బ్యాంకులకు కీలకమైన సూచనలు జారీ చేసిన టెలికమ్యూనికేషన్ శాఖ
టెక్నాలజీ అమిత వేగంగా మారిపోతోంది. 2జీ నుంచి 3జీ .. ఇప్పుడు అంతా 4 జీ ఇంటర్నెట్. ఇక సమీప భవిష్యత్‌లో హై స్పీడ్ ఇంటర్నెట్ 5 జీ రానుంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు ఏటీఎంల్లో కూడా కొత్త సాఫ్ట్ వ
టెక్నాలజీ అమిత వేగంగా మారిపోతోంది. 2జీ నుంచి 3జీ .. ఇప్పుడు అంతా 4 జీ ఇంటర్నెట్. ఇక సమీప భవిష్యత్‌లో హై స్పీడ్ ఇంటర్నెట్ 5 జీ రానుంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు ఏటీఎంల్లో కూడా కొత్త సాఫ్ట్ వేర్ అప్ డేట్ అయ్యాయి. అయితే.. ఇప్పటివరకూ కస్టమర్లకు బ్యాంకులు అందించే పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) మిషన్లు మాత్రం ఇంకా అప్ గ్రేడ్ కాలేదు. ఈ PoS మిషన్లు ఇంకా 2G టెక్నాలజీ సర్వీసు ఆధారంగా పనిచేస్తున్నాయి.

ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు తమ పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మిషన్లను హై స్పీడ్ ఇంటర్నెట్‌కు తగినట్టు అప్ గ్రేడ్ చేసుకోవాలని టెలికాం శాఖ స్పష్టంచేసింది. లేదంటే సంబంధిత బ్యాంకులు ఇబ్బందిని ఎదుర్కొవాల్సి వస్తోందని సూచించింది.

3జీ లేదా 4జీ టెక్నాలజీ సర్వీసులకు
ప్రస్తుతం బ్యాంకింక్ రంగాల్లో వినియోగించే పీఓఎస్ మిషన్లు 2జీ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తున్నాయి. వెంటనే.. పీఓఎస్ మిషన్లను 3జీ లేదా 4జీ టెక్నాలజీ సర్వీసులకు అప్ గ్రేడ్ అవ్వాలని టెలికం శాఖ జాయింట్ సెక్రటరీ అమిత్ యాదవ్ తెలిపారు.

పీఓఎస్ సాఫ్ట్ వేర్ ను అప్ గ్రేడ్ చేయడం
పీఓఎస్ మిషన్లను అప్ గ్రేడ్ చేయని పక్షంలో ఫైనాన్షియల్ గా సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురువుతుందని అన్నారు. ముందు జాగ్రత్త చర్యగా పీఓఎస్ సాఫ్ట్ వేర్ ను అప్ గ్రేడ్ చేయడం ఎంతో ముఖ్యమని అమిత్ తెలిపారు. ప్రస్తుతం అడ్వాన్స్ డ్ టెక్నాలజీ అందుబాటులో ఉందని చెప్పారు.

5G టెక్నాలజీ సర్వీసు ల్యాబ్
ఈ నేపథ్యంలోనే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్ కు సంబంధించి ఇన్స్ స్టిట్యూట్ ఫర్ డెవలప్ మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (IDRBT)పేరుతో 5G టెక్నాలజీ సర్వీసు ల్యాబ్ ను ప్రారంభించారు. అత్యంత అడ్వాన్స్ డ్ 5జీ టెక్నాలజీ సర్వీసు అందుబాటులోకి వచ్చిందని, ఈ టెక్నాలజీకి అనుగుణంగా బ్యాంకింగ్ సెక్టార్ లో టెక్నాలజీ సర్వీసులు కూడా అప్ డేట్ కావాల్సి ఉందన్నారు.

మొబైల్ ఫోన్ యూజర్లు
మూడేళ్లలో దేశంలో మౌలిక సదుపాయాలు మెరుగయి, ఎన్నో మొబైల్ టవర్ల నిర్మాణం జరిగిందని, రెండు లక్షల నుంచి 5 లక్షల వరకు మొబైల్ టవర్లు పెరిగిపోయాయని ఆయన తెలిపారు. బేస్ టవర్ స్టేషన్లు (BTS) కూడా 6 లక్షల నుంచి 20 లక్షలకు పెరిగాయి. మొబైల్ ఫోన్ యూజర్లు కూడా 1.2 బిలియన్ల (120 కోట్లు) మంది పెరిగినట్టు యాదవ్ తెలిపారు.


Click it and Unblock the Notifications