‘బెన్‌క్యూ’ అత్యుత్తమ శ్రేణి ఎల్ఈడి టీవీలు!

Posted By: Staff

‘బెన్‌క్యూ’ అత్యుత్తమ శ్రేణి ఎల్ఈడి టీవీలు!

 

ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ ‘బెన్‌క్యూ’(BenQ) కొత్తశ్రేణి ఎల్ఈడి టీవీలను మార్కెట్లో విడుదల చేసింది. బెన్ క్యూ‌ఎల్700  సిరీస్ నుంచి విడుదలైన ఈ డివైజ్‌లు 32, 37 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లను కలిగి ఉన్నాయి. వీటి ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా బెన్‌క్యూ ఇండియా,  జనరల్ మేనేజర్  రాజీవ్‌ సింగ్ మాట్లాడుతూ ఈ పండుగ సీజన్‌లో భాగంగా వినియోగదారుల అభిరుచులను పరిగణలోకి తీసకుని హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగం పై దృష్టిసారించినట్లు తెలిపారు.  ఈ క్రమంలోనే ఎల్ఈడి టీవీ ఎల్7000 సిరీస్ నుంచి 32”, 37” అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లలో అన్ని వర్గాల వారిని ఆకర్షించేలా అత్యుత్తమ ఫీచర్లతో వీటిని విడుదల చేసినట్లు సింగ్ వెల్లడించారు.

కీలక ఫీచర్లు:

-  32 అంగుళాల శ్రేణి (ఐపీఎస్ ప్యానెల్),

-  32 అంగుళాల  శ్రేణి (వీఏ ఎల్ఈడి ప్యానెల్),

-  ఐఎమ్: ఐ డైనమిక్ కాంట్రాస్ట్ రేషియో(నిష్ఫత్తి),

-  అల్ట్రా‌స్లిమ్ బీజీల్ @ 14మిల్లీ మీటర్లు వెడల్పు,

-  రిసల్యూషన్1366x 768పిక్సల్స్,

-  యూఎస్బీ డైరెక్ట్‌ప్లే సపోర్టింగ్,

-  బుల్ట్ ఇన్ 8 వాట్ స్పీకర్స్ (2),

-  మల్టీపుల్ కనెక్టువిటీ: యూఎస్బీ పోర్ట్స్ (2), హెచ్‌డిఎమ్ఐ పోర్ట్స్ (2), కాంపోజిట్ పోర్ట్స్ (2),

-  ట్రేడ్ మార్క్ సెన్సీ టెక్నాలజీ, రియల్ సినిమా, 8-బిట్ ప్యానెల్ .

-  ధరలు 32 అంగుళాల వేరియంట్  రూ.25,000, 37 అంగుళాల వేరియంట్ రూ.32,000.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot