Home
News

Battlegrounds మొబైల్ ఇండియా ముందస్తు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారా!! ఈ విషయాలు తెలుసుకోండి...

ఇండియాలో పబ్ జి మొబైల్ గేమ్ గత సంవత్సరం బ్యాన్ చేయబడింది. అయితే ఇప్పుడు బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో తిరిగి మళ్ళి అందుబాటులోకి రానున్నది. క్రాఫ్టన్ ఇంక్ సంస్థ ఇండియాలోని యూజర్ల కోసం మే 18 నుండి ఈ గేమ్ యొక్క ప్రీ-రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తుంది. ప్రీ-రిజిస్ట్రేషన్లను అంగీకరించడం ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే వెల్లడించినప్పటికీ ఈ గేమ్ ఇండియాలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో మాత్రం వెల్లడించలేదు. అయితే కొన్ని పుకార్ల ప్రకారం ఈ గేమ్ జూన్ 10 న లాంచ్ అవుతుందని సమాచారం. మీరు బాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా యొక్క ముందస్తు రిజిస్ట్రేషన్లను చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే కనుక మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. వాటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ప్రీ-రిజిస్ట్రేషన్లు గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి

ప్రీ-రిజిస్ట్రేషన్లు గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి

బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ యొక్క ప్రీ-రిజిస్ట్రేషన్లు ప్రారంభంలో గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రమే ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. ఈ గేమ్ యొక్క ప్రీ-రిజిస్ట్రేషన్స్ ఇండియాలో మే 18 అర్ధరాత్రి నుండి గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రమే ప్రారంభమవుతుందని క్రాఫ్టన్ ఇంక్ తన తాజా పత్రికా ప్రకటనలో పేర్కొంది. అయితే ఐఓఎస్ వినియోగదారుల కోసం ప్రీ-రిజిస్ట్రేషన్, లాంచ్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ప్రీ-రిజిస్ట్రేషన్ లింక్ ప్లే స్టోర్‌లో ప్రత్యక్షమైన తర్వాత దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. తరువాత యాప్ పేజీని తెరిచి "ప్రీ-రిజిస్టర్" బటన్ మీద నొక్కండి. ఇలా చేస్తే మీరు ముందే రిజిస్టర్ చేయబడతారు. గేమ్ అందుబాటులోకి వచ్చినప్పుడల్లా మీకు తెలియజేయబడుతుంది.

ప్రీ-రిజిస్ట్రేషన్ రివార్డులు

ప్రీ-రిజిస్ట్రేషన్ రివార్డులు

బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ కోసం ప్రీ-రిజిస్ట్రేషన్ చేసుకున్న వినియోగదారులందరికీ ప్రారంభ సమయంలో ప్రత్యేక ఇన్-గేమ్ రివార్డులను అందిస్తున్నట్లు క్రాఫ్టన్ సంస్థ పత్రిక ప్రకటనలో ప్రకటించింది. అయితే ఇది రివార్డులను వివరించలేదు. అయినప్పటికీ ఈ రివార్డులు భారత ఆటగాళ్లకు మాత్రమే ప్రత్యేకమైనవిగా ఉంటాయి అని పేర్కొన్నాయి.

బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ గేమ్ భారతదేశానికి ప్రత్యేకమైనదా?

బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ గేమ్ భారతదేశానికి ప్రత్యేకమైనదా?

బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా డెవలపర్ ఈ గేమ్ భారతదేశంలో ప్రత్యేకంగా ప్రారంభించబడుతుందని మరియు దాని ప్రత్యేకతను కొనసాగిస్తుందని ప్రకటించింది. దీని అర్థం మీరు భారతదేశం వెలుపల నివసిస్తుంటే కనుక మీ డివైస్ స్థానాన్ని మోసగించకుండా మీరు గేమ్ కోసం ప్రీ-రిజిస్ట్రేషన్ చేసుకోలేరు లేదా ఆడలేరు. ఇది కాకుండా బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా ఆటగాళ్ళు గ్లోబల్ పిబిజి మొబైల్ ప్లేయర్‌లతో ఆడగలరా లేదా అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొంటారా లేదా అనేది ఇంకా వెల్లడించలేదు.

Best Mobiles in India

English summary
Battlegrounds Mobile India Game Pre-Registrations are You Doing! You Should to Know These Things
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X