Home
News

రూ.12.5లక్షలు గెలుచుకునే అవకాశం!! బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ గేమింగ్ మాస్టర్ ఈవెంట్

టెక్నాలజీ పెరిగే కొద్ది ప్రజలు కూడా అధికంగా దాని మీద ఆధారపడుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో ప్రజలు ప్రతి అవసరానికి దీనినే వాడడానికి ఇష్టపడుతున్నారు. స్మార్ట్ ఫోన్లను ఉపయోగించి డబ్బులను ఇతరులకు పంపడం మరియు స్వీకరించడమే కాకుండా డబ్బులను సంపాదించే కొన్ని మార్గాలను కూడా చూపిస్తున్నాయి. స్మార్ట్ఫోన్లను ఉపయోగిస్తున్న వారు సరద కోసం గేమ్లను ఆడడం వంటివి చేస్తున్నారు. అయితే ఇదే గేమ్ల సహాయంతో డబ్బులను సంపాదించే అవకాశమే వస్తే ఎలా ఉంటుంది? నిజమే ఇటువంటి గొప్ప అవకాశం ఇప్పుడు వచ్చింది.

బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా

వివరాలలోకి వస్తే ఇండియాలో మొబైల్ గేమ్లలో అధికంగా ఇష్టపడే గేమ్ లలో బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఒకటి. ఈ గేమ్ ఇప్పుడు తన యొక్క వినియోగదారులకు కొత్తగా 'గేమింగ్ మాస్టర్స్ 2.0′ను ప్రకటించింది. ఇది టెలికాం దిగ్గజం జియో మరియు చిప్‌మేకర్ మీడియాటెక్‌తో కలిసి ఈ-స్పోర్ట్స్ ఈవెంట్ ను నిర్వహిస్తోంది. దేశంలోని ఆన్‌లైన్ గేమింగ్ ఔత్సాహికులు మరియు ప్రొఫెషనల్ గేమర్‌లను ప్రోత్సహించడానికి ఈ ఈవెంట్ నిర్వహించడం జరుగుతోంది.

గేమింగ్ మాస్టర్స్

ఈ సంవత్సరం ప్రారంభంలో 14,000 మంది టీమ్ రిజిస్ట్రేషన్‌లను ఆకర్షించిన ‘ఫ్రీ ఫైర్'తో మొదటి సీజన్‌లో విజయవంతమైన తర్వాత ‘గేమింగ్ మాస్టర్స్' రెండవ సీజన్ నవంబర్ 23న రూ.12.5 లక్షల ప్రైజ్ పూల్‌తో ప్రారంభం కానుంది. 'గేమింగ్ మాస్టర్స్ 2.0' క్రాఫ్టన్ యొక్క హిట్ బ్యాటిల్ రాయల్ గేమ్ టైటిల్ BGMI ఇండియాను కలిగి ఉంటుంది. ఇది JioGames ప్లాట్‌ఫారమ్ ద్వారా Jio మరియు నాన్-జియో వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని పరిశ్రమలోని వ్యక్తులు తెలిపారు. 'ప్లే & విన్ డైలీ' సిరీస్ విభాగంలో ఈ కొత్త గేమ్ ఉంటుంది. ఇక్కడ గేమర్‌లు ప్రతిరోజూ పాల్గొనడమే కాకుండా రివార్డ్లను కూడా పొందవచ్చు. అంతేకాకుండా అంతిమ ఛాంపియన్‌షిప్ కోసం ప్రొఫెషనల్ టీమ్‌లతో పోటీపడే అవకాశం కూడా ఉంటుంది.

జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్

జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్

జియో తన నూతన స్మార్ట్‌ఫోన్ JioPhone Next ను ఇటీవల విడుదల చేసింది. 5.45-అంగుళాల జియోఫోన్ నెక్స్ట్, ఆండ్రాయిడ్ OS యొక్క ఆప్టిమైజ్ వెర్షన్, మల్టీ-టచ్ HD+ స్క్రీన్, వెనుకవైపు 13MP కెమెరా మరియు 8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇది 2GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ తో యాంటీ ఫింగర్‌ప్రింట్ కోటింగ్‌తో కూడిన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3ని అందిస్తుంది. ఇంటర్నల్ స్టోరేజీని 512 GB వరకు పెంచుకోవచ్చు. ఇది QM-215 (1.3 Ghz వరకు క్వాడ్-కోర్) అని పిలువబడే Qualcomm స్నాప్‌డ్రాగన్ చిప్‌ను కలిగి ఉంది. 3,500mAh బ్యాటరీ మరియు 2 Dual-SIM నానో స్లాట్‌లు, 3.5mm ఆడియో జాక్‌తో ఉంటాయి.

జియోబుక్ ల్యాప్‌టాప్‌ గీక్‌బెంచ్‌ వివరాలు

జియోబుక్ ల్యాప్‌టాప్‌ గీక్‌బెంచ్‌ వివరాలు

గీక్‌బెంచ్ జాబితాను పరిశీలిస్తే మోడల్ నంబర్ NB1112MMని కలిగి ఉన్న JioBook ల్యాప్‌టాప్‌ దాని కొన్ని స్పెసిఫికేషన్‌లను బహిర్గతం చేయడం గుర్తించబడింది. బెంచ్‌మార్క్ జాబితా ప్రకారం NB1112MM మోడల్ నంబర్‌తో ఉన్న JioBook 2GB RAMతో పాటు MediaTek MT6788 చిప్‌సెట్‌ను ఉపయోగిస్తుంది. ఇది Android 11లో రన్ అవుతున్నట్లు బెంచ్‌మార్క్ జాబితా సూచిస్తుంది. పనితీరు స్కోర్ పరంగా కార్డ్‌లపై ఉండే సరసమైన ల్యాప్‌టాప్ సింగిల్-కోర్ టెస్ట్‌లో 1178 పాయింట్లు మరియు మల్టీ-కోర్ టెస్ట్‌లో 4246 పాయింట్లను స్కోర్ చేసినట్లు కనిపిస్తోంది. XDA డెవలపర్‌ల మునుపటి నివేదిక ప్రకారం JioBook ల్యాప్‌టాప్‌ తెలియని కొలతల పరిమాణంలో HD డిస్‌ప్లేతో వస్తుందని ఊహించబడింది. ఇది HD ప్యానెల్ అయినందున ఇది 1366 x 768 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ని కలిగి ఉండవచ్చు. ఈ ల్యాప్‌టాప్ స్నాప్‌డ్రాగన్ 665 SoC నుండి శక్తిని పొందుతుందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అలాగే ఇది 4G కనెక్టివిటీ కలిగి ఉండి స్నాప్‌డ్రాగన్ X12 మోడెమ్‌తో జతచేయడానికి అనుకూలంగా ఉంటుంది.

Best Mobiles in India

English summary
Battlegrounds Mobile India Game Announced Esports Tournament with Jio and MediaTek: Winner Get Rs.12.5 Lakh Price Money
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X