2020లో విడుదలైన బెస్ట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే...

|

2020 సంవత్సరంలో స్మార్ట్‌ఫోన్ తయారీదారులు చాలా మంది తమ యొక్క హ్యాండ్‌సెట్‌లను ఎక్కువగా మార్కెట్ లోకి విడుదల చేయలేకపోయారు. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ప్రధాన స్మార్ట్‌ఫోన్ తయారీదారులు కూడా తమ అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తక్కువ సంఖ్యలోనే తీసుకురాగలిగారు. శామ్సంగ్, ఆసుస్ మరియు ఇతర సంస్థలు కొన్ని గేమింగ్ కోసం అనువుగా ఉండే కొన్ని శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌లో విడుదల చేసారు. అద్భుతమైన గొప్ప స్క్రీన్లు, ఎక్కువ సమయం లభించే బ్యాటరీ లైఫ్ మరియు లైన్ ప్రాసెసర్ వంటి ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే 2020 లో విడుదలైన వాటిలో ఉత్తమమైన మరియు శక్తివంతమైన గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లుగా నిలిచిన వాటి యొక్క వివరాలను తనిఖీ చేయడానికి ముందుకు చదవండి.

Asus ROG Phone 3

Asus ROG Phone 3

ఆసుస్ ROG ఫోన్ 3 అనేది 2020లో విడుదలైన ఉత్తమమైన గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లలో అన్నిటికంటే ముందువరుసలో ఉంది. ఇది 6.59-అంగుళాల FHD + AMOLED ప్యానెల్‌తో 10-బిట్ HDR10 + మద్దతు మరియు 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది గేమింగ్ కోసం అద్భుతమైన స్క్రీన్‌ను కలిగి ఉంది. క్వాల్‌కామ్ యొక్క అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో రన్ అవ్వడంతో పాటు 8GB, 12GB మరియు 16GB ర్యామ్‌లతో లభించే మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. ఎయిర్-ట్రిగ్గర్స్ మరియు సైడ్-మౌంటెడ్ టైప్-సి పోర్ట్స్ మరియు ఎక్స్-మోడ్ వంటి గేమ్-సెంట్రిక్ ఫీచర్లను కలిగి ఉండడంతో పాటు ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతును ఇచ్చే భారీ 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Samsung Galaxy Note 20 Ultra

Samsung Galaxy Note 20 Ultra

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా ఫోన్ అనేది గేమింగ్ ఫోన్ కానప్పటికీ గేమింగ్ కోసం అనువైన వాటిలో ఒకటిగా ఉంది. ఉత్తమమైన గేమింగ్ ఫీచర్లను అందిస్తూ ఇది ఇప్పటికీ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా అర్హత పొందింది. ఇది 120Hz రెసొల్యూషన్ తో 6.9-అంగుళాల డైనమిక్ అమోలెడ్ క్వాడ్ HD + అతి పెద్ద స్క్రీన్‌ను కలిగి ఉంది. గేమింగ్‌ కోసం ఇది 12GB RAMతో జతచేయబడి ఉండడమే కాకుండా ఎక్సినోస్ 990 చిప్‌సెట్‌తో పాటు ప్యాక్ చేయబడి ఉంటుంది. ఇది 4,500mAh బ్యాటరీ మరియు AKG ట్యూన్డ్ స్పీకర్లను కలిగి ఉంది.

Apple iPhone 12 Pro Max

Apple iPhone 12 Pro Max

ఉత్తమమైన గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో గల ఇతర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగా స్పెసిఫికేషన్స్ శక్తివంతంగా ఉండి వాస్తవ పనితీరులో మెరుగ్గా ఉంది. ఏ గేమ్ అయినా ఆడడానికి అందంగా కనిపించేలా చేయడానికి సంస్థ యొక్క సొంత 5nm A14 బయోనిక్ ప్రాసెసర్ మరియు డ్యూయల్ స్పీకర్లతో పాటు 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR OLED స్క్రీన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

Xiaomi Mi 10T Pro

Xiaomi Mi 10T Pro

ఇండియాలో బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసే షియోమి సంస్థ 2020 లో విడుదల చేసిన Mi 10T ప్రో స్మార్ట్‌ఫోన్‌ కూడా ఉత్తమమైన గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో చేరింది. ఇది 6.67-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + డిస్‌ప్లే మరియు 144HZ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ గేమింగ్‌కు అనుకూలమైన మంచి స్క్రీన్ ను కలిగి ఉంది. ఇది క్వాల్‌కామ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో పనిచేస్తూ 8GB RAM తో జతచేయబడి వస్తుంది. ఈ ప్రాసెసర్‌ ఏ గేమ్ ను అయినా సజావుగా ఆడడానికి వీలుగా ఉంటుంది. ఇందులో ఎక్కువ సమయం గేమ్ ఆడడానికి వీలుగా 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Realme X50 Pro

Realme X50 Pro

2020 ఉత్తమమైన గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో చేరిన మరొక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్ రియల్‌మి విడుదల చేసిన రియల్‌మి X50 ప్రో కూడా జాబితాలోని మిగిలిన వారికి గట్టి పోటీని ఇస్తున్నది. గేమర్‌లకు ఎక్కువ మరియు అద్భుతమైన బ్యాటరీ పనితీరు అవసరం కోసం 4,200mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇక్కడ హైలైట్ విషయం ఏమిటంటే ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రావడం. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో రన్ అవుతూ గేమింగ్ కు అనుకూలమైన 6.44-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే స్క్రీన్ ను 90HZ రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Best New Powerful Gaming Smartphones Launched in 2020

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X