Jio,Vodafone,Airtel: రోజుకు 2GB డేటాను అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లు
ఇండియా యొక్క టెలికామ్ రంగంలో టెల్కోస్ వారి ఆర్థిక ఆదాయాన్ని పెంచుకోవడానికి గత సంవత్సరం చివరిలో దరలను పెంచాయి. దరల యొక్క ప్రభావం కారణంగా టెల్కోస్ అన్ని కూడా తాము అందించే మొత్తం ప్లాన్ల సంఖ్యను గణనీయంగా తగ్గించాయి. ధరల పెంపు ఉన్నప్పటికీ ప్రీపెయిడ్ చందాదారులలో రోజువారీ డేటా ప్లాన్లు ఇప్పటికీ ప్రాచుర్యం పొందాయి.

టెలికాం ఆపరేటర్లు
టెలికాం ఆపరేటర్లు ప్రస్తుతం వారి ప్రీపెయిడ్ రీఛార్జ్‌లతో గరిష్టంగా 3GB రోజువారీ డేటాను అందిస్తున్నాయి. దీనితో పాటుగా రోజుకు 1GB డేటా మరియు 2GB డేటాను అందించే ప్లాన్లు కూడా ఉన్నాయి. 1GB రోజువారీ డేటా చాలా తక్కువగా ఉందని మరియు రోజుకు 3GB డేటా అధికంగా ఉందని భావించేవారి కోసం ఇప్పుడు టెల్కోస్ సరసమైన దరల వద్ద 2GB డేటా రోజువారీ ప్లాన్లను అందిస్తున్నాయి.

రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లో రూ.249 ధర వద్ద మరియు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌లలో రూ.299 నుండి ప్రారంభమయ్యే ప్లాన్లు 2 జిబి రోజువారీ డేటాను అందిస్తున్నాయి. టెల్కోస్ ప్రస్తుతం మొత్తం మూడు 2 జిబి డేటా ప్లాన్‌లను అందిస్తున్నాయి. వాటి యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో 2 జిబి డైలీ డేటా ప్లాన్లు
రిలయన్స్ జియో యొక్క 2GB డేటా ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్లను భారతి ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియాతో పోల్చినప్పుడు తక్కువ ధరను కలిగి ఉన్నాయి. జియో అందిస్తున్న 2 జిబి డైలీ డేటా ప్లాన్లు వరుసగా రూ .249, రూ .444, రూ.555.
రూ.249 ప్లాన్ :
రూ.249ల బేస్ ప్లాన్ రోజుకు 2 జిబి డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఇది తన మొత్తం చెల్లుబాటు కాలంలో 56 జిబి 4 జి డేటాను అందిస్తుంది. అలాగే అపరిమిత జియో నుండి జియో వాయిస్ కాలింగ్‌తో పాటు, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు మరియు 1,000నిమిషాల నాన్- జియో ఎఫ్‌యుపి ను కూడా అందిస్తాయి.

రూ .444 ప్లాన్
రిలయన్స్ జియో అందిస్తున్న రూ.444 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కూడా రూ.249 ప్లాన్ యొక్క సారూప్య ప్రయోజనాలను అందిస్తుంది. కాకపోతే రెట్టింపు చెల్లుబాటు మరియు రెండు రెట్ల జియోయేతర నిమిషాలను అందిస్తుంది. ఈ ప్లాన్ 56 రోజుల వాలిడిటీతో లభిస్తుంది. ఇది రోజుకు 2 జిబి డేటాను అందిస్తూ మొత్తం చెల్లుబాటు కాలంలో 112 జిబి డేటాను అందిస్తుంది. అలాగే ఇది రోజుకు 100 ఎస్ఎంఎస్ లను, 2,000 నిమిషాల నాన్ జియో కాల్స్ మరియు అపరిమిత జియో టు జియో వాయిస్ కాల్స్ తో వస్తుంది.

రూ .555 ప్లాన్
మీరు రిలయన్స్ జియో చందాదారులైతే 2 జిబి రోజువారీ డేటా ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే నెలవారీ రూ.249 ప్లాన్ కంటే మూడు నెలల రూ.555 రీఛార్జి ప్లాన్ ను ఎంచుకోవడం చాలా మంచిది. రూ.555 ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికొస్తే ఇది రోజుకు అదే 2GB డేటా, రోజుకు 100 SMS లు, అపరిమిత Jio టు Jio వాయిస్ కాల్స్ మరియు 3,000 నాన్-Jio FUP నిమిషాలను 84 రోజులకు చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

భారతి ఎయిర్‌టెల్ 2 జిబి డైలీ డేటా ప్లాన్‌లు
భారతి ఎయిర్‌టెల్ 2 జిబి రోజువారీ డేటాతో ఆఫర్‌లో భాగంగా మొత్తంగా నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. వాటి యొక్క ధరలు వరుసగా రూ .298, రూ. 349, రూ .449 మరియు రూ .698. ఈ ప్లాన్‌లు అన్ని కూడా అపరిమిత వాయిస్ కాల్స్ లను మరియు రోజుకు 100SMS లను అందిస్తాయి. కాకపోతే చెల్లుబాటు కాలంలో మాత్రం తేడాలు ఉంటాయి.
*** రూ .298 ప్లాన్ --- 28 రోజుల వాలిడిటీ
*** రూ. 349 ప్లాన్ --- 28 రోజుల వాలిడిటీ,అదనంగా రూ.129ల విలువైన అమెజాన్ ప్రైమ్ మెంబెర్ షిప్ ప్రయోజనం లభిస్తుంది.
*** రూ .449 ప్లాన్ --- 56 రోజుల వాలిడిటీ
*** రూ .698 ప్లాన్ --- 84 రోజుల వాలిడిటీ

వోడాఫోన్ ఐడియా 2 జిబి డైలీ డేటా ప్లాన్‌లు
చివరగా ఇండియాలో ప్రస్తుతం అత్యంత కష్టపడుతున్న టెలికాం ఆపరేటర్ అయిన వోడాఫోన్ ఐడియా విషయానికి వస్తే ఇది ఎయిర్టెల్ అందిస్తున్న ప్లాన్‌లకు సమానంగా తమ చందాదారులకు కూడా ఇలాంటి 2GB రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. వోడాఫోన్ ఐడియా యొక్క 2GB డేటా ప్లాన్‌ల యొక్క ధరలు వరుసగా రూ .299, రూ .449 మరియు రూ .699. వోడాఫోన్ ఐడియా యొక్క ఈ ప్లాన్‌లు రోజుకు 2 జిబి డేటాను, భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు వంటి ప్రయోజనాలను అందిస్తాయి. కానీ చెల్లుబాటు రోజులలో మాత్రం కొంచెం తేడా ఉంటాయి.
*** రూ .299 ప్లాన్ --- 28 రోజుల వాలిడిటీ
*** రూ .449 ప్లాన్ --- 56 రోజుల వాలిడిటీ
*** రూ .699 ప్లాన్ --- 84 రోజుల వాలిడిటీ


Click it and Unblock the Notifications








