ప్రపంచపు అతిపెద్ద సెల్ఫీ@బంగ్లాదేశ్

నోకియా లుమియా 730 స్మార్ట్‌ఫోన్‌తో 1,151 మంది సెల్ఫీ ప్రేమికులు తీసుకున్న ఓ సెల్ఫీ ప్రపంచంలోనే అతిపెద్ద సెల్ఫీగా రికార్డ్ నమోదు చేసింది. బంగ్లాదేశ్‌లో లుమియా 730 స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలో భాగంగా ఈ సెల్ఫీని చిత్రీకరించారు. ఈ మధ్య శ్రేణి విండోస్ ఆధారిత ఫోన్‌లోని 5 మెగా పిక్సల్ కెమెరా సామర్థ్యాన్ని ప్రచారం చేసే క్రమంలో ఈ సెల్ఫీని కంపెనీ చిత్రీకరించారు.
మైక్రోసాఫ్ట్ లుమియా బాంగ్లాదేశ్ పేజీలో ఈ ఫోటో హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రానికి ఇప్పటి వరకు 33576 లైక్స్ లభించాయి. ఈ సెల్ఫీని గిన్నిస్ వరల్డ్ త్వరలోనే గుర్తించే అవకాశం ఉంది.
నోకియా లూమియా 730 డ్యూయల్ సిమ్ స్పెసిఫికేషన్‌లు:
డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 4.7 అంగుళాల క్లియర్ బ్లాక్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, విండోస్ ఫోన్ 8.1 మొబైల్ ఆపరేటింగ్ సిస్టం, 6.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, 3జీ/2జీ, జీపీఎస్, నోకియా మ్యాప్స్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్), 2220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ మందం 8.7 మిల్లీమీటర్లు, బరువు 130 గ్రాములు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications