మొన్న ట్విట్టర్, నేడు గూగుల్ ప్లస్: ఒబామా

Posted By: Staff

మొన్న ట్విట్టర్, నేడు గూగుల్ ప్లస్: ఒబామా

అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా నవంబర్ 23వ తారీఖున సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ వెబ్ సైట్ గూగుల్ ప్లస్‌లో చేరడం జరిగింది. అంతక ముందు ఒబామా ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో ఎకౌంట్లు ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. బరాక్ ఒబామా పేరుతో గూగుల్ ప్లస్‌లో ఓపెన్ చేసిన ఈ పేజి ద్వారా బరాక్ ఒబామాని, అతని టీమ్‌తో మనం సంభాషణలు కొనసాగించవచ్చు. ఈ ఎకౌంట్‌ని క్షుణ్ణంగా పరిశీలించిన సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగల్ ఈ ఎకౌంట్ ఒబామాదేనని ధృవీకరించింది.

గతంలోనే బరాక్ ఒబామా గూగుల్ ఎకౌంట్ కలిగి ఉన్నప్పటికీ అధికారకంగా ఇప్పుడు ప్రకటించడం జరిగింది. టెక్నాలజీని ఉపయోగించడంలో ప్రపంచంలో ఉన్న అందరి ప్రెసిడెంట్స్‌తో పొల్చితే గనుక బరాక్ ఒబామాకి మొదటి స్దానం ఇవ్వోచ్చు. దీనికి ఉదాహారణ గతంలో ఒబామా ఎలక్షన్ క్యాంపెయిన నిర్వహించిన సందర్బంలో ట్విట్టర్‌ని ఉపయోగించిన సంగతి తెలిసిందే. ఒబామాకి మిలియన్ ఫాలోవర్స్ ఫాలో అవుతున్న విషయం తెలిసిందే.

కాకపొతే ఇప్పడు బరాక్ ఒబామా ఇప్పడు కొత్తగా చేరిన గూగుల్ ప్లస్ ద్వారా ప్రజలతో ఎలా మమేకం అవుతారనే ప్రశ్న అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అంతేకాకుండా రాబోయే ఎలక్షన్స్‌లో గూగుల్ ప్లస్‌ని ఏ విధంగా తన ఎలక్షన్ క్యాంపెయిన్‌కి ఉపయోగించుకొనున్నారనేది అందరి మదిలో ఉన్న ప్రశ్న.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot