రూ.5,000 లోపు బెస్ట్ ఫీచర్స్ స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నారా!! వీటిని ట్రై చేయండి...

|

ప్రపంచం మొత్తం ఇప్పుడు స్మార్ట్ రంగంలో దూసుకుపోతున్నది. ప్రస్తుత సమయంలో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ వస్తువులను కొనుగోలు చేయడానికి అధికంగా ఇష్టపడుతున్నారు. గత ఒక సంవత్సరంలో స్మార్ట్ వాచీలు అత్యంత ప్రాచుర్యం పొందిన ఉపకరణాలలో ఒకటిగా అవతరించాయి. మార్కెట్లో అనేక ప్రముఖ బ్రాండ్లు బడ్జెట్ ధరలో తమ స్మార్ట్ వాచ్లను ప్రారంభించాయి. మీరు కూడా స్మార్ట్ వాచ్ కొనాలని యోచిస్తున్నట్లయితే అలాగే రూ.5,000 మించి ఖర్చు చేయకూడదనుకుంటే కనుక మీకు కొన్ని ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

రెడ్‌మి వాచ్

రెడ్‌మి వాచ్

రెడ్‌మి వాచ్ అంతర్నిర్మిత GPSతో రావడమే కాకుండా అధునాతన హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లను అందిస్తుందని హామీ ఇచ్చింది. ఈ రెడ్‌మి వాచ్ 1.4 అంగుళాల కలర్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది లైటింగ్ మరియు పర్యావరణ పరిస్థితుల ఆధారంగా డిస్ప్లే యొక్క ప్రకాశాన్ని స్వయంచాలకంగా సర్దుబాటు చేయడంతో పాటుగా వీక్షణ అనుభవాన్ని పెంచడానికి యాంబియంట్ లైట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది. ఈ స్మార్ట్ వాచ్ 200+ వాచ్ ఫేస్‌లను మరియు 3 కలర్ స్ట్రాప్‌లను కూడా అందిస్తుంది. వీటిని ఉపయోగించి మీ ఇష్టానుసారం పరికరాన్ని అనుకూలీకరించవచ్చు.

స్మార్ట్ వాచ్

రూ. 3999 ధర వద్ద లభించే ఈ స్మార్ట్ వాచ్ హృదయ స్పందన రేటు పర్యవేక్షణ, నిద్ర పర్యవేక్షణ మరియు గైడెడ్ శ్వాస మరియు మరిన్ని వంటి అధునాతన ఆరోగ్య లక్షణాలతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 11 ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది మరియు 230mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉండి ఒక ఛార్జీపై 10 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుందని హామీ ఇచ్చింది.

నాయిస్ కలర్ ఫిట్ ప్రో 3
 

నాయిస్ కలర్ ఫిట్ ప్రో 3

నాయిస్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ రూ.4,499 ధరను కలిగి ఉండి హృదయ స్పందన రేటు మరియు SpO2 మానిటర్ మరియు 1.55-అంగుళాల LCD స్క్రీన్‌ను 320 x 360 పిక్సెల్స్ పరిమాణంతో వస్తుంది. వాటర్ ప్రూఫ్ తో లభించే ఈ స్మార్ట్‌వాచ్ 14 వేర్వేరు స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది. అలాగే ఇది ఆండ్రాయిడ్ మరియు iOS పరికరాలకు అనుకూలంగా ఉంటుంది. నాయిస్ కలర్ ఫిట్ ప్రో 3 అనుకూలీకరించదగిన మరియు క్లౌడ్ ఆధారిత వాచ్ పేస్ లను అందిస్తుంది. ఇది స్లీప్ ట్రాకింగ్ మరియు ఫిమేల్ హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో కూడా వస్తుంది. ఇది 210 mAh బ్యాటరీని కలిగి ఉండి ఒక ఛార్జీపై 10 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.

 

 

Android 12 బీటా 2 లో కొత్తగా లభించే ప్రైవసీ ఫీచర్స్ వివరాలు ఇవిగో...Android 12 బీటా 2 లో కొత్తగా లభించే ప్రైవసీ ఫీచర్స్ వివరాలు ఇవిగో...

రియల్‌మి ఫ్యాషన్ వాచ్

రియల్‌మి ఫ్యాషన్ వాచ్

రియల్‌మి ఫ్యాషన్ స్మార్ట్‌వాచ్ IP68 రేటింగ్‌తో లభిస్తూ రూ.3,499 ధరను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ నీటి-నిరోధకతను కలిగి ఉంటుంది. ఇది 1.4-అంగుళాల కలర్ టచ్‌స్క్రీన్ డిస్ప్లేను 320 × 320 పిక్సెల్స్ పరిమాణంలో కలిగి ఉంటుంది. ఇది హృదయ స్పందన రేటు మరియు SpO2 మానిటర్‌ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫ్యాషన్ వాచ్ 14 స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉండి నిద్ర, కేలరీలు బర్న్, స్టెప్స్ మరియు నడకను ట్రాక్ చేయవచ్చు. మీరు ఈ స్మార్ట్ వాచ్ ఉపయోగించి సంగీతం మరియు కెమెరాను కూడా నియంత్రించవచ్చు. ఆండ్రాయిడ్ పరికరాలతో మాత్రమే అనుకూలంగా ఉండే ఈ ఫ్యాషన్ వాచ్‌లో 7 రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో 160 mAh బ్యాటరీని కలిగి ఉంది.

నాయిస్ ఫిట్ యాక్టివ్

నాయిస్ ఫిట్ యాక్టివ్

రూ .3,499 ధర వద్ద లభించే నాయిస్ ఫిట్ యాక్టివ్ స్మార్ట్ వాచ్ 24 x 7 హృదయ స్పందన ట్రాకింగ్, ఆక్సిజన్ (SpO2) మానిటర్ మరియు స్ట్రెస్ మానిటర్ తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 1.28-అంగుళాల కలర్ LCD డిస్‌ప్లేను 240 x 240 పిక్సెల్స్ పరిమాణంలో కలిగి ఉంది. ఇది 14 స్పోర్ట్స్ మోడ్‌లతో లభించడమే కాకుండా దుమ్ము మరియు నీటి నిరోధకతను కలిగి ఉంటుంది. ఇది Android మరియు iOS పరికరాలకు అనుకూలంగా ఉంటుంది మరియు ఇది అనుకూలీకరించదగిన మరియు క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లతో వస్తుంది. నాయిస్‌ఫిట్ యాక్టివ్ 320 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి 7 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది.

అమాజ్‌ఫిట్ నియో

అమాజ్‌ఫిట్ నియో

రూ.5000 ధరల లోపు జాబితాలో అత్యంత సరసమైన స్మార్ట్‌వాచ్‌లో అమాజ్‌ఫిట్ నియో ఒకటి. రూ .2,499 ధరలో లభించే స్మార్ట్ వాచ్ రెట్రో డిజైన్ లో 1.2-అంగుళాల ఆల్వేస్-ఆన్ డిస్ప్లేను బ్లాక్ అండ్ వైట్ కలర్ ను కలిగి ఉంటుంది. నీటి-నిరోధకతో లభించే స్మార్ట్‌వాచ్ హృదయ స్పందన మానిటర్‌తో పాటుగా 3 స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది. హృదయ స్పందన రేటుతో పాటు స్మార్ట్‌వాచ్ నిద్రను కూడా ట్రాక్ చేస్తుంది. అమాజ్‌ఫిట్ నియో ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ పరికరాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ వాచ్ 160mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉండి ఒక ఛార్జ్ మీద 28 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ను అందిస్తుందని హామీ ఇచ్చింది.

Ptron Plusefit 261

Ptron Plusefit 261

రూ.2,999 ధర వద్ద లభించే ఈ స్మార్ట్ వాచ్ మెటల్ కేసింగ్ తో 1.54-అంగుళాల వంగిన డిస్ప్లేను కలిగి ఉంది. ఇది స్మార్ట్ నోటిఫికేషన్‌లతో పాటుగా టచ్-ఎనేబుల్డ్ వైర్‌లెస్ కాలింగ్, 8 స్పోర్ట్స్ మోడ్‌లు మరియు అనుకూలీకరించదగిన వాచ్ ఫేస్‌లతో లభిస్తుంది. Ptron Pulsefit 261 వాచ్ ఒక ఛార్జీపై 3 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది.

జియోనీ స్టైల్‌ఫిట్ GSW7

జియోనీ స్టైల్‌ఫిట్ GSW7

జియోనీ స్టైల్‌ఫిట్ GSW7 స్మార్ట్‌వాచ్ రూ.2,099 ధర వద్ద లభిస్తూ 1.3 అంగుళాల ఎల్‌సిడి టచ్‌స్క్రీన్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు అనుకూలంగా ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్‌లో హృదయ స్పందన సెన్సార్ మరియు స్పా 2 మానిటర్ వంటివి ఉన్నాయి. ఇది బహుళ స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉండి IP67 రేటింగ్‌తో పాటుగా నీటి-నిరోధకతను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ 130mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉండి ఒక ఛార్జీపై 4 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తామని హామీ ఇచ్చింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Best Key Features Smartwatches Under Rs.5,000 Price: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X