'సిడిఎమ్ఎ ఐఫోన్ 4ఎస్' ని విడుదల చేయనున్న బీజింగ్ సంస్థ

Posted By: Super

 'సిడిఎమ్ఎ ఐఫోన్ 4ఎస్' ని విడుదల చేయనున్న బీజింగ్ సంస్థ

 

చైనా దేశం యొక్క మూడవ అతిపెద్ద మొబైల్ ఫోన్ ఆపరేటర్ చైనా టెలికాంకి అనుబంధంగా పని చేస్తున్న 'బీజింగ్ టెలికాం కో లిమిటెడ్' చైనాలో ఫిబ్రవరి నాటికి 'ఆపిల్ ఐఫోన్ 4ఎస్' యొక్క సిడిఎమ్ఎ వెర్షన్ ఆరంభించవచ్చునని ఓ ప్రకటనలో తెలిపింది. మూడవ తరం (3G) నెట్‌వర్క్ సర్వీస్‌ను చందాదారులుగా గెలుచుకున్న సందర్బంలో దేశీయ ప్రత్యర్ధులపై ఒత్తిడిని అధిగమించేందుకు ఓ సరిక్రొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది.

సోమవారం మీడియాతో మాట్లాడిన 'బీజింగ్ టెలికాం కో లిమిటెడ్' కంపెనీ ప్రతినిధులు సిడిఎమ్ఎ వర్సన్‌కు చెందిన 'ఆపిల్ ఐఫోన్ 4ఎస్ స్మార్ట్ ఫోన్‌'ని జాతీయంగా మార్కెట్లోకి ఫిబ్రవరి నెల చివరిన లేదా మార్చి మొదటి వారంలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఐతే సిడిఎమ్ఎ ఐఫోన్ 4ఎస్ ఖరీదుని మాత్రం ఇంకా మార్కెట్లో వెల్లడించ లేదు. అప్పుడే 'సిడిఎమ్ఎ ఐఫోన్ 4ఎస్' కి సంబంధించిన ఎడ్వర్టైజ్‌మెంట్ క్యాంపెయిన్‌ని ప్రారంభించింది.

సిడిఎమ్ఎ2000 నెట్ వర్క్‌‌కి సంబంధించి కావాల్సిన మూడు ఆపరేటింగ్ లైసెన్స్‌లను చైనా టెలికామ్ సొంతం చేసుకుంది. దీనితో పాటు చైనా రెండవ అతి పెద్ద వైర్‌లెస్ ఆపరేటర్ చైనా యునైటెడ్ నెట్‌వర్క్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్(చైనా యునికామ్) ఆపిల్ డివైజ్‌లను కాంట్రాక్ట్ పద్దతి మీదలో విక్రయిస్తున్నారు. ఆపిల్ ఐఫోన్ మీద ఉన్న క్రేజి వల్లనే చైనా యునికామ్ 3జీ వినియోగదారులలో దేశంలో అతి పెద్ద రెండవ క్యారియర్‌గా అవతరించిందని పలువురి అభిప్రాయం. 2011చివరినాటికి చైనా మొత్తం మీద 40 మిలియన్ల జనాభా ఆపిల్ చందాదారులుగా చేరారు.

ఆపిల్, చైనా టెలికాం యొక్క సాంకేతిక అనుకూలంగా ఐఫోన్ లక్షల సంఖ్యలో మొబైల్ చందాదారులు ప్రోత్సహిస్తుంది. ఇటీవల చైనా రీసెర్చ్ సంస్ద గార్ట్నర్ లిమిటెడ్ చేసిన సర్వేలో ఆపిల్ కంపెనీ చైనాలో ప్రస్తుతం నాల్గవ అమ్మకందారుడు స్దానంలో కొనసాగుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot