ప్రస్తుతం ప్రభుత్వ రవాణా వ్యవస్థలతోపాటు ప్రైవేటు వాహనాలు కూడా భారీగా అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్‌ల వంటి ప్రాంతాల్లో ఆటో, క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అనేక మంది వివిధ రకాల యాప్‌ల ద్వారా క్యాబ్‌లను బుకింగ్ చేసుకొని, ప్రయాణాలు చేస్తున్నాం. అయితే పలు చోట్ల ప్రయాణికులను మోసం చేసేందుకు క్యాబ్ డ్రైవర్‌లు నకిలీ యాప్‌లను వినియోగిస్తున్నారు. తాజాగా ఈ తరహా ఘటనలో వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో (Bangalore Taxi Scam) తనకు ఎదురైన అనుభవాన్ని ఓ ప్రయాణికుడు వివరించారు.
రైడ్ ప్రారంభం సమయంలో :
బెంగళూరు ఎయిర్‌పోర్టు వద్ద ఓ క్యాబ్ డ్రైవర్ నకిలీ ఉబర్ యాప్‌తో మోసానికి పాల్పడిన ఘటనను సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వివరించారు. బెంగళూరుకు చెందిన టెకీ మహేష్ సుతార్ ఎయిర్‌పోర్టు వద్ద ఓ ట్యాక్సీని బుకింగ్ చేసుకున్నారు. అయితే ట్యాక్సీలోకి ప్రవేశించిన అనంతరం రైడ్ ప్రారంభం సమయంలో ఉబర్‌ను పోలిన యాప్‌ను గుర్తించారు.

అనంతరం క్యాబ్ దిగుతున్న సమయంలో రూ.1000 బిల్ రావడాన్ని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గుర్తించారు. ధర ఎక్కువగా ఉండడంతో అదనంగా ఛార్జీలు ఎందుకు వసూలు చేస్తున్నారంటూ క్యాబ్ డ్రైవర్‌ను ప్రశ్నించినట్లు చెప్పారు. అయితే GST నే ఇందుకు కారణమని డ్రైవర్ సమాధానం ఇచ్చారన్నారు. దీంతోపాటు బిల్ ఇచ్చేందుకు కూడా డ్రైవర్ నిరాకరించారని.. వచ్చే నెలలో ఈమెయిల్ ద్వారా పంపుతానంటూ క్యాబ్ డ్రైవర్ సమాచారం ఇచ్చినట్లు టెకీ తెలిపారు.
ఈ యాప్ ద్వారా మోసాలు! :
ఈ ఘటనలపై అనుమానం వ్యక్తం చేసిన మహేష్ సుతార్, నకిలీ యాప్‌తో క్యాబ్ డ్రైవర్ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. Blumeter యాప్ ద్వారా క్యాబ్ ఛార్జీల్లో మార్పులు చేసినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే బిల్ కావాలని తాను కోరానని, అయితే అందుకు క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాధానంపైనా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
వచ్చే నెలలో బిల్లు పంపిస్తా..! :
ప్రస్తుతం బిల్లింగ్ సిస్టమ్ పనిచేయడం లేదని, వచ్చే నెలలో బిల్లు పంపిస్తానని క్యాబ్ డ్రైవర్ చెప్పినట్లు టెకీ తెలిపారు. అయితే సదరు క్యాబ్ డ్రైవర్ తన మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ తీసుకోలేదని చెప్పుకొచ్చారు. బిల్ ఎలా పంపిస్తారని.. ఈ తరహా ఘటనలపై ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అదనపు ఛార్జీలు ఉన్నాయా :
అయితే ఏదైనా సందర్భంగా ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి. ఉబర్, ఓలా వంటి యాప్‌ల ద్వారా క్యాబ్‌లు సహా ఇతర సర్వీసులను బుకింగ్ చేసుకున్న సమయంలోనే ఎంత ఛార్జీలు వసూలు చేస్తున్నారో యాప్‌లో తనిఖీ చేయాలి. దీంతోపాటు ఏమైనా అదనపు ఛార్జీలు ఉన్నాయా లేదా డ్రైవర్‌ను అడిగి తెలుసుకోవాలి.
అధికారులకు ఫిర్యాదు చేయాలి :
ఎయిర్‌పోర్ట్, బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ సహా ఇతర పర్యాటక ప్రాంతాల్లో ఈ తరహా మోసాలను గుర్తిస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. ఏదైనా ప్రయాణాల్లో సమయంలో నకిలీ యాప్‌లను గుర్తిస్తే రవాణా అధికారులకు సమాచారం అందించడం సహా ఫిర్యాదు చేయాలి.


Click it and Unblock the Notifications








