ధర రూ.20,000 లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు.. లిస్ట్, ధరలు..!
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మిడ్ రేంజ్ ఫోన్లకు భారీ డిమాండ్ ఉంది. అధిక శాతం మంది రూ.20,000 ధర లోపల ఫోన్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ధరలో శాంసంగ్, రెడ్‌మీ, మోటోరోలా, పోకో, ఇన్‌ఫినిక్స్ వంటి అనేక సంస్థలు 5G స్మార్ట్‌ఫోన్లను విడుదల చేశాయి.
Redmi 12 5G స్మార్ట్‌ఫోన్ ఇటీవలే విడుదల అయింది. ఈ ఫోన్ వెనుకవైపు గ్లాస్ మెటీరియల్‌తో వస్తుంది. ఫలితంగా ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాను కలిగి ఉంటుంది. 50MP ప్రధాన కెమెరా సహా 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ.11,999కు కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ M34 స్మార్ట్‌ఫోన్ Exynos 1280 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. గెలాక్సీ M34 ఫోన్ 4 సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 5 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లను ఇవ్వనుంది. మరియు ఈ ఫోన్ 6000mAh బ్యాటరీని కలిగి ఉంటాయి. వెనుకవైపు 50MP OIS కెమెరా, 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 6GB ర్యామ్, 128GB వేరియంట్ ధర రూ.18,999గా ఉంది.
మోటోరోలా G73 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డెమెన్సిటీ 930 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఈ ఫోన్ వెనుకవైపు 50MP + 8MP కెమెరాలు, ముందువైపు 16MP కెమెరాను కలిగి ఉంటుంది. 6.5 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 5000mAh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 8GB ర్యామ్, 128GB వేరియంట్‌ను రూ.16,999కు కొనుగోలు చేయవచ్చు.

పోకో X5 ప్రో స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 778 చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 108MP ప్రధాన కెమెరా, 8MP ఆల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. ముందువైపు 16MP కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ 6GB ర్యామ్, 128GB వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.20,999గా ఉంది. కొన్నిసార్లు ప్రత్యేక ఆఫర్ తో రూ.19,999 కే కొనుగోలుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అంతవరకు వేచిచూడాల్సి ఉంటుంది.
ఇన్ఫినిక్స్ GT 10 ప్రో స్మార్ట్‌ఫోన్ మొబైల్‌లో గేమ్స్ ఆడేవారికి సౌకర్యంగా ఉంటుంది. ఈ ఫోన్ డిజైన్ నథింగ్ ఫోన్ 1 తరహా డిజైన్‌ను కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఈ ఫోన్ వెనుకవైపు 108MP+2MP+2MP కెమెరాలు, ముందువైపు 32MP కెమెరాలను కలిగి ఉండనుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత XOS 13పై పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.19,999కు అందుబాటులో ఉంది.

గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








