బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ రేసులో ఉన్న మొబైల్స్ ఇవే

By Gizbot Bureau
|

దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఈ ఏడాది వరుసగా ఫోన్లు రిలీజ్ చేస్తూనే ఉన్నాయి. ఒకే కంపెనీ నాలుగైదు ఫోన్లు రిలీజ్ చేస్తూ యూజర్లకు ఆకట్టుకుంటున్నాయి. షియోమీ కంపెనీ మొన్న ఒక్క రోజే మూడు ఫోన్లు రిలీజ్ చేసింది. అలాగే ఇతర కంపెనీలు కూడా పోటీపడుతూ మార్కెట్లోకి తమ బ్రాండెడ్ ఫోన్లను తీసుకువస్తున్నాయి.

 
best-android-phones-2019

అయితే కెమెరా, ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టం, ర్యామ్ మొదలగు విభాగాల్లో ఈ ఫోన్లు బాగా పనిచేస్తున్నాయనే విషయం మీద చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ఈ శీర్షికలో భాగంగా మీకు బెస్ట్ అనిపించే 4 స్మార్ట్ ఫోన్లను పరిచయం చేస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

Google Pixel 3a

Google Pixel 3a

బెస్ట్ కెమెరా, గ్రేట్ వాల్యూ ఈ ఫోన్ సొంతం.వెనుక భాగంలో 12.2 మెగాపిక్స‌ల్ కెమెరా ఉండ‌గా, దీనికి ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఓఐఎస్‌) ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. అలాగే ముందు భాగంలో 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ల‌లో ఆండ్రాయిడ్ 9.0 పై ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను అందిస్తున్నారు. 3000, 3700 ఎంఏహెచ్ బ్యాట‌రీల‌ను ఈ ఫోన్ల‌లో ఏర్పాటు చేశారు. వీటికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. పిక్స‌ల్ 3ఎ, పిక్స‌ల్ 3ఎ ఎక్స్ఎల్ ఫోన్లు జ‌స్ట్ బ్లాక్‌, క్లియ‌ర్లీ వైట్‌, ప్యుపిల్ ఐష్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల‌య్యాయి. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ ఫోన్ల‌ను విక్ర‌యించ‌నున్నారు. 399 డాల‌ర్ల (దాదాపుగా రూ.27,780) ప్రారంభ ధ‌ర‌కు ఈ ఫోన్లు ల‌భ్యం కానున్నాయి.

గూగుల్ పిక్స‌ల్ 3ఎ ఫీచర్లు

గూగుల్ పిక్స‌ల్ 3ఎ ఫీచర్లు

5.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, డ్రాగ‌న్‌ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 670 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 12.2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, యాక్టివ్ ఎడ్జ్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

Huawei Mate 20 X
 

Huawei Mate 20 X

ఇది అందరికీ చాలా ఇంట్రస్టింగ్ ఫోన్. ఫాంటమ్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లూ కలర్లలో 899 యూరోలకు (దాదాపుగా రూ.76,275) ఈ ఫోన్‌ను విక్రయిస్తున్నారు. ఇందులో 7.2 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. కైరిన్ 980 చిప్‌సెట్‌ను ఇందులో అమర్చారు. అందువల్ల ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది.

హువావే మేట్ 20ఎక్స్ ఫీచర్లు

7.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 2244 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, హువావే కైరిన్ 980 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 40, 20, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపీ 53 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, హువావే సూపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్.

OnePlus 7 Pro

OnePlus 7 Pro

వన్‌ప్లస్ 7 ప్రో ధర రూ.48,999 నుంచి ప్రారంభమౌతోంది. 6 జీబీ ర్యామ్/128 జీబీ మెమరీ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. ఇక 8 జీబీ ర్యామ్/256 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.52,999గా, 12 జీబీ ర్యామ్/256 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.57,999గా ఉంది.

వన్‌ప్లస్ 7 ప్రో ఫోన్‌లో 855 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్, 6.7 అంగుళాల ఆమ్‌లెడ్ డిస్‌ప్లే, అల్ట్రాఫాస్ట్ స్టోరేజ్, అడ్వాన్స్‌డ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, సేఫ్టీ ఫర్ ఐ సర్టిఫికేషన్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, ట్రిపుల్ రియర్ కెమెరా (48 ఎంపీ+16 ఎంపీ+8 ఎంపీ), 16 ఎంపీ పాపప్ సెల్ఫీ కెమెరా, ఫుల్‌వ్యూ డిస్‌ప్లే, డాల్బే ఆటమ్ డ్యూయెల్ స్పీకర్స్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ వంటి పలు ప్రత్యేకతలున్నాయి.

Honor 20

Honor 20

హానర్ 20 ఫోన్‌ను మిడ్‌నైట్ బ్లాక్, సఫైర్ బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదల చేయగా ఈ ఫోన్‌ను రూ.32,999 ధరకు అందుబాటులో ఉంది.

హానర్ 20 ఫీచర్లు

6.26 ఇంచ్ పుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, హువావే కైరిన్ 980 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ (హానర్ 20), 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ (హానర్ 20 ప్రొ), ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, హానర్ 20 ప్రొ - 48, 16, 8, 2 మెగాపిక్సల్ క్వాడ్రపుల్ బ్యాక్ కెమెరాలు, హానర్ 20 - 48, 16, 2, 2 మెగాపిక్సల్ క్వాడ్రపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3డీ పోర్ట్రెయిట్ లైటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి ఆడియో, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, హానర్ 20 - 3750 ఎంఏహెచ్ బ్యాటరీ, హానర్ 20 ప్రొ - 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, హానర్ సూపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
4 best Android phones in mid-2019

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X