ట్రాఫిక్ కష్టాల గురించి ఇంతకంటే బాగా ఎవరూ చెప్పరు !

ఆపీస్‌కి చివ‌రి రోజు.. అంటే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి నోటీస్ పిరియ‌డ్ కంప్లీట్ చేసిన త‌ర్వాత ఇక లాస్ట్ వ‌ర్కింగ్‌డే రోజు.

|

ఆపీస్‌కి చివ‌రి రోజు.. అంటే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి నోటీస్ పిరియ‌డ్ కంప్లీట్ చేసిన త‌ర్వాత ఇక లాస్ట్ వ‌ర్కింగ్‌డే రోజు. ఎవ‌రైనా మంచి డ్రెస్ వేసుకుని చాక్‌లెట్స్ తీసుకుని వెళ్తారు. పార్టీ ఇస్తారు. కానీ ఇత‌ను మాత్రం కాస్త డిఫ‌రెంట్‌గా చేశాడు. గుర్రంపై ఆఫీస్‌కి వెళ్లాడు. అయితే ఇలా వెళ్లడానికి అనేక కారణాలు ఉన్నాయి. నగరంలో రోజు పడుతున్న ట్రాఫిక్ కష్టాల గురించి అందరికీ తెలియాలని సరికొత్తగా ఆలోచించిన ఓ సాఫ్ట్ వేర్ కథను ఓ సారి గుర్తుకు తెచ్చుకుందాం.

వాట్సప్ మళ్లీ షాకిచ్చింది, ఈ ఫోన్లకు వాట్సప్ సేవలు బంద్వాట్సప్ మళ్లీ షాకిచ్చింది, ఈ ఫోన్లకు వాట్సప్ సేవలు బంద్

రూపేశ్‌ కుమార్‌

రూపేశ్‌ కుమార్‌

ఈ ఫోటోలో గుర్రం మీద వెళుతున్న వ్యక్తి పేరు రూపేశ్‌ కుమార్‌ వర్మ బెంగళూరులో ఓ పేరుమోసిన కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. మంచి ఉద్యోగమైతే దొరికిందిగానీ, జీవితం నానాటికీ నరకప్రాయంగా తయారైంది.

ట్రాఫిక్‌ రద్దీని నిరసిస్తూ..

ట్రాఫిక్‌ రద్దీని నిరసిస్తూ..

అందుకు మొదటి కారణం ట్రాఫిక్‌ ఇబ్బందులైతే, రెండోది సాఫ్ట్‌వేర్‌ రంగంలో సాగుతోన్న శ్రమదోపిడి. అందుకే వెంట‌నే ఒక గుర్రాన్నితీసుకుని ఇలా రోడ్డుపై బ‌య‌ల్దేరాడు. ట్రాఫిక్‌ రద్దీని నిరసిస్తూ గుర్రం మీద ఆఫీసుకొచ్చాడు.

జ‌నాల‌కు తెలియ‌డానికి ఒక బోర్డు

జ‌నాల‌కు తెలియ‌డానికి ఒక బోర్డు

త‌నెందుకు ఇలా చేస్తున్నాడో జ‌నాల‌కు తెలియ‌డానికి ఒక బోర్డు కూడా పెట్టాడు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా చివ‌రిసారి నా ఆఫీస్‌కి వెళ్తున్నా అని రాసుంది ఆ బోర్డుపై.

కార్లు, బైక్‌ల‌ను న‌మ్ముకుంటే..

కార్లు, బైక్‌ల‌ను న‌మ్ముకుంటే..

కార్లు, బైక్‌ల‌ను న‌మ్ముకుంటే మ‌ళ్లీ ఆఫీస్‌కి లేట్‌గా వెళ్తాను అనుకున్నాడో ఏమో కానీ ఇలా గుర్రంపై స్వారీ చేసి దారిపొడ‌వునా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు.

సోష‌ల్ మీడియాలో షేర్

సోష‌ల్ మీడియాలో షేర్

చాలా మంది అత‌ని ఫొటో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. తానీ పనిచేసింది సెన్సెషన్‌ కోసం కాదని, అయినాసరే పాపులర్‌ అయిపోవడంతో థ్రిల్‌ అయ్యానని చెప్పాడు.

లాస్ట్‌ వర్కింగ్‌ డే రోజు

లాస్ట్‌ వర్కింగ్‌ డే రోజు

లాస్ట్‌ వర్కింగ్‌ డే రోజును మాట్లాడుతూ అతి త్వరలోనే సొంత కంపెనీని ప్రారంభించబోతున్నానని, తద్వారా దేశంలో నెలకొన్ని సమస్యలు కొన్నింటికైనా పరిష్కారాలు చూపగలననే దీమా వ్యక్తంచేశాడు.

ఎంఎన్‌సీల్లో పనిచేసే భారత టెకీలు

ఎంఎన్‌సీల్లో పనిచేసే భారత టెకీలు

ఆటోడ్రైవర్లు, ట్రక్కుడ్రైవర్లకు సైతం యూనియన్లు ఉండగా, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మాత్రం సంఘటితం కాకపోవడం శోచనీయమని, ఎంఎన్‌సీల్లో పనిచేసే భారత టెకీలు.. లైక్‌మైండెడ్‌ ఫ్రెండ్స్‌తో కలిసి స్టార్టప్స్‌ ప్రారంభిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.

సెలబ్రిటీ

సెలబ్రిటీ

మొత్తానికి చివరిరోజు అశ్వంపై వచ్చిన రూపేశ్‌ సొంతకంపెనీ పెట్టి పేరు సాధించకముందే సెలబ్రిటీ అయిపోయాడు! కంపెనీ స్టార్ట్ అయితే ఇంకెంత సెలబ్రిటీ అయిపోతాడోనని అందరూ సెటైర్లు వేసుకుంటున్నారు.

Best Mobiles in India

English summary
Bengaluru techie rides horse to office on last day of work More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X