ఇతర ఏటీఎంలలో బ్యాలెన్స్ చెక్ చేస్తే డబ్బులు కట్టాల్సిందే...!

Posted By: Super

ఇతర ఏటీఎంలలో బ్యాలెన్స్ చెక్ చేస్తే డబ్బులు కట్టాల్సిందే...!

మీరు ఇతర బ్యాంకుల ఏటీఎం మిషన్ల నుంచి బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్ లావాదేవీలు నిర్వహిస్తున్నారా? అయితే ఇక నుంచి ఈ లావాదేవీలకు ఫీజు రూపంలో కొంత మొత్తం చెల్లించాల్సిందే. జూలై 1 నుంచి ఇతర ఏటీఎంల ద్వారా నిర్వహించే అన్ని నాన్ ఫైనాన్షియల్ వ్యవహారాలపై ఫీజు వసూలు చేయాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ఇతర ఏటీఎంల నుంచి చేసే మొదటి 5 లావాదేవీలకు ఎటువంటి ఫీజును వసూలు చేయటం లేదు.

ఇవి కాకుండా బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి నాన్ ఫైనాన్షియల్ సేవలను కూడా ఈ అయిదు లావాదేవీల పరిధిలోకి తీసుకువచ్చారు. వినియోగదారులు అధికస్థాయిలో నాన్ ఫైనాన్షియల్ సేవలను వినియోగిస్తుండటంతో, వీటిని కట్టడి చేయడానికి ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏప్రిల్ నెలలో మొత్తం ఏటీఎం లావాదేవీల్లో 28 శాతం వాటా బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినిస్టేట్‌మెంట్ వంటివే ఉన్నాయి. ఈ మధ్యనే ఏటీఎంల లావాదేవీల్లో ఏవైనా పొరపాట్లు జరిగితే వాటిని వారం రోజుల్లో సరి చేయాలని లేకపోతే రోజుకు రూ.100లు చెల్లించాల్సి ఉంటుందని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది. ఈ నిర్ణయం కూడా జూలై1 నుంచి అమలులోకి రానుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot