2013లో ‘బ్లాక్‌బెర్రీ 10’ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By: Super

 2013లో ‘బ్లాక్‌బెర్రీ 10’ స్మార్ట్‌ఫోన్‌లు

ఆధునిక వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘బ్లాక్ బెర్రీ 10’ ఆధారితంగా స్పందించే సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను 2013 మొదటి త్రైమాసికంలో విడుదల చేస్తామని రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) సీఈవో తోర్స్టెన్ హెయిన్స్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సాఫ్ట్‌వేర్ నిర్మాణం తుది దిశకు చేరకుందని ఈ సారి ఏ విధమైన జాప్యానికి ఆస్కారం ఇవ్వకుండా నిర్ణీత సమయానికే విడుదల చేస్తామని హెయిన్స్ స్ఫష్టం చేశారు. తాము విడుదల చేయబోతున్న స్మార్ట్‌ఫోన్‌లు పూర్తి టచ్ ఇంకా క్వర్టీ కీప్యాడ్ వేరియంట్‌లలో ఉంటాయని వీటిని మూడు కేటగిరీలలో విభజించినట్లు వెల్లడించారు. అత్యాధునిక మొబైలింగ్ సాఫ్ట్‌వేర్‌తో డిజైన్ కాబడుతన్న ఈ ఫోన్‌లు అన్ని వర్గాల వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని హెయిన్స్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌ల రూపకర్త రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేస్తున్న ఫోన్ బ్లాక్‌బెర్రీ 10 స్లైడర్(బీబీ10). 2013లో విడుదల కానున్న ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులు అప్‌లోడ్ చేసిన ఫోటోలు ఆన్‌లైన్‌లో కనువిందుచేస్తున్నాయి. రిమ్ అధికారికంగా ప్రకటించిన సమాచారం ప్రకారం బ్లాక్‌బెర్రీ 10 కాన్సెప్ట్ ఫోన్.. టచ్, క్వర్టీ వేరియంట్‌లలో విడుదల కానుంది. ఆపిల్, మైక్రోసాఫ్ట్‌లను ధీటుగా ఎదుర్కొవటంలో తడబడుతున్న బ్లాక్‌బెర్రీ, బీబీ10తో చెక్ పెట్టే ప్రయత్నంలో నిమగ్నమైంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot