అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేయాలంటే ఓనర్ పర్మిషన్ కావాల్సిందే

By Gizbot Bureau
|

నోట్లరద్దు సమయంలో పలువురి ఖాతాల్లో వారికి తెలియకుండా అక్రమంగా నగదు చేరినట్లుగా ఆరోపణలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడు దీనికోసం జన్ ధన్ ఖాతాలను ఎక్కువగా వినియోగించుకున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఖాతాదారులకు తెలియకుండానే వారి అకౌంట్లలో అమౌంట్ పడిపోయింది. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది.

Banks may need to seek customer consent for receiving deposits

ఇకపై ఎవరి అకౌంట్ లో అయినా డబ్బులు వెయ్యాలంటే మాత్రం ఆ ఖాతాదారుడి(అకౌంట్ యజమాని) పర్మిషన్ కచ్చితంగా తీసుకోవాలట. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ఇప్పటికే వెల్లడించినా.. లేటెస్ట్ గా దీనికి సంబంధించి ఆర్బీఐకి కేంద్రం లేఖ రాసింది.

ట్రాన్సాక్షన్ అనుమతి/తిరస్కరణ

ట్రాన్సాక్షన్ అనుమతి/తిరస్కరణ

ఎవరి అకౌంట్‌లోనైనా అమౌంట్ క్రెడిట్ అయితే వారికి తెలిసి జరగాలని, తమ అకౌంట్‌లోకి ట్రాన్సాక్షన్ తిరస్కరించాలా లేదా అనుమతించాలా హక్కు అకౌంట్ హోల్డర్ కలిగి ఉండేలా నిబంధనలు ఉండాలని, దీనిపై అభిప్రాయం తెలపాలని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అభిప్రాయాన్ని కోరింది.

ఖాతాదారుడికి నోటిఫై

ఖాతాదారుడికి నోటిఫై

ఎవరి ఖాతాలోనైనా డబ్బు జమ చేయాలంటే ఆ ఖాతాదారుడి అనుమతి సైతం తీసుకొనే విధానాన్ని బ్యాంకులు త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. కొత్తగా తీసుకుని రాబోతున్న విధానంలో ఎవరైనా ఏదైనా అకౌంట్ లో డబ్బులు జమ చేయాలంటే ముందుగా సదరు ఖాతాదారుడికి నోటిఫై చేస్తారు. వారు అనుమతి ఇస్తేనే డబ్బులు డిపాజిట్‌ అవుతాయి. డబ్బులు వెయ్యడం వెయ్యించుకోకపోవడం అనేది ఆ ఖాతాదారుని ఇష్టం మేరకే జరుగుతుంది.

నగదు జమ విషయంలో

నగదు జమ విషయంలో

నూతన విధానంలో ఎవరైనా ఏదైనా ఖాతాలో డబ్బులు జమ చేయాలంటే ముందు సదరు ఖాతాదారుడికి నోటిఫై చేస్తామని, వారు అనుమతిస్తే డబ్బులు డిపాజిట్ అవుతాయని ఈ అంశంతో సంబంధం ఉన్న ఓ అధికారి వెల్లడించారు. లావాదేవీని అనుమతించడం/తిరస్కరించడం ఖాతాదారుడి అభీష్టానికే వదిలేయబడుతుందన్నారు. నగదు జమ విషయంలో అకౌంట్ ఓనర్ ఏది అనుకుంటే అదే జరిగేలా ప్రస్తుతం ఉన్న విధానంలో మార్పులు తీసుకురాబోతున్నారు.

అందరికీ అందుబాటులోకి రాదా?

అందరికీ అందుబాటులోకి రాదా?

కేంద్రం అడుగుల నేపథ్యంలో ఎవరి ఖాతాలోనైనా డబ్బు జమ వేయాలంటే ఆ ఖాతాదారుడి అనుమతి తీసుకునే విధానం త్వరలో బ్యాంకులు తీసుకు రానున్నాయని అర్థమవుతోంది. అయితే ఈ సేవలు అందరికీ అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ సేవలు పొందేందుకు బ్యాంకులకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం ఖాతాదారుడికి తన అకౌంట్‌కు సంబంధించిన డిపాజిట్లపై ఎటువంటి నియంత్రణ లేదు. కేవలం అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఉంటే జమ చేయవచ్చు.

 అందరికీ అందుబాటులో ఉండే అవకాశం లేదు

అందరికీ అందుబాటులో ఉండే అవకాశం లేదు

అయితే ఈ సేవలు అందరికీ అందుబాటులో ఉండే అవకాశం లేదని కూడా తెలుస్తుంది. ఈ సేవలను పొందాలంటే.. బ్యాంకులకు కొంత మొత్తం చెల్లించాలి. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం.. ఖాతాదారుడికి తన అకౌంట్‌కి సంబంధించిన డిపాజిట్లపై ఎటువంటి నిబంధనలు ఎవరైనా ఎవరి అకౌంట్ లో అయినా డబ్బులు జమ చేయవచ్చు. కేవలం అకౌంట్ నెంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఉంటే చాలు. కానీ కొత్తగా తీసుకుని రాబోతున్న విధానంలో బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేయాలంటే యజమాని పర్మిషన్ తప్పక కావాలి.

Best Mobiles in India

English summary
Banks may need to seek customer consent for receiving deposits, Centre consulting RBI: report

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X