Home
News

మీరు జియో యూజర్లా.. మీ పాత కాల్ హిస్టరీ మొత్తం చూడాలనుకుంటున్నారా.. ఐతే ఈ ట్రిక్ మీకోసమే!

Jio call History: స్మార్ట్‌ఫోన్లు వచ్చాక కాల్ హిస్టరీ చూడటం చాలా ఈజీ అయిపోయింది. కానీ, ఫోన్‌లో మాత్రం లిమిటెడ్ కాల్ రికార్డ్సే ఉంటాయి. ఐఫోన్ లాంటి ఫోన్లైతే లాస్ట్ 2,000 కాల్స్ వరకే చూపిస్తాయి. చూడటానికి ఇది ఎక్కువే అనిపించినా, రోజుకి బోలెడు కాల్స్ చేసేవాళ్లకి, వాటిని ట్రాక్ చేయాలనుకునేవాళ్లకి ఇది సరిపోదు. అయితే జియో యూజర్స్‌కి మాత్రం కాల్ హిస్టరీ మొత్తం చెక్ చేసుకోవడానికి ఒక సులభమైన మార్గం ఉంది.

అదేంటంటే మైజియో (MyJio) యాప్. ఈ యాప్ ద్వారా మీ కాల్ రికార్డ్స్‌ని ఈజీగా చూడొచ్చు, కావాలంటే డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. కాల్ హిస్టరీ ఎలా చూడాలో, కాల్ హిస్టరీని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రాసెస్ చాలా సింపుల్‌గా ఉంటుంది కాబట్టి ఎవరైనా ట్రై చేయొచ్చు.

Before Its Too Late  Learn How to View Your FULL Jio Call History

* మైజియో యాప్‌లో కాల్ హిస్టరీ ఎలా చూడాలి..

జియో సిమ్ వాడుతున్నవాళ్లంతా మైజియో యాప్‌తో తమ ఫుల్ కాల్ హిస్టరీని చెక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండిట్లోనూ అందుబాటులో ఉంది. ఇందులో కాల్స్ గురించే కాదు, SMS రికార్డ్స్, డేటా ఎంత వాడారు అనే విషయాలు కూడా తెలుసుకోవచ్చు.

* కాల్ హిస్టరీ చూడటానికి స్టెప్స్

స్టెప్ 1: ముందుగా మీ ఫోన్‌లో MyJio యాప్ ఓపెన్ చేయండి. ఒకవేళ లాగిన్ చేయకపోతే మీ జియో ఫోన్ నంబర్‌తో లాగిన్ అవ్వండి. యాప్ ఓపెన్ అయ్యాక, పైన కుడివైపు మీ ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి.

స్టెప్ 2: అందులో "మొబైల్" ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని, ఆ తర్వాత "మై యూసేజ్" మీద నొక్కాలి. అంతే, "కాల్స్" సెక్షన్ లోకి వెళ్తే చాలు, మీ ఫుల్ కాల్ హిస్టరీ మొత్తం అక్కడ కనిపిస్తుంది. ఓపికను బట్టి ఎన్నంటే అన్ని కాల్స్ రికార్డులను చెక్ చేసుకోవచ్చు.

* జియో కాల్ హిస్టరీని డౌన్‌లోడ్ చేయండిలా

మైజియో యాప్‌లో కాల్ హిస్టరీ చూడటమే కాదు, దాన్ని డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. నచ్చిన టైమ్ పీరియడ్‌లోని కాల్ రికార్డ్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గత 7 రోజులు, లాస్ట్ 15/లాస్ట్ 30 రోజులు ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. లేదా కావాల్సిన డేట్స్ పెట్టుకుని (గరిష్టంగా 180 రోజుల వరకు) కస్టమ్ డేట్ రేంజ్ కూడా తీసుకోవచ్చు.

* డౌన్‌లోడ్ చేసుకోవడానికి స్టెప్స్

స్టెప్ 1: మైజియో యాప్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి. "మొబైల్"లోకి వెళ్లి, "మై యూసేజ్" ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. "కాల్స్" ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మీకు ఏ టైమ్ పీరియడ్ కాల్ హిస్టరీ కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. రిపోర్ట్ మీ ఈమెయిల్‌కి వస్తుంది కాబట్టి మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి.

స్టెప్ 2: "సెండ్" బటన్ నొక్కాలి. అంతే, మీ స్టేట్‌మెంట్ మీ ఈమెయిల్‌కి వచ్చేస్తుంది. కాల్ హిస్టరీ రిక్వెస్ట్ పెట్టగానే, మైజియో యాప్‌లో డైరెక్ట్‌గా రిపోర్ట్ కనిపించదు. రిపోర్ట్ మాత్రం మీ ఈమెయిల్‌కి వస్తుంది. ఆ స్టేట్‌మెంట్‌లో మీరు ఎవరికి కాల్ చేశారు, ఎవరి దగ్గర నుంచి కాల్స్ వచ్చాయి అనే ఫోన్ నంబర్లు ఉంటాయి.

ఒక్కో కాల్ ఎంతసేపు మాట్లాడారో, అంటే కాల్ డ్యూరేషన్ ఉంటుంది. ప్రతి కాల్ ఏ రోజు, ఏ టైమ్‌లో చేశారు అనే డేట్, టైమ్ డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా జియో నంబర్ యూసేజ్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ ఫాలో అయితే జియో యూజర్స్ తమ కాల్ హిస్టరీని ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio users can easily check and download their full call history using the MyJio app. View call details, download statements for chosen periods (7-180 days), and receive reports via email.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X