Home
News

తక్కువ ధరలో లభిస్తున్న Airtel DTH ప్లాన్‌లు ఇవే

ఇండియాలోని DTH రంగంలో డిష్ టీవీ,D2h, టాటా స్కై వంటి ఆపరేటర్లతో పాటుగా వినియోగదారులకు అద్భుతమైన సేవలను అందిస్తున్న వాటిలో ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ కూడా ఉంది. భారతదేశంలోని అతిపెద్ద డిటిహెచ్ ఆపరేటర్లలో ఒకటైన ఎయిర్‌టెల్ సంస్థ తమ కస్టమర్లకు కొన్ని నిజమైన మరియు లాభదాయకమైన సేవలను తక్కువ ధరలో కూడా అందిస్తున్నది.

ఎయిర్‌టెల్ డిజిటల్ టీ

ఎయిర్‌టెల్ డిజిటల్ టీ

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ యొక్క సమర్పణలకు ఉత్తమమైన చేర్పులలో మరొకటి ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్. ఇది ఆండ్రాయిడ్ టీవీ STB తో రూ.399 ధర వద్ద వస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కస్టమర్లు ప్రస్తుతం పరిమిత సమయం ఆఫర్ కింద కేవలం రూ.1,500 ధరకే దీనిని పొందవచ్చు. ఎయిర్‌టెల్ డిజిటల్ టివి తన వినియోగదారులకు చౌకైన ధరల వద్ద కూడా డిటిహెచ్ ప్లాన్‌లను అందిస్తున్నది. మరి ముఖ్యంగా రూ.300 లోపు గల చౌకైన డిటిహెచ్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్టెల్ డిజిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్ రీజినల్ ప్యాక్ SD (తెలుగు)

ఎయిర్టెల్ డిజిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్ రీజినల్ ప్యాక్ SD (తెలుగు)

ఆంధ్రప్రదేశ్ రీజినల్ SD ప్యాక్ లో  19 తెలుగు ఛానల్స్, 2 మలయాళ ఛానల్స్, 1 హిందీ మూవీ ఛానల్, 1 హిందీ న్యూస్ ఛానల్, 4 స్పోర్ట్స్ ఛానల్స్, 1 మ్యూజిక్ ఛానల్, మరియు 1 ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. 37FTA ఛానెల్‌ల చందాతో పాటు మొత్తంగా 32ఛానెల్‌లను కలిగి ఉన్నాయి. ఈ ప్లాన్‌ను వినియోగదారులు నెలకు రూ.279 చెల్లించి కొనుగోలు చేయవచ్చు.

ఎయిర్టెల్ డిజిటల్ టివి దబాంగ్ స్పోర్ట్స్ ప్యాక్

ఎయిర్టెల్ డిజిటల్ టివి దబాంగ్ స్పోర్ట్స్ ప్యాక్

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీలో రూ.300 ధర లోపు విభాగంలో హిందీ భాష ఛానల్ ప్యాక్ కోసం మీరు చూస్తున్నట్లయితే ఈ ప్లాన్ మీకు సరిగ్గా సరిపోతుంది. ఈ ఛానెల్ ప్యాక్ చందాతో స్పోర్ట్స్ ఛానెల్‌లు అధికంగా పొందవచ్చు. కాబట్టి మీరు అధికంగా క్రీడలను ఇష్టపడితే కనుక మీరు దీన్నిపరిగణించవచ్చు. కానీ ఇందులో ఇతర వినోద ఛానల్లు కూడా అధికంగా ఉన్నాయి. దబాంగ్ స్పోర్ట్స్ ప్యాక్ లో 15 హిందీ న్యూస్ ఛానెల్స్, 12 హిందీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, 2 కిడ్ ఛానల్స్, 11 హిందీ మూవీ ఛానెల్స్ ఉన్నాయి. వీటితో పాటుగా భోజ్ పురి, పంజాబీ, గుజరాతీ వంటి ఇతర భాషలలోని కొన్ని ఛానెళ్ళకు కూడా యాక్సిస్ లభిస్తుంది. వాటితో పాటు 220FTA ఛానెల్‌లు ఈ ప్యాక్‌లో అదనంగా కూడా ఉన్నాయి. ఈ ప్యాక్ యొక్క నెలవారీ ధర రూ.290.

ఎయిర్టెల్ డిజిటల్ టీవీ తమిళనాడు లైట్ SD ప్యాక్

ఎయిర్టెల్ డిజిటల్ టీవీ తమిళనాడు లైట్ SD ప్యాక్

ఎయిర్టెల్ డిజిటల్ టీవీ యొక్క తమిళనాడు లైట్ ఎస్డీ ప్యాక్ నెలకు రూ.275 ధర వద్ద మాత్రమే లభిస్తుంది. ఇందులో దక్షిణ ప్రాంతం యొక్క 46 ఛానెల్స్ ఉన్నాయి. వీటితో పాటుగా 2 ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్, 5 హిందీ న్యూస్ ఛానల్స్, 4 స్పోర్ట్స్ ఛానల్స్, 24 దూరదర్శన్ ఛానల్స్, 1 హిందీ మూవీస్ ఛానల్, 4 భక్తి ఛానెల్స్ వంటివి ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Best Airtel DTH Plans Under Rs 300
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X