రూ.5 వేల ధర రేంజ్‌లో ఎయిర్ కూలర్‌లు కొనుగోలు చేయాలా.. అయితే ఈ వివరాలు మీ కోసమే..!
దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత మరింత అధికంగా ఉంటోంది. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత సంవత్సరం కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేసవి ప్రారంభానికి ముందే వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు చేసింది. ఈ సంవత్సరం కూడా ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరించింది.
దీంతో వేసవి ప్రారంభంలోనే అనేక మంది ఎయిర్ కూలర్‌లు (Air Coolers), ఎయిర్ కండీషనర్లు (AC) కొనుగోలు చేసుకున్నారు. మరికొంత మంది ఇప్పుడు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. AC ల కోసం సుమారు రూ.30 వేల కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే ఎయిర్ కూలర్‌లను రూ.5 వేల నుంచి కూడా అందుబాటులో ఉన్నాయి.

ఎయిర్ కూలర్‌లు కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికోసం ప్రస్తుతం సుమారు రూ.5 వేల ధరలో మూడు బెస్ట్ కూలర్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు కార్డులతో మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ కూలర్ ల సామర్థ్యం, ధర, సేల్ పూర్తి వివరాలు.
37 లీటర్ల సామర్థ్యంతో :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో sansui 37 L ఎయిర్ కూలర్ డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. విడుదల సమయంలో దీని ధర రూ.8799 కాగా ప్రస్తుతం రూ.4170 కే సొంతం చేసుకోవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ కూలర్ ను రూ.3572 కే కొనుగోలు చేయవచ్చు.
ఈ కూలర్ 37 లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. మరియు మోటార్ స్పీడ్ 1330 RPM గా ఉంది. మరియు ఈ కూలర్ Honeycomb ప్యాడ్స్‌ను కలిగి ఉంది. ఫలితంగా మెరుగైన కూలింగ్‌ను అందిస్తుంది. ఈ వేసవిలో బెస్ట్ ఆప్షన్‌గా ఉంది. ఇంట్లో మరియు కార్యాలయాల్లో సౌకర్యంగా వినియోగించుకోవచ్చు.
45 లీటర్ల సామర్థ్యంతో :
దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌లో మరో కూలర్ బెస్ట్ ధరకు అందుబాటులో ఉంది. Kenstar 45 L కూలర్ ఒరిజినల్ ధర రూ.11990 గా ఉండేది. ప్రస్తుతం రూ.5334 ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో మరింత తగ్గింపు ధర రూ.4623 కే సొంతం చేసుకోవచ్చు.
ఈ ఎయిర్ కూలర్ 45 లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2200m3/h ఎయిర్ డెలివరీతోపాటు 4 వే ఎయిర్ డిఫ్లక్షన్ మరియు 3 స్పీడ్ కంట్రోల్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు కెన్‌స్టార్ కూలర్ honeycomb pads ను కలిగి ఉంది.
46 లీటర్ల సామర్థ్యం :
ఓరియంట్ ఎలక్ట్రిక్ నుంచి మరో బెస్ట్ కూలర్ 47 శాతం డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. ఈ 46 లీటర్ల కూలర్ ధర రూ.5819 గా ఉంది. బ్యాంకు కార్డులతో మరింత డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫలితంగా రూ.4966 కే సొంతం చేసుకోవచ్చు. ఈ కూలర్ 4 వే ఎయిర్ డిఫ్లక్షన్ సిస్టమ్, 3 స్పీడ్ కంట్రోల్ ను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications