చరిత్రలో అతి పెద్ద హ్యాకింగ్ : ఒక్క పదం మార్చి రూ. 673 కోట్లు దోపీడి

Posted By:

చరిత్రలో కనీవినీ ఎరుగని దోపిడి...అదీ హ్యాకింగ్ ద్వారా...లక్షా ..రెండు లక్షలు కాదు..ఏకంగా 630 కోట్లు...అదీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న దేశం బంగ్లాదేశ్‌లో..ఇప్పుడు ఈ హ్యాకింగ్ దోపిడి బంగ్లాదేశ్ ను కుదిపేస్తోంది. ఒకే ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్‌తో హ్యాక్లరు ఈ దందాకు పాల్పడ్డారు. మరి ఎవరు చేశారు ఈ హ్యాకింగ్..మరెవరు భాద్యులయ్యారు.. అసలేం జరిగింది..వాచ్ దిస్ స్టోరీ.

Read more: అమెజాన్‌లో మారణాయుధాలు: ఘాతుకానికి ఒడిగడుతున్న పిల్లలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకు దోపిడీ ఇప్పుడు బంగ్లాదేశ్‌ను కుదిపేస్తున్నది. సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ ద్వారా బంగ్లాదేశ్ సెంట్రల్‌ బ్యాంకు నుంచి సుమారు 10.1 కోట్ల డాలర్ల (రూ.673 కోట్లు) సొమ్ము కొల్లగొట్టడం కలకలం రేపుతోంది. ఈ అంశం బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేస్తోంది.

2

ఈ వ్యవహారంలో సెంట్రల్ బ్యాంకు గవర్నర్ అతివుర్ రహ్మాన్‌ తన పదవికి రాజీనామా చేసినట్టు బంగ్లాదేశ్ ఆర్థికమంత్రి వెల్లడించారు. తన సూచన మేరకు ఆయన పదవి నుంచి తప్పుకొన్నట్టు చెప్పారు.

3

మానవ చరిత్రలోనే అతిపెద్ద సైబర్ రాబరీగా ఈ దొంగతనం నిలిచిపోయింది. దీంతో బంగ్లాదేశ్ వద్ద ఉన్న 27 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యానికి భద్రత ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ దోపిడీ వ్యవహారం బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

4

తమ అమెరికా ఖాతాలో బిలియన్ డాలర్ల (రూ. 6,740 కోట్ల)ను దోచుకోవడానికి హ్యాకర్లు ప్రయత్నించారని, అయితే డబ్బు ట్రాన్స్‌ఫర్ విజ్ఞప్తికి చివరినిమిషంలో రెడ్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా ఈ దోపిడీని చాలావరకు నిరోధించామని బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంకు చెప్తోంది.

5

అమెరికా రిజర్వు బ్యాంకు అయిన న్యూయార్క్ ఫెడ్‌లోని బంగ్లా ఖాతా నుంచి డబ్బు ఉపసంహరణకు హ్యాకర్లు 35 విజ్ఞప్తులు పంపడమే కాకుండా, బ్యాంకుల మధ్య ఉండే కమ్యూనికేషన్ గ్యాప్‌ను వాడుకొని డబ్బు యావత్తును ఊడ్చిపారేసేందుకు ప్రయత్నించారు.

6

ఈ వ్యవహారంలో అమెరికా రిజర్వు బ్యాంకు సిస్టం సరిగ్గా పనిచేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, అది మాత్రం ఆరోపణలను తోసిపుచ్చుతోంది. హ్యాకర్ల నుంచి భారీగా సొమ్ము రికవరీ చేశామని, నేరగాళ్ల నుంచి దోపిడీకి గురైన మిగతా డబ్బు కూడా రాబట్టేందుకు ఫిలిపీన్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని బ్యాంకు అధికారులు చెప్తున్నారు.

7

ఏడేళ్లపాటు ఈ పదవిలో ఉన్న రహ్మాన్ అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ, దేశ హితం కోసం తాను తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలి పారు. నిధుల దొంగిలింపు వ్యవహారం మిలిటెంట్ల దాడిలా ఉంద న్నారు.

8

హ్యాకర్లు 10.1 కోట్ల డాలర్లను కొల్లగొట్టారని, 8.1 కోట్ల డాలర్లు ఫిలిప్పీన్స్‌కు, మిగతా డబ్బులు శ్రీలంకకు తరలించారని బ్యాంకు ప్రతినిధి తెలిపారు. శ్రీలంకకు చేరిన సొమ్ములోంచి కొంత రికవరీ చేశామని, ఫిలిప్పీన్స్‌కు చేరిన సొమ్ము క్యాసినోల వ్యాపారంలోకి మళ్లించి నట్లు తెలిసిందన్నారు.

9

హ్యాకర్లు బంగ్లా ప్రభుత్వ రహస్య సమాచారాన్ని దొంగిలించి ప్రభుత్వం నుంచి వచ్చినట్లుగానే నిధుల బదిలీకి అభ్యర్థనలు పంపారని, అయితే శ్రీలంకలోని ఒక సంస్థకు బదిలీకి సంబంధించి స్పెల్లింగ్ తప్పుగా ఇవ్వడంతో పునఃపరిశీలన చేయగా వ్యవహారం బయటకు వచ్చిందన్నారు.

10

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 1 billion cyber heist against Bangladesh central bank was thwarted by a spelling error
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot