క్రోమ్ వాడుతున్నారా..? ఈ ఎక్స్‌టెన్షన్‌లతో జాగ్రత్త

Posted By: BOMMU SIVANJANEYULU

గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌లలో ఒకటైన 'ఆర్చివ్ పోస్టర్’, ఇటీవల జరిగిన మాల్వేర్ అటాక్‌తో ఇన్-బ్రౌజర్ క్రిప్టోకరెన్సీ మైనర్‌గా మారి పెను విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సమస్య పై దృష్టిసారించిన సెక్యూరిటీ రిసెర్చర్లు తాజాగా మరో నాలుగు ప్రమాదకర ఎక్స్‌టెన్షన్‌లను గూగల్ క్రోమ్‌లో బ్రౌజర్‌లో గుర్తించినట్లు వెలుగు చూసింది. ఈ ఎక్స్‌టెన్షన్స్ కారణంగా ఇప్పటికే 5 లక్షల యూజర్లు ఎఫెక్ట్ అయినట్లు తెలుస్తోంది.

క్రోమ్ వాడుతున్నారా..? ఈ ఎక్స్‌టెన్షన్‌లతో జాగ్రత్త

ఈ ఎక్స్‌టెన్షన్‌లను సెక్యూరిటీ అనలిటిక్స్ సంస్థ ICEBRG గుర్తించింది. Change HTTP Request Header, Lite Bookmark, Stickies, Nyoogle ఎక్స్‌టెన్షన్‌లను క్లిక్-ఫ్రాడ్ స్కామ్ ఆపరేషన్‌ల నిమిత్తం ఎంప్లాయ్ చేసినట్లు ఐసీఈబీఆర్‌జీ తెలిపింది.

గూగుల్‌తో పాటు ఇతర స్టేక్ హోల్డర్‌లకు ఈ సమాచారాన్ని ICEBRG అందించటంతో వెంటనే వాటిని క్రోమ్ వెబ్‌స్టోర్ నుంచి తొలగించారు. ఈ నాలుగింటిలో ఒక ఎక్స్‌టెన్షన్‌ అయిన Nyoogle ఇప్పటికీ క్రోమ్ వెబ్‌స్టోర్‌లో లభ్యమవుతోంది. ఈ ఎక్స్‌టెన్షన్‌ను తొలిగించే విషయం పై గూగుల్ ఇంకా నిర్ణయం తీసుకుకోవల్సి ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులారిటీని సొంతం చేసుకున్న వెబ్ బ్రౌజర్‌లలో గూగుల్ క్రోమ్ ఒకటి. ఇదే సమయంలో సైబర్ దాడులకు కూడా ఇదే వేదికగా నిలుస్తోంది. ఈ బ్రౌజర్ అత్యుత్త శక్తివంతమైన ప్రొటెక్టివ్ షెల్‌ను కలిగి ఉన్నప్పటికి వాటిని ఏదో విధంగా హ్యాకర్లు బ్రేక్ చేస్తూనే ఉన్నారు.

భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు , పరుగులు పెట్టనున్న మేక్ ఇన్ ఇండియా !

క్రోమ్ బ్రౌజర్ వేగం వాడుతున్న కొద్ది మందగిస్తుందంటూ పలువురు యూజర్లు ఇటీవల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ అప్‌డేట్‌లను ఫాలో అవుతూ చిన్ని చిన్ని జాగ్రత్తలను పాటించటం ద్వారా క్రోమ్ బ్రౌజింగ్ వేగాన్ని రెట్టింపు స్థాయిలో ఆస్వాదించవచ్చు.

క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌లను డిసేబుల్ చేసి ఆపై తొలగించటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు. క్రోమ్ బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్ చేసిన ప్రతిసారీ కొన్ని ప్లగిన్‌లు డిఫాల్ట్‌గా వస్తుంటాయి. కాబట్టి వాటిలో అవసరంలేని ప్లగిన్‌లను గుర్తించి వాటిని డిసేబుల్ చేయటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు.

బ్రౌజింగ్ డేటాను ఎప్పటికప్పుడు క్లీన్ చేయటం ద్వారా బ్రౌజింగ్ వేగాన్ని పెంచుకోవచ్చు. క్రోమ్ బ్రౌజింగ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు కొన్ని ఎక్స్‌టెన్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించుకోవటం ద్వారా బ్రౌజింగ్ వేగం పెరుగుతుంది.

English summary
Researchers at enterprise security firm Iceberg have discovered four malicious extensions in the Google Chrome Web store, that have apparently affected more than half a million Google Chrome users around the world.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot