ఇండియాలో 500 Mbps వేగంతో లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు ఇవే...

|

ఇండియాలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి హై-స్పీడ్ ఇంటర్నెట్ కోసం డిమాండ్ బారీగా పెరిగింది. ఒకే వై-ఫై నెట్‌వర్క్‌ మీద ఆధారపడి చాలా మంది వ్యక్తులు వారి ఇంటి వద్ద నుండే ఆఫీస్ కార్యకలాపాలు చేస్తున్నారు, మరియు పిల్లలు ఆన్ లైన్ తరగతులు వింటున్నారు. అలాగే దీనికి తోడుగా వినోదం కోసం ప్రజలు సినిమాలను మరియు టీవీ షోలను ప్రసారం చేయడానికి కూడా హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్నారు. ఒకవేళ మీకు పెద్ద కుటుంబం ఉంటే కనుక మీరు పొందడానికి ఉత్తమమైన ఇంటర్నెట్ స్పీడ్ ప్లాన్‌లలో ఒకటి 500 ఎమ్‌బిపిఎస్ ప్లాన్. ఈ ఒక్క ప్లాన్‌లతో ఒకే వై-ఫై నెట్‌వర్క్‌తో ఎక్కువ మందిని అనుసంధానించబడి భారీగా డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ చేయడానికి అనుమతిని ఇస్తుంది. భారతదేశంలో లభించే ఉత్తమమైన 500 Mbps ఇంటర్నెట్ ప్లాన్‌ల జాబితా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియోఫైబర్ 500 Mbps స్పీడ్ రూ.2,499 ప్లాన్ వివరాలు
 

జియోఫైబర్ 500 Mbps స్పీడ్ రూ.2,499 ప్లాన్ వివరాలు

జియోఫైబర్ తన యొక్క వినియోగదారులకు Rs.2,499 ధర వద్ద అందించే ప్లాన్‌తో వినియోగదారులకు 500 Mbps డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగాన్ని అందిస్తుంది. ఇది ఒక నెల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ వార్షిక చెల్లుబాటుతో కూడా లభిస్తుంది. ఈ ప్లాన్‌ను ఎంచుకున్న బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు జియో సెట్-టాప్ బాక్స్‌ను ఉచితంగా అందించడంతో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్‌ ప్రయోజనం కూడా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో 3.3TB లేదా 3,300GB నెలవారీ డేటా క్యాప్ ఉండడం గమనార్హం.

జియోఫైబర్ 500 Mbps స్పీడ్ ప్లాన్ OTT యాప్ ప్రయోజనాలు

జియోఫైబర్ 500 Mbps స్పీడ్ ప్లాన్ OTT యాప్ ప్రయోజనాలు

జియోఫైబర్ యొక్క 500 Mbps ప్లాన్‌తో వినియోగదారులకు అదనంగా ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫాం చందాలను ఉచితంగా అందిస్తున్నాయి. ఇందులో భాగంగా అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ + హాట్‌స్టార్ VIP, వూట్ కిడ్స్, ALT బాలాజీ, షెమరూమి, వూట్ సెలెక్ట్, హోయిచోయ్, లయన్స్‌గేట్ ప్లే, ఈరోస్ నౌ, జియోసావన్, సన్‌నెక్స్ట్, సోనీలైవ్, డిస్కవరీ + మరియు జియో సినిమా వంటి OTT యాప్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.

స్పెక్ట్రా ఫాస్టర్ ప్లాన్ పూర్తి వివరాలు

స్పెక్ట్రా ఫాస్టర్ ప్లాన్ పూర్తి వివరాలు

ఇండియాలో ఇప్పుడు స్పెక్ట్రా ఫాస్టర్ ప్లాన్ కూడా వినియోగదారులకు 500 Mbps డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. ఏదేమైనా వినియోగదారులు ఈ ప్లాన్‌తో ఒక నెల చెల్లుబాటు కాలంలో 750GB తక్కువ డేటాను మాత్రమే పొందుతారు. అయితే 1500GB వరకు డేటా క్యారీఓవర్ సౌకర్యం కూడా ఉంది. ఈ ప్లాన్ వేర్వేరు నెలవారీ కాన్ఫిగరేషన్లలో కూడా అందుబాటులో ఉంది.

స్పెక్ట్రా ఫాస్టర్ ప్లాన్ నెలవారి ధరల వివరాలు
 

స్పెక్ట్రా ఫాస్టర్ ప్లాన్ నెలవారి ధరల వివరాలు

స్పెక్ట్రా ఫాస్టర్ ప్లాన్ ఒక నెల వాలిడిటీ కాలానికి GST మినహా వినియోగదారులు రూ.1,599 ధర చెల్లించి పొందవచ్చు. 12 నెలల కంటే తక్కువ చెల్లుబాటుతో లభించే ప్లాన్ ను మొదటిసారిగా కొనుగోలు చేసే వినియోగదారులు తిరిగి చెల్లించే రూ.2,000 సెక్యూరిటీ మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. కనెక్షన్ పొందేటప్పుడు వినియోగదారుడు చెల్లించాల్సిన 1,000 రూపాయల ఇన్‌స్టాలేషన్ ఛార్జ్ కూడా వర్తిస్తుంది. దురదృష్టవశాత్తు ఈ ప్లాన్ లో ఎటువంటి OTT ప్రయోజనాలు అందుబాటులో లేవు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Best 500 Mbps Speed Internet Broadband Plans in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X