Home
News

ధర రూ.15 వేలలోపు బె‌స్ట్‌ 5G స్మార్ట్‌ఫోన్లు.. లిస్ట్‌ ఇదే..!

భారత మార్కెట్‌లో బడ్జెట్‌ రేంజ్‌ ఫోన్లకు ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేస్తున్నవారిలో ఎక్కువ మంది కనీసం 4GB ర్యామ్‌, మెరుగైన ప్రాసెసర్‌ సహా డిస్‌ప్లేను కోరుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థలు కూడా కస్టమర్ల ప్రాధాన్యతలకు అనుగుణంగా తక్కువ రేంజ్‌లోనే మెరుగైన ఫీచర్లతో ఫోన్లను విడుదల చేస్తున్నాయి.

ఈ జాబితాలో శాంసంగ్‌ గెలాక్సీ M14 5G, ఐకూ Z6 Lite 5G, రెడ్‌మీ 12 5G, వివో T2x 5G, రియల్‌మీ 9i వంటి ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లు 15 వేల రూపాయల ధరను కలిగి ఉంటాయి. మరియు 5G కనెక్టివిటీ సహా మెరుగైన ఫీచర్లను కలిగి ఉన్నాయి.

Best 5G Smartphones under rs15000

శాంసంగ్ గెలాక్సీ M14 5G: ఈ ఫోన్‌ రూ.14,990 వద్ద కొనుగోలు చేయవచ్చు. Exynos 1330 SoCపైన పనిచేస్తుంది. 6GB ర్యామ్‌, 128GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది. శాంసంగ్‌ M14 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.6 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా సహా 2MP మాక్రో, డెప్త్‌ సెన్సార్‌లను కలిగి ఉంటుంది.

రెడ్‌మీ 12 5G : ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. మరియు 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.71 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ రెడ్‌మీ ఫోన్‌ 5000mAh బ్యాటరీతో వస్తుంది. వెనుకవైపు డ్యూయల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇందులో భాగంగా 50MP ప్రధాన కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ 6GB వేరియంట్‌ అమెజాన్‌లో రూ.13,499గా ఉంది.

Best 5G Smartphones under rs15000

Vivo T2x 5G : ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6020 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాతో వస్తుంది. మరియు 6.58 అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ 4GB ర్యామ్‌, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ అమెజాన్‌లో రూ.14,990గా ఉంది. 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

రియల్‌మీ 9i : ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ ప్రస్తుతం రూ.12,399కే లభిస్తుంది.

Best 5G Smartphones under rs15000

iQoo Z6 Lite 5G : ఈ స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.13,999గా ఉంది. 5000mAh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. వెనుక వైపు 50MP ప్రధాన కెమెరా సహా 2MP మాక్రో సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అలాగే 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Best 5G Smartphones under rs15000 price range september 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X