నార్త్ కొరియా అంతకు తెగించిందా , అసలు నిజమెంత..?

Written By:

ఇంటర్నెట్ ప్రపంచాన్నే ఓ కుదుపు కుదిపేసింది వన్నాక్రై సైబర్ దాడి. ఐదు రోజుల కిందట జరిగిన ఈ దాడితో ప్రపంచమంతా వణికిపోయింది. రాన్సమ్ వేర్ వైరస్ ను ఉపయోగించి ఈ అనూహ్య దాడికి పాల్పడిందో ఎవరో కనుగోవడంలో ప్రస్తుతం సెక్యురిటీ సంస్థలన్నీ నిమగ్నమై ఉన్నాయి. అయితే ఈ దాడుల వెనుక ఉత్తర కొరియా హస్తముందని, అందుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను కనుగొన్నామని సెక్యూరిటీ రీసెర్చర్లు సంచలన ప్రకటన చేశారు.

ధర ఇంత తక్కువా..? ఇండియాకు వచ్చేసిన నోకియా 3310

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

150 దేశాల్లో

ర్యాన్సమ్ వేర్ వైరస్ గా కంప్యూటర్లలోకి ప్రవేశించిన 'వన్నా క్రై' 150 దేశాల్లోని ప్రముఖ వ్యాపార కేంద్రాలను, సంస్థలను తీవ్ర ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే.

లాజరస్ అనే హ్యాకర్ గ్రూప్

లాజరస్ అనే హ్యాకర్ గ్రూప్ ఉత్తర కొరియా ప్రభుత్వంతో సంబంధాలను కలిగివుందని, వారి టూల్ కోడ్ ను హ్యాక్ అయిన కంప్యూటర్లలో కనుగొన్నామని ఫిడిలిస్ సైబర్ సెక్యూరిటీలో థ్రెడ్ రీసెర్చ్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న జాన్ బాంమెనెక్ తెలిపారు.

 

ఉత్తర కొరియా నిపుణులు

తమకు తెలిసిన సమాచారం ప్రకారం ఉత్తర కొరియా నిపుణులు 'వన్నా క్రై' కోడ్ రాసుంటారని అలా జరగక పోయి ఉంటే, ఓ థర్డ్ పార్టీ కోడ్ ను ఉత్తర కొరియా ప్రభుత్వం, హ్యాకర్లు వాడినట్టుగా భావించాలని అన్నారు.

 

వైరస్ దాడులు

కాగా, వైరస్ దాడులు ఎక్కడి నుంచి జరిగాయన్న విషయాన్ని శోధిస్తున్నామని వైట్ హౌస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సలహాదారు థామస్ బోసెర్ట్ వెల్లడించారు.

పరిశోధనలు చేస్తున్న పలువురు రీసెర్చర్లు

ఈ వైరస్ పై పరిశోధనలు చేస్తున్న పలువురు రీసెర్చర్లు 2014లో సోనీ పిక్చర్స్ ఎంటర్ టెయిన్ మెంట్ సంస్థలో జరిగిన భారీ హ్యాకింగ్ కు దీనికి సంబంధాలున్నాయని, ఆనాడు వైరస్ ను సోనీ సంస్థలోకి పంపింది కూడా ఉత్తర కొరియానేనని గుర్తు చేస్తున్నారు.

 

ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ ను

అప్పట్లో ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ ను హత్య చేసే పన్నాగం కథాంశంతో సోనీ ఓ సినిమాను తీయగా, దాని విడుదలకు కొన్ని రోజుల ముందు సైబర్ దాడి జరిగిన సంగతి తెలిసిందే.

రష్యా, అమెరికాల మధ్య తాజాగా మరో రాజకీయ యుద్ధం

మరో న్యూస్ ప్రకారం రష్యా, అమెరికాల మధ్య తాజాగా మరో రాజకీయ యుద్ధం సృష్టించడానికి ఉత్తరకొరియా ఈ పన్నాగం పన్నినట్టు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ వన్నాక్రై సైబర్ అటాక్ ముప్పు కాస్త తగ్గినప్పటికీ, ఇప్పటికే 3,00,000 కంప్యూటర్లు హ్యాకైనట్టు టాప్ అమెరికా అధికారి చెప్పారు.

 

అమెరికా-నార్త్ కొరియాల మధ్య

అమెరికా-నార్త్ కొరియాల మధ్య ఇప్పటికే యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఈ దాడికి కారణం అమెరికా కేంద్ర నిఘా సంస్థ రూపొందించిన టూల్సేనని దాడికి వెలుగులోకి వచ్చిన రోజు అగ్రరాజ్యాన్ని తిట్టిపోశారు.

 

రాన్సమ్ డేటా కలిగి ఉన్న టూల్ ను

కానీ రాన్సమ్ డేటా కలిగి ఉన్న టూల్ ను ఎన్ఎస్ఏ రూపొందించలేదని, ఇది గ్లోబల్ ఎటాకేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టాప్ సైబర్, హోమ్ ల్యాండ్ సెక్యురిటీ అడ్వయిజర్ టామ్ బాస్స్టర్ చెప్పారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Best clue yet' links North Korea to global cyber attack read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot