కారు డ్రైవర్‌ను దోచుకున్న ప్యాసెంజర్లు, అతని భార్య పట్లా చెడుగా!
ఒక రాండమ్ బుకింగ్ బెంగళూరులోని ఓలా క్యాబ్ డ్రైవర్ కు పీడకలగా మారిపోయింది.
ఒక రాండమ్ బుకింగ్ బెంగళూరులోని ఓలా క్యాబ్ డ్రైవర్ కు పీడకలగా మారిపోయింది.బుకింగ్ కోసం వచ్చిన క్యాబ్ డ్రైవర్ ను కొట్టి డబ్బులు లాక్కోవడమే గాక అతడి భార్యాకు కి వీడియో కాల్ చేసి బలవంతంగా బట్టలు విప్పించిన సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే...

సోమశేఖర్ అనే క్యాబ్ డ్రైవర్.....
సోమశేఖర్ అనే క్యాబ్ డ్రైవర్ బెంగళూరులోని అడుగొడి నుంచి దొమ్మసంద్రా దాకా బుకింగ్ వస్తే వెళ్లాడు. రాత్రి 10:30కి క్యాబ్ ఎక్కిన నలుగురు వ్యక్తులు వారి గమ్యస్థానం చేరిన తర్వాత ఇంటిదాకా పొమ్మని చెప్పారు.ఎవరు లేని చోటికి క్యాబ్ డ్రైవర్ ను తీసుకొని వెళ్లి తన వద్ద ఉన్న డబ్బులు లాక్కున్నారు.

బ్యాంక్ అకౌంట్ లో ఉన్న....
తర్వాత డ్రైవర్‌ను చితకబాధి తన కార్ తాళాలు లాక్కున్నారు. కారు డ్రైవింగ్ చేస్తూ వంద కిలోమీటర్లు దూరం తీసుకొని వెళ్లి తన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న రూ. 9000 లను తీసి ఇవ్వమని కొట్టారు. అంతటితో ఆగకుండా Paytm అకౌంట్ లో ఉన్న రూ.20,000లను తన బ్యాంక్ లో జమ చేసుకొని విత్‌డ్రా చేసి ఇవ్వమని కొట్టారు.

ఫోన్ లాక్కొని అతడి భార్యకు వీడియోకాల్ చేశారు....
30నిమిషాల ప్రయాణం తర్వాత డ్రైవర్ ఫోన్ లాక్కొని అతడి భార్యకు వీడియోకాల్ చేశారు. బట్టలు మొతం విప్పేసి నగ్నంగా నించోకపోతే తన భర్తని చంపేస్తాం అని బెదిరించారు.ఏం చేయాలో తోచక భయంతో తన బట్టలు విప్పేసి నగ్నంగా నించుంది. ఆ దుర్మార్గులు అది కూడా స్క్రీన్ షాట్ తీసుకున్నారు.

ఓ లాడ్జికి తీసుకెళ్లి బాత్రూమ్‌లో బందించేసారు...
తన మొబైల్ కూడా లాక్కొని రామనగర జిల్లాలోని చెన్నపట్నాలో ఓ లాడ్జికి తీసుకెళ్లి బాత్రూమ్‌లో బందించేసారు.లక్కీగా బాత్రూం లో ఉన్న విండో నుంచి దూకి అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు....
కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు ఉన్న చోటుకి వెళ్లారు.అక్కడ నిందుతులు లేకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








