Home
News

పార్ట్‌టైం జాబ్‌ పేరుతో మోసం.. బెంగళూరు టెకీ నుంచి రూ.61 లక్షలు కాజేసిన నేరగాళ్లు..!

టెక్నాలజీ అభివృద్ధి సైబర్‌ నేరగాళ్లకు వరంలా మారింది. టెక్నాలజీ ఆధారంగా అనేక మందిని మోసం చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. పార్ట్‌టైం జాబ్స్‌ సహా ఇతర వ్యాపారాల పేరుచెప్పిన మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు ఎక్కువ వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నా.. దోపిడీకి గురైన నగదు తిరిగి చేరేందుకు కొన్నిసార్లు సంవత్సరాలు పడుతోంది.

స్టాక్‌ మార్కెట్‌ కోసం చూస్తే.. : తాజాగా బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను పార్ట్‌టైం ఉద్యోగం పేరుతో ( part time job scam ) మోసం చేశారు. ఏకంగా రూ.61.58 లక్షలను దోచుకున్నారు. స్టాక్‌ మార్కెట్‌ ట్రెండ్‌లను గురించి తెలుసుకొనేందుకు బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ కొన్ని యాప్‌లను ఆశ్రయించాడు. అయితే అనంతరం టెలిగ్రామ్ ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. పార్ట్‌టైం ఉద్యోగం ఆఫర్‌ చేశాడు.

Bengalore techie loses RS 61 lakh in part time job scam

రూ.20 లక్షలు తీసుకొనేందుకు ప్రయత్నం చేస్తే.. : తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించవచ్చని టెకీ ఉల్లాస్‌ను నేరగాళ్లు మభ్యపెట్టారు. పార్ట్‌టైం ఉద్యోగంలో భాగంగా వెబ్‌సైట్‌లను సమీక్షించడం మరియు URL పైన క్లిక్‌ చేయడం వంటి పనులున్నాయని చెప్పారు. ప్రారంభంలో రూ. 10 వేల ప్రారంభ పెట్టుబడిని అనంతరం రూ.20 లక్షలకు మార్చాడు. ఆ నగదును విత్‌డ్రా చేసుకొనేందుకు విఫలయత్నం చేశారు.

అయితే రూ. 20 లక్షల నగదును విత్‌డ్రా చేసుకొనేందుకు ఆడిట్‌ కోసం రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని మభ్యపెట్టారు. అయితే ఆ డబ్బు కోసం ఉల్లాస్‌.. స్నేహితుల వద్ద అప్పుగా తీసుకున్నాడు. ఇలా ఆర్థిక సమస్యల్లో బెంగళూరు టెకీ ఉల్లాస్‌ కూరుకుపోయాడు.

ఇలా మాయమాటలు చెప్పి. టెకీని మోసం చేసి మొత్తంగా 61.5 లక్షల రూపాయలను తమ ఖాతాలకు మళ్లించుకున్నారు. చివరికి మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. 420 సెక్షన్‌ సహా 419 కింద కేసునమోదు చేశారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఈ కేసులో పూర్తిస్థాయి విచారణను ప్రారంభించింది.

నేరస్థులు VPNను వినియోగించడం కారణంగా వారి ఆచూకీ తెలుసుకొనేందుకు పోలీసులకు సవాల్‌గా మారింది. సైబర్ బృందాలు ఈ ఘటనలై దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటనల పట్ల ఎంతో అప్రమత్తంగా ఉండాలి. తక్కువ పెట్టుబడులతో భారీ లాభాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువని గుర్తించాలి.

సైబర్‌ నేరాలు ఇటీవల కాలంలో భారీగా వెలుగు చూస్తున్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ ద్వారా భారీ సంఖ్యలో మోసాలకు పాల్పడుతున్నారు. డీప్‌ఫేక్‌ టెక్నాలజీని వినియోగించుకొని మోసం చేస్తున్నారు. దీనిపై పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. ప్రజలను అప్రమత్తం చేయడం సహా దర్యాప్తు చేస్తున్నారు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Bangalore techie loses RS 61 lakh in part time job scam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X