జాబ్స్ ఆత్మకధలో ఒబామా గురించి ఆసక్తికర అంశాలు

Posted By: Super

జాబ్స్ ఆత్మకధలో ఒబామా గురించి ఆసక్తికర అంశాలు

యాపిల్ కంపెనీ సహా వ్యవస్దాపకుడు స్టీవ్ జాబ్స్ మరణానంతరం ఆయన పేరు మీద విడుదల చేసిన పుస్తకంలో రొజురొజుకీ ఓ కొత్త సంఘటన, ఆసక్తికర విషయాలు ప్రపంచానికి తెలుస్తున్నాయి. మొన్న స్టీవ్ జాబ్స్ మైక్రో సాప్ట్ చైర్మన్ బిల్ గేట్స్‌కి సృజనాత్మకత లేదు అనే విషయం బయటకు రాగా, ఇప్పడు ఏకంగా అమెరికా అద్యక్షుడు బరాక్ ఒబామా గురించిన ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి.

బరాక్ ఒబామాని ఒకసారి స్టీవ్ జాబ్స్ కలసినప్పడు నువ్వు అమెరికాకి ఒక్కసారికి మించి అద్యక్షుడివి కాలేవని అన్నాడంట. స్టీవ్ జాబ్స్, ఒబామాకి సూటిగా చెప్పడానికి గల కారణాలు ఏమై ఉంటాయని ఆరా తీస్తే సిలికాన్‌ వ్యాలీ ఎగ్జిక్యూటివ్స్‌లో ఉన్న నిర్వేదం, అసంతృప్తే అలా ఆయన చేత అనిపించాయని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే బరాక్ ఒబామాకి స్టీవ్ జాబ్స్ పెద్ద అభిమాని. అమెరికా అద్యక్షుడిగా బరాక్ ఒబామా గెలుపొందడానికి స్టీవ్ బాజ్స్ చేసిన్ సేవలు అభినందనీయం.

బరాక్ ఒబామా, స్టీవ్ జాబ్స్ చాలు సార్లు కలుసుకున్నప్పటికీ, స్టీవ్ జాబ్స్ ఇచ్చిన కొన్ని అమూల్యమైన సలహాలు ఒబామా పరిగణలోకి తీసుకొలేదనే కొపంతో జాబ్స్ అలా ప్రవర్తించారని మరికొందరు అంటున్నారు. అమెరికా ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు కొత్త కొత్త ఆలోచనలను పంచుకోవడానికి గాను ఆరుగురు సీఈఓలతో ఒక కమిటీ వేయాలని జాబ్స్‌ సూచించారు. కాని ఒబామా మాత్రం ఆ బాధ్యతను తన వైట్‌ హౌస్‌ అధికారులకు అప్పగించి చేతులు దులుపుకొన్నారు.

అలాగే మరోసారి ఒక డిన్నర్‌ పార్టీలో కలుసుకున్నారు. ఫేస్‌బుక్‌ వ్యవస్ధాపకుడు మార్క్‌ జుకర్‌బెర్గ్‌కు, జాబ్స్‌కు మధ్య కూర్చున్న ఒబామాతో అమెరికాలో సుశిక్షితులైన ఇంజినీర్ల అవసరం ఎంతో ఉందని అన్నారంట. దానికి ఏమి చేయాలో కూడా ఆయనకు సలహా ఇచ్చారు. అమెరికాలో ఇంజినీరింగ్‌ డిగ్రీ చేసిన విదేశీ విద్యార్దులకెవరికైనా అమెరికాలో ఉండేందుకు వీసా ఇచ్చేయాలని సూచించారంట. దానికి ఒబామా ఈ పని చేయడానికి భారీ ఎత్తున వలస నిబంధనలను సవరించాల్సి ఉంటుందని, అంతేకాకుండా బోలెడు సంస్కరణలు తేవాలని ఊరికుండిపోయారని సమాచారం. రాజకీయాలు దేశాన్ని ఎలా పక్షవాతానికి గురి చేస్తాయో తెలుసుకునేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలునని జాబ్స్‌ తన ఆత్మకధలో వ్యాఖ్యానించారు.

‘అధ్యక్షుడు చాలా తెలివైన వాడు. పనులు ఎందుకు జరగవో వెతికి వెతికి కారణాలు చెప్పడమంటే ఆయనకు మహా సరదా’ అని జాబ్స్‌ బాహాటంగానే విమర్శించారు. అమెరికాలో తనకు 30 వేల మంది ఇంజినీర్లు దొరకలేదని, అందుకే చైనాలో తాను ఏడు లక్షల మంది ఉద్యోగుల్ని పెట్టుకోవాల్సి వచ్చిందని జాబ్స్‌ ఒబామాతో అన్నారు. అమెరికాలో ఉన్న విదేశీయుల్లో 70 శాతం మంది ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో డాక్టరేట్లు. మరో సగం మంది మాస్టర్స్‌ డిగ్రీలు చేసిన వాళ్లే.

వాళ్లందర్నీ అమెరికాలోనే ఉండనిస్తే, దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ మాటకొస్తే సిలికాన్‌ వ్యాలీలో సగానికి సగం కంపెనీలు విదేశీయులవే. అమెరికాలో ఏడాదికి లక్షా నలభై వేల గ్రీన్‌ కార్డులు జారీ చేస్తారు. నిజానికి ఇవి ఎంత మాత్రం చాలవని బయోగ్రఫీలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై విమర్శలు గుప్పించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot