Amazon సేల్‌లో కెమెరాల‌పై అదిరిపోయే ఆఫ‌ర్లు.. మీరు ఓ లుక్కేయండి!

|

భార‌త్‌లో పండగ సీజ‌న్ నేప‌థ్యంలో ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ ప్లాట్‌ఫాంల‌పై ప్ర‌త్యేక సేల్స్ కొన‌సాగుతున్నాయి. Amazon లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 సేల్ లో భాగంగా అనేక కంపెనీల‌కు చెందిన ప‌లు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై గొప్ప డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అదనంగా, అందుబాటులో ఉన్న బ్యాంక్ మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు ఈ ఉత్పత్తుల ధరను మరింత తగ్గిస్తాయి. ముఖ్యంగా, SBI క్రెడిట్ కార్డు కస్టమర్లు సేల్ సమయంలో చేసిన కొనుగోళ్లపై 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు.

Amazon

ఇప్పుడు, మీరు అధునాత‌న కెమెరాను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, ఇక్కడ మేము ప్రస్తుతం బెస్ట్ డీల్స్ క‌లిగిన కెమెరాల జాబితాను మీకోసం అందిస్తున్నాం. డిజిట‌ల్ కంటెంట్ క్రియేట‌ర్ల‌కు ఈ కెమెరా డీల్స్ బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మీరు కూడా దీనిపై ఓ లుక్కేయండి.

Insta360 Go 2

Insta360 Go 2

సాధార‌ణ ధ‌ర‌: రూ.34,999, డీల్ ధ‌ర: రూ.21,990

Insta360 Go 2 కెమెరా గ‌తేడాది భార‌త్‌లో లాంచ్ అయింది. దీని లాంచ్ ధ‌ర రూ.34,999 గా నిర్ణ‌యించారు. అయితే ప్ర‌స్తుతం అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివ‌ల్ సేల్‌లో భాగంగా ఇది గొప్ప త‌గ్గింపుతో రూ.21,990కి అందుబాటులో ఉంది. SBI క్రెడిట్ కార్డ్ ఉన్న వినియోగదారులు తక్షణ తగ్గింపు రూ.250 పొంద‌వ‌చ్చు. ఆసక్తి ఉన్న వినియోగదారులు రూ.1,051తో ప్రారంభమయ్యే EMI ఎంపికలను కూడా పొందవచ్చు. ఇది ఛార్జ్ కేస్ మరియు యాక్సెసరీస్‌తో వస్తుంది. Insta360 Go 2 బ్లూటూత్ 5 మరియు Wi-Fiకి మద్దతు ఇస్తుంది.

GoPro Volta:

GoPro Volta:

సాధార‌ణ ధ‌ర‌: రూ.13,500, డీల్ ధ‌ర: రూ.11,290

GoPro Volta, భారతదేశంలో రూ.13,500 ధ‌ర‌కు లాంచ్ చేశారు. ప్ర‌స్తుతం ఇది ప్ర‌త్యేక సేల్‌లో భాగంగా, , రూ.11,290కు అందుబాటులో ఉంది. ఆసక్తి గల కస్టమర్‌లు తక్షణ తగ్గింపు SBI క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోళ్లకు రూ.750 త‌గ్గింపు పొంద‌వ‌చ్చు. EMI ఎంపికలు రూ.539 నుండి ప్రారంభమవుతాయి. GoPro వోల్టా ఇన్‌బిల్ట్ 4,900mAh బ్యాటరీని కలిగి ఉంది.

Sony ZV-1

Sony ZV-1

సాధార‌ణ ధ‌ర‌: రూ.67,990, డీల్ ధ‌ర: రూ.59,890

అమెజాన్లో కొనసాగుతున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 సేల్‌లో భాగంగా సోనీ ZV-1 డిజిటల్ కెమెరాను రూ.59,890 కొనుగోలు చేయ‌వ‌చ్చు. SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ.1,500 వరకు అదనపు తక్షణ తగ్గింపును పొందేందుకు అర్హులు. ఆసక్తిగల కొనుగోలుదారులు కూడా Amazon Pay, ICICI క్రెడిట్ కార్డ్‌పై రూ.300 క్యాష్‌బ్యాక్ మరియు 2,200 వెల్‌కం రివార్డ్‌లు పొంద‌వ‌చ్చు. Sony ZV-1 ధ‌ర ప్రస్తుతం కంపెనీ వెబ్‌సైట్‌లో రూ.67,990 గా ఉంది.

DJI OM 4 SE

DJI OM 4 SE

సాధార‌ణ ధ‌ర‌: రూ. 9,990, డీల్ ధ‌ర: రూ.7,998

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో ఈ DJI OM 4 SE కెమెరా రూ.7,998 అందుబాటులో ఉంది. SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ.750 అదనపు తగ్గింపును పొందవచ్చు. Amazon ఎంపిక చేయబడిన చెల్లింపు పద్ధతులతో నో-కాస్ట్ EMI ఎంపికను కూడా అందిస్తోంది. 3-యాక్సిస్ స్టెబిలైజేషన్‌తో, పోర్టబుల్ గింబల్ స్మార్ట్‌ఫోన్‌లలో చిత్రీకరించిన వీడియోలను చాలా స్మూత్‌గా కనిపించేలా చేయడంలో సహాయపడుతుంది. DJI OM 4 SE కెమెరా 2,450mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాటరీని కలిగి ఉంది.

స్మార్ట్‌టీవీలపై ఆఫ‌ర్లు:

స్మార్ట్‌టీవీలపై ఆఫ‌ర్లు:

OnePlus 43Y1S ప్రో:
సాధార‌ణ ధ‌ర‌: రూ.39,999, డీల్ ధ‌ర: రూ.26,999 (33శాతం డిస్కౌంట్‌)

OnePlus 43Y1S ప్రో స్మార్ట్‌టీవీ 43-అంగుళాల స్క్రీన్‌ను 4K (3,840x2,160 పిక్సెల్‌లు) రిజల్యూషన్తో, 60Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఈ స్మార్ట్ టీవీ ఇన్‌బిల్ట్ Chromecast మరియు Google అసిస్టెంట్ వంటి ఫీచర్‌లతో Android TV 10లో రన్ అవుతుంది. ఇది డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో నడిచే 24W స్టీరియో స్పీకర్లతో అమర్చబడి ఉంది. టీవీ ప్రస్తుతం 33 శాతం తగ్గింపుతో జాబితా చేయబడింది.

Samsung AUE60 క్రిస్టల్ 4K UHD స్మార్ట్ టీవీ:

Samsung AUE60 క్రిస్టల్ 4K UHD స్మార్ట్ టీవీ:

సాధార‌ణ ధ‌ర‌: రూ.52,900, డీల్ ధ‌ర: రూ.28,969 (45శాతం డిస్కౌంట్‌)

ఈ Samsung AUE60 క్రిస్టల్ 4K UHD స్మార్ట్ టీవీ 43-అంగుళాల స్క్రీన్‌తో 4K (3,840x2,160 పిక్సెల్‌లు) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఇది ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్ మరియు మరిన్నింటి వంటి స్ట్రీమింగ్ యాప్‌లకు యాక్సెస్‌తో Tizen OSలో రన్ అవుతుంది. ప్రస్తుతం దీని ధరపై 45 శాతం తగ్గింపు ఉంది. అదనంగా, రూ.3,760 వ‌ర‌కు ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Best Deals on Cameras in Amazon Great Indian Festival 2022 Sale

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X