Home
News

ఆన్‌లైన్ క్లాసుల కోసం రూ.30,000 లోపు ధరలో లభించే ల్యాప్‌టాప్ & టాబ్లెట్‌లు ఇవే ...

కరోనా ప్రభావం దృష్ట్యా ప్రతి ఒక్కరు కేవలం ఇంటికే పరిమితం కావడంతో విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు ప్రధాన స్రవంతిగా మారాయి. అలాగే ఇంటి వద్ద నుండి పనిచేసే వారు మీటింగులకు హాజరు కావడానికి మరియు వారి యొక్క పనులను చేయడానికి పెద్ద స్క్రీన్ గల డివైస్ ను వినియోగించడానికి మొగ్గుచూపుతూ ఉంటారు. అయితే దీని కోసం అధిక మొత్తంలో డబ్బును ఖర్చు చేయకూడదనుకుంటే కనుక మీరు తక్కువ మొత్తంలో లభించే ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్‌లను కొనుగోలు చేయవచ్చు.

ఇంటర్నెట్

ఇంటర్నెట్ బ్రౌజింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్ మరియు ఇతర ప్రాథమిక కార్యకలాపాలకు అనుగుణంగా ఉండే రూ.30,000 కన్నా తక్కువ బడ్జెట్ లో లభించే మంచి ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి. టాబ్లెట్‌లు కూడా ల్యాప్‌టాప్‌ల వలె మంచి బ్యాటరీ లైఫ్ ను అందించడమే కాకుండా పెద్ద స్క్రీన్ లను కలిగి ఉండి మెరుగైన వీడియో కాల్ లను ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది. ఆన్‌లైన్ తరగతుల కోసం రూ.30,000 లోపు లభించే బడ్జెట్ ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ఆపిల్ ఐప్యాడ్ (2020) వై-ఫై మోడల్

ఆపిల్ ఐప్యాడ్ (2020) వై-ఫై మోడల్

A12 బయోనిక్ చిప్‌, 10.2-ఇంచ్ డిస్‌ప్లే, 32GB ఇంటర్నల్ స్టోరేజ్‌ వంటి ఫీచర్లతో లభించే ఆపిల్ ఐప్యాడ్ (2020) ఓన్లీ వై-ఫై మోడల్ 29,900 రూపాయల ధర వద్ద లభిస్తుంది. ప్రస్తుత ఆన్‌లైన్ తరగతుల కోసం ఇది మంచి ఎంపిక.

శామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ A 8.0 ఆండ్రాయిడ్ టాబ్లెట్

శామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ A 8.0 ఆండ్రాయిడ్ టాబ్లెట్

వై-ఫై మరియు 4G కనెక్టివిటీ ఎంపికలు, 8 అంగుళాల స్క్రీన్, 2GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు మైక్రో SD కార్డు స్లాట్ వంటి ఫీచర్లను కలిగిన సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 8.0 ఆండ్రాయిడ్ టాబ్లెట్ ను రూ.12,350 ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

లెనోవా యోగా స్మార్ట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్

లెనోవా యోగా స్మార్ట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్

10.1-ఇంచ్ స్క్రీన్, 4GB ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, వైఫై, 4G ఎల్‌టీఈ కనెక్టివిటీ కలిగిన లెనోవా యోగా స్మార్ట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్ ను రూ.20,999 ధర వద్ద ప్రస్తుతం కొనుగోలు చేయడానికి ఒక మంచి ఎంపికగా ఉంది.

 

ఏసర్ వన్ 14 విండోస్ ల్యాప్‌టాప్

ఏసర్ వన్ 14 విండోస్ ల్యాప్‌టాప్

ఏసర్ వన్ 14 విండోస్ ల్యాప్‌టాప్ కూడా ప్రస్తుత ఈ ధర విభాగంలో ఒక మంచి ఎంపికగా ఉంది. 14 అంగుళాల డిస్ప్లే, AMD A6 ప్రాసెసర్, 4 జిబి ర్యామ్, 1TB హెచ్‌డిడి స్టోరేజ్, AMD రేడియన్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ మరియు విండోస్ 10 హోమ్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగిన బడ్జెట్ విండోస్ ల్యాప్‌టాప్ రూ.22,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

 

ఆసుస్ వివోబుక్ M515DA విండోస్ 10 ల్యాప్‌టాప్

ఆసుస్ వివోబుక్ M515DA విండోస్ 10 ల్యాప్‌టాప్

మోడల్ నంబర్ M515DA-EJ001T తో ఆసుస్ వివోబుక్ ల్యాప్‌టాప్ అనేది AMD అథ్లాన్ సిల్వర్ 3050U ప్రాసెసర్, 4GB DDR4 ర్యామ్, 1TB HDD స్టోరేజ్, 15.6-అంగుళాల FHD డిస్ప్లే, AMD రేడియన్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్, విండోస్ 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండి రూ.27,990 ధర వద్ద లభిస్తుంది. అలాగే ఇంటెల్ క్వాడ్ కోర్ పెంటియమ్ సిల్వర్ N5030 ప్రాసెసర్‌తో రన్ అవుతూ 14 అంగుళాల FHD స్క్రీన్, 4GB ర్యామ్, 1TB HDD స్టోరేజ్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఫీచర్లను కలిగి ఉండే ASUS వివోబుక్ 14 (2020) మోడల్ ను రూ.24,990 ధర వద్ద పొందవచ్చు.

HP క్రోమ్‌బుక్ 14a- na10002TU ల్యాప్‌టాప్

HP క్రోమ్‌బుక్ 14a- na10002TU ల్యాప్‌టాప్

గూగుల్ క్రోమ్‌ఓస్‌, ఇంటెల్ సెలెరాన్ N4020 ప్రాసెసర్, 4GB ర్యామ్, 64GB SSD స్టోరేజ్, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్, 14 అంగుళాల అంగుళాల డిస్‌ప్లే వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగిన హెచ్‌పి క్రోమ్‌బుక్ 14a- na10002TU ల్యాప్‌టాప్ తక్కువ బడ్జెట్ రూ.25,990 ధర వద్ద కొనుగోలు చేయడానికి ప్రస్తుతం అమెజాన్ లో అందుబాటులో ఉంది. అలాగే ఇంటెల్ సెలెరాన్ ఎన్ 4020 ప్రాసెసర్‌తో రన్ అవుతూ , 4 జిబి ర్యామ్, 1 టిబి హెచ్‌డిడి స్టోరేజ్, విండోస్ 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగిన HP 15s విండోస్ 10 ల్యాప్‌టాప్ ను రూ.26,990 ధర వద్ద పొందవచ్చు.

 

ఏసర్ ఆస్పైర్ 3 విండోస్ 10 ల్యాప్‌టాప్

ఏసర్ ఆస్పైర్ 3 విండోస్ 10 ల్యాప్‌టాప్

విండోస్ 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే ఎసెర్ ఆస్పైర్ 3 విండోస్ 10 ల్యాప్‌టాప్ AMD రైజెన్ 3 ప్రాసెసర్, 15.6-అంగుళాల స్క్రీన్, 4GB ర్యామ్, 1TB స్టోరేజ్ వంటి ఫీచర్లను కలిగి ఉండి రూ.29,690 బడ్జెట్ ధర వద్ద లభిస్తుంది.

Lenovo Ideapad S145

Lenovo Ideapad S145

AMD RYZEN 3 3200U ప్రాసెసర్‌ మరియు 15.6-అంగుళాల FHD డిస్ప్లే, 4GB RAM, 1TB స్టోరేజ్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగిన లెనోవా ఐడియాప్యాడ్ S145 ల్యాప్‌టాప్ ను రూ.28,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

శామ్సంగ్ గెలాక్సీ టాబ్ S6 లైట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్

శామ్సంగ్ గెలాక్సీ టాబ్ S6 లైట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్

27,700 రూపాయల ధర వద్ద లభించే శామ్సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్ 6 లైట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్ ప్రస్తుత సమయంలో ఆన్‌లైన్ తరగతులకు అనుకూలంగా ఉంటుంది. 10.4 అంగుళాల డిస్ప్లేతో కూడిన ఈ ఆండ్రాయిడ్ టాబ్లెట్, S-పెన్ స్టైలస్ సపోర్ట్, డాల్బీ అట్మోస్ సౌండ్, 4Gb ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్, వై-ఫై కనెక్టివిటీ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Best Laptops and Tablets Available Under Rs 30,000 For Online Classes
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X