ఉద్యోగంలోకి తీసుకొనే కసరత్తును త్వరగా ముగించడం కోసమే....

Posted By: Staff

ఉద్యోగంలోకి తీసుకొనే కసరత్తును త్వరగా ముగించడం కోసమే....

దుబాయ్‌: మీరు ఉద్యోగ అన్వేషణలో ఉన్నారా. మీరు చేరబోయే సంస్థ యాజమాన్యాన్ని గురించి అన్ని వివరాలు తెలుసుకోవాలని ఉందా.. అయితే అందుకోసం మీకు మరొక దారి దొరికినట్లే. ఉద్యోగార్థులు, వారికి నౌకరీ ఇవ్వాలనుకున్న సంస్థలు రియల్‌-టైంలో పరస్పరం సంభాషించుకోవడానికి ఒక కొత్త ఆన్‌లైన్‌ మార్గాన్ని ప్రారంభించిందో జాబ్‌ వెబ్‌సైట్‌.

LiveHire పేరిట లైవ్‌ చాట్‌ సొల్యూషన్‌ను Bayt.com తీసుకువచ్చింది. ఇది నియామకాల ప్రక్రియను వేగవంతంగా, మరింత సమర్థంగా తీర్చిదిద్దగలదని భావిస్తున్నారు. ఈ విధమైన సేవ తమ కంపెనీ పట్ల ఆసక్తి కనబరిచే అభ్యర్థులను యాజమాన్యాలు ముందుగా గుర్తించడానికి, వారి సీవీలను పరిశీలించేటపుడు వెంటనే తాత్కాలిక జాబితాను తయారు చేయడానికి తోడ్పడుతుంది. ఆనక భర్తీ సంస్థలు అభ్యర్థిని రియల్‌-టైమ్‌ ప్రాతిపదికన ప్రత్యక్ష సంభాషణకు ఆహ్వానించే వీలు ఉంటుంది.

''కొలువులోకి తీసుకొనే కసరత్తును వీలైనంత త్వరగా ముగించడం, ఎంపిక ఉత్తమంగా ఉండేటట్లు చూసుకోవడం అనే అంశాలకు ఇపుడు ప్రాధాన్యం ఇదివరకటి కన్నా పెరిగిపోయింది. పనులు ఇట్టే పూర్తి అయిపోవాలని యాజమాన్యాలు కోరుకుంటున్నాయి. వాటి ఈ అవసరాలను తీర్చగలమనే ఆశిస్తున్నామ''ని Bayt.com లైవ్‌హైర్‌ ప్రోడక్ట్‌ వైస్‌-ప్రెసిడెంట్‌ ఒమర్‌ తహ్‌బూబ్‌ చెప్పారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot