ధర రూ.700 కంటే తక్కువ ధరలో Jio పాపులర్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు.. డేటా, వ్యాలిడిటీ పూర్తి వివరాలు..!
భారత్ టెలికాం రంగంలో యూజర్ల పరంగా జియో తొలి స్థానంలో ఉంది. జులై నెలలో రీఛార్జ్ ధరలను పెంచిన అనంతరం భారీ సంఖ్యలో యూజర్లను కోల్పోయింది. దీంతో యూజర్‌లను ఆకట్టుకొనే విధంగా రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులో తీసుకొచ్చింది. ప్రస్తుతం జియో 14 రోజుల వ్యాలిడిటీ నుంచి సంవత్సరం వ్యాలిడిటీ కలిగి రీఛార్జ్ ప్లాన్లను కలిగి ఉంది. యూజర్‌ల అవసరాలకు అనుగుణంగా రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రస్తుతం జియో రూ.700 ధరలో అనేక పాపులర్ రీఛార్జ్ ప్లాన్లను (Jio popular Recharge Plans) కలిగి ఉంది.
జియో రూ.239 రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లతోపాటు 1.5GB డేటాను వినియోగించుకోవచ్చు. వీటితోపాటు జియో ఓటీటీ యాప్‌లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 22 రోజులుగా ఉంది.

రూ.249 రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్లాన్‌లో భాగంగా జియో యూజర్లు 28 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 1GB డేటాను పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు జియో ఓటీటీ యాప్‌లను వినియోగించుకోవచ్చు.
రూ.299 రీఛార్జ్ ప్లాన్ : ఈ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. డేటా పరంగా ప్రతి రోజు 1.5GB వరకు హైస్పీడ్ డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. వీటితోపాటు జియో OTT లను వినియోగించుకోవచ్చు.
రూ.399 రీఛార్జ్ ప్లాన్ : ఈ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. డేటా పరంగా రోజువారీ 2.5GB డేటాను పొందవచ్చు. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. వీటితోపాటు జియో యాప్‌లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.
జియో రూ.449 రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిడెట్ కాలింగ్ మరియు ప్రతి రోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. డేటా పరంగా రోజువారీ 3GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ పొందవచ్చు.
రూ.579 రీఛార్జ్ ప్లాన్ : ఈ జియో రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా ప్రతిరోజు 1.5GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు రోజువారీ 100 SMS సహా అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ లను కూడా వినియోగించుకోవచ్చు.
రూ.629 రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 2GB హైస్పీడ్ డేటాను పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. వీటితోపాటు జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ లను కూడా వినియోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








