బెంగుళూరు రహదారుల పై ఉచిత ‘నమ్మా వై-ఫై’ సేవలు!

Posted By:

బెంగుళూరు వాసులకు శుభవార్త.. నగరంలోని ఎంజి రోడ్, బ్రిగేడ్ రోడ్ ఇంకా నాలుగు ఇతర ప్రాంతాల్లో శుక్రవారం నుంచి ఉచిత వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్టువిటీ సేవలు ప్రారంభం కానున్నాయి. ‘నమ్మా వై-ఫై'(‘Namma Wifi') పేరుతో ప్రారంభించబడుతున్న ఈ ఉచిత ఇంటర్నెట్ సర్వీస్‌ను దేశంలో ప్రారంభించటం ఇదే మొదటిసారి.

బెంగుళూరు రోడ్ల పై ఉచిత ఇంటర్నెట్!

ఆయా అనుకూల ప్రాంతాల (హాట్‌స్పాట్‌ల) వద్ద ఉచిత వై-ఫైను యాక్సిస్ చేసుకోదలచిన వారు ముందుగా తమ డివైస్‌లోని బ్రౌజర్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. వెనువెంటనే ‘నమ్మా వైఫై' పేజీకి సదరు బ్రౌజర్ మరల్చబడుతుంది. వై-ఫైను యాక్సిస్ చేసుకునే క్రమంలో మీ మొబైల్ ఫోన్‌కు ఓ పాస్‌వర్డ్ పంపబడుతుంది. ఆ పాస్‌వర్డ్ ఆధారంగా రోజు మొత్తం మీద 30 నిమిషాల పాటు ఉచితంగా ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకునే అవకాశాన్నీ మీకు కల్పిస్తారు. హాట్‌స్సాట్‌ల వద్ద ఇంటర్నెట్ వేగం 512కేబీపీఎస్‌గా ఉండొచ్చని తెలుస్తోంది.

నమ్మా ఉచిత వై-ఫై సర్వీసులు నగరంలోని శాంతినగర్, యశ్వంతపూర్, కోరమంగలా, ఇందిరానగర్ ప్రాంతాల్లోని ట్రాఫిక్ ఇంకా ట్రాన్స్‌మిట్ మేనేజిమెంట్ సెంటర్స్ (టీటీఎంసీలు)లోనూ శుక్రవారం నుంచే ప్రారంభం కానున్నాయి.

రానున్న నెలల్లో నమ్మా వై-ఫై సర్వీసులను మైసూర్, మంగళూరు, హుబ్లి-దార్వాడ్ ఇంకా ఉత్తర కర్ణాటకలోని పలు పట్టణాల్లో అమల్లోకి తీసుకురానున్నారు. ఈ ప్రాజెక్ట్ రూపకల్పనలో భాగంగా బెంగుళూరు రాష్ట్ర సర్కారు, D-VoiS అనే ప్రైవేట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌తో ఒప్పందాన్ని కదుర్చుకుంది. బెంగుళూరులోని మరో 10 ప్రాంతాలకు ఈ నమ్మా వై-ఫై సేవలను విస్తరించనున్నట్లు సమాచారం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting