Home
News

28 రోజుల తిప్పలు ఇక లేవు! 30 రోజుల వ్యాలిడిటీతో కొత్త రీఛార్జ్ ప్లాన్లు ఇవే!

2026 నవంబర్ 1 నుంచి టెలికాం ఆపరేటర్లు పాత 28 రోజుల ప్యాక్‌లతో పాటు పూర్తి 30 రోజులు, ప్రతీ నెల ఒకే తేదీన రీఛార్జ్ చేసుకునే వాయిస్, ఎస్‌ఎంఎస్-ఓన్లీ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చారు. బేసిక్ వాయిస్, ఎస్‌ఎంఎస్ స్పెషల్ టారిఫ్ వోచర్లను కచ్చితంగా అందుబాటులో ఉంచాలని 2026 సెప్టెంబర్‌లో ట్రాయ్ (TRAI) తెచ్చిన నిబంధనలు, అలాగే ప్రతి నెలా ఒకే తేదీన రీఛార్జ్ గడువు ముగిసేలా గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ మార్పు జరిగింది. మీకు కేవలం కాలింగ్, ఓటీపీల కోసం మాత్రమే రీఛార్జ్ కావాలంటే.. అతి తక్కువ ధరలో ఉండే ఆప్షన్లు ఏంటి? ఎక్కడ లభిస్తాయో ఇప్పుడు చూద్దాం.

ఇందులో ప్రధానంగా రెండు పెద్ద మార్పులొచ్చాయి. మొదటిది.. ఆపరేటర్లు కచ్చితంగా 30 రోజుల వ్యాలిడిటీ లేదా ప్రతీ నెల ఒకే తేదీన రీఛార్జ్ అయ్యే ప్లాన్లను అందుబాటులో ఉంచాలి. రెండోది.. డేటా బండిల్డ్ ప్లాన్‌ల వ్యాలిడిటీ తరహాలోనే కేవలం వాయిస్, ఎస్‌ఎంఎస్‌ల కోసమే ప్రత్యేక ప్లాన్లు తీసుకురావాలి. ప్రతీ నెలా ఒకే తేదీన రీఛార్జ్ కావడం గురించి చెబుతూ.. "ఒకవేళ ఆ తేదీ ఆ నెలలో లేకపోతే ఆ నెల చివరి రోజున గడువు ముగుస్తుంది" అని ట్రాయ్ తన టారిఫ్ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. దీనివల్ల ప్రీపెయిడ్ వినియోగదారులకు రీఛార్జ్ తేదీల విషయంలో ఎలాంటి అయోమయం ఉండదు.

Best 30-Day Recharge Plans 2026: Jio, Airtel, Vi Monthly Packs for Unlimited Calls & SMS

Jio, Airtel, Vi, BSNL యాప్‌లలో 30 రోజుల వాయిస్/ఎస్‌ఎంఎస్ ప్లాన్లను ఎక్కడ వెతకాలి?

జియో (Jio): మొదట MyJio యాప్‌ని ఓపెన్ చేసి, Mobile పై టాప్ చేసిన తర్వాత View all plans అని క్లిక్ చేయండి. అక్కడ Voice and SMS లేదా Value సెక్షన్‌ను వెతకండి. జియో హెల్ప్ పేజీలు, లాగిన్ అయ్యాక Jio.comలోనూ New Voice and SMS Plans, Monthly Plan క్యాటగిరీలు కనిపిస్తాయి. ఒకవేళ ఇవి మీకు కనిపించకపోతే, MyJio యాప్‌ని అప్‌డేట్ చేసి స్క్రీన్‌ను రీఫ్రెష్ (pull-to-refresh) చేయండి.

ఎయిర్‌టెల్ (Airtel): Airtel Thanks యాప్‌ ఓపెన్ చేసి మీ నంబర్ ఎంచుకుని, Recharge పై క్లిక్ చేసి All plans లోకి వెళ్లండి. అక్కడ Calls లేదా Others ఫిల్టర్ల కింద కేవలం వాయిస్ ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకవేళ ఇక్కడ కనిపిపోతే, యాప్‌ గైడ్స్ లేదా యూఎస్ఎస్‌డీ (USSD) కోడ్‌ల ద్వారా వీటిని కనుగొనవచ్చు. యాప్‌ ఆఫర్స్ మెనూని తనిఖీ చేయండి లేదా చెప్పిన షార్ట్ కోడ్‌లను డయల్ చేసి వాయిస్ ప్యాక్‌లను పొందవచ్చు.

వి (Vi): Vi యాప్‌లోకి వెళ్లాక Recharge క్లిక్ చేసి, All packs ఎంచుకోండి. Calls లేదా Special packs సెక్షన్‌లో స్క్రోల్ చేస్తే Voice and SMS ప్యాక్‌లు కనిపిస్తాయి. మీ టెలికాం సర్కిల్‌లో ఇవి ఇంకా అప్‌డేట్ కాకపోతే, మొదట మీ ప్రస్తుత ప్లాన్ వివరాలు చూసుకుని, యాప్‌ రీఫ్రెష్ చేశాక మళ్లీ ట్రై చేయండి. Vi యాప్‌లో ప్లాన్ వివరాలు ఎక్కడుంటాయో గ్యాడ్జెట్స్360 గైడ్‌లో కూడా చూడవచ్చు.

Jio, Airtel, Vi, BSNL లలో లభించే చౌకైన నెలవారీ వాయిస్/ఎస్‌ఎంఎస్ ప్లాన్లు ఇవే

ప్రస్తుతం రూ.200 లోపే పూర్తి 30 రోజుల వ్యాలిడిటీతో దేశవ్యాప్తంగా వాయిస్, ఎస్‌ఎంఎస్-ఓన్లీ ప్యాక్‌ను అందిస్తున్న ఏకైక ప్రముఖ ఆపరేటర్ జియో మాత్రమే. జియో రూ.196 ప్లాన్‌తో 30 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్, 300 ఎస్‌ఎంఎస్‌లను ఇస్తోంది. ఇక ఎయిర్‌టెల్, వి ఆపరేటర్లు 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను రూ.203కి, నెలకు ఒకే తేదీన రీఛార్జ్ అయ్యే క్యాలెండర్ మంత్ ప్లాన్‌ను రూ.206కి అందిస్తున్నాయి. ఈ రెండింటిలోనూ అన్‌లిమిటెడ్ కాల్స్, 300 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. దేశంలోని అన్ని సర్కిళ్లలోనూ ఈ ధరలే కొనసాగుతున్నాయి.

ఆపరేటర్చౌకైన 30 రోజుల వాయిస్/ఎస్‌ఎంఎస్క్యాలెండర్ మంత్ ఆప్షన్లభించే ఎస్‌ఎంఎస్‌లు
Jio₹196 (30 రోజులు)₹197 (1 నెల)మొత్తం 300
Airtel₹203 (30 రోజులు)₹206 (1 నెల)మొత్తం 300
Vi₹203 (30 రోజులు)₹206 (1 నెల)మొత్తం 300
BSNLరూ.200 లోపు లేదు (రూ.439తో 80 రోజుల కాలింగ్ ప్యాక్ ఉంది)సర్కిల్‌ను బట్టి మారుతుందిసాధారణంగా 300

తక్కువ ఖర్చుతో నెలవారీ రీఛార్జ్ పూర్తి చేయాలనుకుంటే మాత్రం జియో రూ.196 (30 రోజులు) ప్లాన్ ఉత్తమ ఎంపిక. ఎయిర్‌టెల్, వి ప్లాన్‌లు రూ.200 కంటే కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ, పాత నంబర్ మార్చకూడదనుకునేవారు లేదా ఫ్యామిలీ అకౌంట్ కొనసాగించేవారు వీటి వైపే మొగ్గుచూపవచ్చు. ఇక బిఎస్ఎన్ఎల్ విషయానికొస్తే.. రూ.439తో 80 రోజుల వ్యాలిడిటీ ఇచ్చే కాలింగ్ ప్లాన్ ప్రస్తుతం ప్రముఖంగా అందుబాటులో ఉంది.

28 రోజులు vs 30 రోజులు vs నెలవారీ ప్లాన్లు: రోజువారీ ఖర్చు ఎంత? వ్యాలిడిటీ తేడాలు ఏంటి?

అసలు విషయానికొస్తే.. మనం చూడాల్సింది రోజువారీ పడే ఖర్చు, అలాగే ఏడాదికి ఎన్నిసార్లు రీఛార్జ్ చేయాలనేది. 28 రోజుల వ్యాలిడిటీ ఇచ్చే రూ.189 వాయిస్ ప్యాక్‌తో రోజుకు దాదాపు రూ.6.75 ఖర్చవుతుంది, ఇలా ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేయాలి. అదే జియో రూ.196 ప్లాన్ (30 రోజులు) తీసుకుంటే రోజుకి రూ.6.53 మాత్రమే పడుతుంది, ఏడాదికి 12 రీఛార్జ్‌లు సరిపోతాయి. ఇక క్యాలెండర్ మంత్ (నెలవారీ) ప్లాన్ల వల్ల ప్రతీ నెలా ఒకే తేదీన రీఛార్జ్ ముగుస్తుంది కాబట్టి, రీఛార్జ్ తేదీలు ముందుకు జరిగిపోయే తిప్పలు ఉండవు.

ప్లాన్ ధరవ్యాలిడిటీరోజువారీ ఖర్చు (సుమారుగా)ఏడాదికి రీఛార్జ్‌ల సంఖ్య
₹18928 రోజులు₹6.7513
₹19630 రోజులు₹6.5312
₹2061 నెల₹6.73–₹6.6412

నెలవారీ రీఛార్జ్ నియమాలు ప్రతీ నెలా చివర్లో వచ్చే సమస్యను కూడా పరిష్కరిస్తాయి. ఉదాహరణకు, మీరు జనవరి 31న రీఛార్జ్ చేసుకుంటే, తర్వాతి రీఛార్జ్ గడువు ఫిబ్రవరి చివరి రోజుకి ముగుస్తుంది. ఆ తర్వాత మార్చి నుంచి మళ్లీ అదే తేదీన పునరుద్ధరించబడుతుంది. 2022లోనే ట్రాయ్ ఈ నిబంధనను తీసుకురావడంతో, టెలికాం సంస్థలు కూడా ప్రీపెయిడ్ బిల్లింగ్‌లో దీన్ని వర్తింపజేస్తున్నాయి. దీనివల్ల రీఛార్జ్ తేదీ మారకుండా స్థిరంగా ఉంటుంది.

డేటా యాడ్-ఆన్స్: కాలింగ్ ప్యాక్‌లకు డేటా, ఓటీటీ ఎలా జోడించుకోవాలి?

గూగుల్ మ్యాప్స్, యూపీఐ (UPI) చెల్లింపులు లేదా ఎగ్జామ్ హాల్ టికెట్ల డౌన్‌లోడ్ వంటి అవసరాలు వచ్చినప్పుడు, ఈ వాయిస్/ఎస్‌ఎంఎస్ ప్యాక్‌లకు డేటా యాడ్-ఆన్‌లు జత చేసుకోవచ్చు. MyJio యాప్‌లో Data Packs లేదా OTT Pass విభాగంలో, Airtel Thanks యాప్‌లో Buy Data ఆప్షన్‌లో, అలాగే Vi ప్రీపెయిడ్ పేజీలో డేటా ప్యాక్‌లు లభిస్తాయి. ఇలా అవసరమైనప్పుడు మాత్రమే డేటా వేసుకోవడం వల్ల కాలింగ్ ప్యాక్ ఖర్చు చాలా తగ్గుతుంది.

ఎవరికి ప్రయోజనం: విద్యార్థులు, ఓటీటీ వీక్షకులు, గేమర్లు, డబ్ల్యూఎఫ్‌హెచ్ యూజర్లు

ఇంట్లో వైఫై (Wi-Fi) వాడేవారు, విద్యార్థులు రూ.196–రూ.206 వాయిస్ ప్లాన్ ఎంచుకుని, అవసరమైనప్పుడు మాత్రమే డేటా టాప్-అప్‌లు చేసుకోవడం ద్వారా మొబైల్ ఖర్చులను బాగా తగ్గించుకోవచ్చు. ఎక్కువ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసేవారు విడిగా OTT సబ్‌స్క్రిప్షన్లు తీసుకునేకంటే OTT బండిల్డ్ ప్లాన్లు లేదా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లతో పోల్చి చూసుకోవడం మంచిది. జియో, ఎయిర్‌టెల్ అందించే కొన్ని బండిల్డ్ ప్లాన్ల ద్వారా ఓటీటీ సేవలు దాదాపు ఉచితంగానే లభిస్తాయి.

ఇతర అవసరాలు: సెకండరీ సిమ్ యాక్టివ్, డ్యూయల్ సిమ్, ఎస్‌ఎంఎస్ లిమిట్స్

బ్యాంక్ ఓటీపీల కోసం సెకండరీ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి 30 రోజుల వాయిస్, ఎస్‌ఎంఎస్ ప్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది అవుట్‌గోయింగ్ కాల్స్‌తో పాటు ఎస్‌ఎంఎస్ సదుపాయాన్ని కూడా ఇస్తుంది. కొత్త ప్లాన్‌లలో సాధారణంగా 300 ఎస్‌ఎంఎస్‌లు ఇస్తారు. ఓటీపీలు, సాధారణ మెసేజ్‌లకు ఇది సరిపోతుంది. డేటా వాడకం మొత్తాన్ని ప్రైమరీ సిమ్‌కు కేటాయించి, సెకండరీ సిమ్‌ను కేవలం కాలింగ్, ఓటీపీలకే వాడుకోవచ్చు.

ట్రాయ్ నిబంధనలు: అక్టోబర్ - నవంబర్ మధ్య వచ్చిన మార్పులేంటి?

తక్కువ వ్యాలిడిటీతో వాయిస్, ఎస్‌ఎంఎస్-ఓన్లీ ప్లాన్లను కచ్చితంగా అందుబాటులో ఉంచాలని సెప్టెంబర్ చివరి వారంలో ట్రాయ్ ఆపరేటర్లకు 30 రోజుల గడువు విధించింది. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ అక్టోబర్ 18న మూడు ప్లాన్లను తీసుకొచ్చింది. జియో, వి ఆపరేటర్లు కూడా అక్టోబర్ ఆఖరి నాటికి 30 రోజుల వ్యాలిడిటీ, క్యాలెండర్ మంత్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చాయి. ఇవన్నీ నేటి నుంచి (2026 నవంబర్ 1) వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

రీఛార్జ్ చేసుకునేటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే మేలు!

మీరు 28 రోజుల ప్లాన్ నుంచి 30 రోజుల ప్లాన్‌కు మారాలనుకుంటే.. మీ పాత ప్లాన్ ముగిసే చివరి రోజున రీఛార్జ్ చేసుకోవడం మంచిది. జీతం నెలాఖరున వచ్చే వారికి లేదా నిర్దిష్ట తేదీలలో బిల్లులు చెల్లించే వారికి క్యాలెండర్ మంత్ ప్యాక్‌లు సౌకర్యవంతంగా ఉంటాయి. ప్లాన్ గడువు ముగియడానికి 3 రోజుల ముందే ఆపరేటర్లు ఎస్‌ఎంఎస్ రిమైండర్ పంపుతారు. ఫిబ్రవరి లేదా 31 రోజులుండే నెలల్లో గడువును సరిగ్గా చూసుకుని రీఛార్జ్ చేసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు.

టెలికాం ఆపరేటర్ల ప్లాన్ల ముఖ్యాంశాలు: ఏది బెస్ట్?

అన్ని ఆపరేటర్లలోనూ అన్‌లిమిటెడ్ కాల్స్, 300 ఎస్‌ఎంఎస్‌లు సమానంగానే ఉన్నాయి. తేడల్లా ధర, వ్యాలిడిటీ రకాల్లోనే ఉంది. నెల మొత్తానికి రూ.200 లోపే కావాలనుకుంటే జియో రూ.196 ప్లాన్ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. ఎయిర్‌టెల్, వి ప్లాన్‌లు రూ.200 కంటే కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ, రూ.206తో క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ ఆప్షన్‌ను ఇస్తున్నాయి. బిఎస్ఎన్ఎల్‌లో రూ.439తో 80 రోజుల కాలింగ్ ప్లాన్ ప్రముఖంగా ఉంది కానీ రూ.200 లోపు నెలవారీ కాలింగ్ ప్యాక్ ఇంకా అందుబాటులోకి రాలేదు.

మీకు కేవలం కాలింగ్, ఓటీపీలు మాత్రమే కావాలనుకుంటే.. 30 రోజులు లేదా క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ ఉండే వాయిస్, ఎస్‌ఎంఎస్ ప్యాక్‌ను ఎంచుకుని, అత్యవసరమైనప్పుడు మాత్రమే డేటా వేసుకోవడం మంచిది. రూ.200 లోపు నెలకు సరిపోయే ప్లాన్‌లలో జియో రూ.196 మంచి ఆప్షన్‌గా ఉండగా, ఎయిర్‌టెల్, వి సంస్థలు ప్రతీ నెలా ఒకే తేదీన రీఛార్జ్ అయ్యే ప్యాక్‌లను అందిస్తున్నాయి. గడువు తేదీని గుర్తుపెట్టుకుని, ఆపరేటర్లు పంపే ఎస్‌ఎంఎస్ రిమైండర్ ఆధారంగా రీఛార్జ్ చేసుకుంటే ప్రతి నెలా రీఛార్జ్ తిప్పలు తప్పుతాయి!

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X