మరోమారు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

Posted By: Staff

మరోమారు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈసారి సోషల్ నెట్‌వర్కింగ్ వైబ్‌సైట్ల ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రెండోసారి అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ఒబామా, ఫేస్‌బుక్, ట్విట్టర్ల ద్వారా ప్రచారపర్వాన్ని ప్రారంభించారు. వాషింగ్టన్‌లోను, దేశంలోని ఇతర ప్రాంతాల్లోను జరుగుతున్న ఎన్నికల ఏర్పాట్ల వివరాలను ఎప్పటికప్పుడు ఒబామా పేరిట ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో గల పేజీల ద్వారా వెల్లడించనున్నట్లు ఆయన ప్రచార సిబ్బంది వెల్లడించారు. మార్పు మంత్రంతో 2008 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఒబామా, ఈసారి కూడా మార్పు మంత్రాన్నే జపిస్తున్నారు. మార్పు ద్వారా కొత్త అవకాశాలు ఏర్పడతాయని చెబుతున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో ఒబామా ప్రచారానికి భారీ స్పందనే లభిస్తోంది.

ట్విట్టర్‌లో ఆయనను అనుసరించేవారు 86.90 లక్షల మందికి పైగా ఉంటే, ఫేస్‌బుక్‌లో 2.16 కోట్ల మంది ఆయనకు ఆమోదం తెలిపారు. ప్రజాప్రతినిధుల ‘గోల్ఫ్ సమ్మిట్’లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రతినిధుల సభ స్పీకర్ జాన్ ఏ బోహ్నెర్‌తో కలసి కాసేపు గోల్ఫ్ ఆడారు. మేరీల్యాండ్‌లోని ఆండ్రూస్ వైమానిక దళం స్థావరంలో శనివారం జరిగిన ఈ క్రీడోత్సవంలో అమెరికా ఉపాధ్యక్షుడు జోసెఫ్ బైడన్, ఓహయో గవర్నర్ జాన్ ఆర్ కాసిష్ తదితరులు పాల్గొన్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting