రూ.15,000 లోపు బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇవే...
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించాలని ప్రతి ఒక్కరికి ఆశగా ఉంటుంది. అయితే ప్రస్తుత కరోనా లాక్ డౌన్ సమయంలో వీటి వినియోగం ఎక్కువగా ఉంది. ఇంటర్నెట్ కోసం కావచ్చు లేదా ఇంటి వద్ద నుండి పనిచేసే వారికి గ్రూప్ వీడియో కన్ఫిరెన్స్ కాల్స్ చేయడానికి మరియు పిల్లలు ఆన్ లైన్ క్లాసులు వినడానికి వీటి వినియోగం అధికమవుతున్నది. ప్రస్తుత సమయంలో స్మార్ట్‌ఫోన్‌లను కొనాలని చూస్తున్న వారు తక్కువ ధరలో లభించే వాటి కోసం అధికంగా వెతుకుతున్నారు. కారణం ఇప్పటికే తమకు నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉండి ఫ్యామిలి కారణాల వలన బడ్జెట్ ధరలో లభించే ఫోన్ కోసం వెతుకుతుంటే కనుక రూ.15000 లోపు లభించే ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్‌ల కోసం చూస్తుంటే కనుక వాటి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

బడ్జెట్ ధరలోని Realme నార్జో 20 స్మార్ట్‌ఫోన్‌లు
ఇండియాలో బడ్జెట్ ధరలో రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్‌ల కోసం చూస్తుంటే కనుక రియల్‌మి నార్జో 20 ఫోన్ 6.5 అంగుళాల హెచ్‌డీ+ మినీ డ్రాప్ ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లేతో పాటుగా మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్‌తో రన్ అవుతూ 48+8+2 మెగాపిక్సెల్ కెమెరా ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క 4GB ర్యామ్ +64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499 కాగా 4GB ర్యామ్ +128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,499. అలాగే రియల్‌మి నార్జో 20 ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క 6GB ర్యామ్ +64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 8GB ర్యామ్ +128GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.16,999 ధర వద్ద పొందవచ్చు.

బడ్జెట్ ధరలో రియల్‌మి 7 & 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు
రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేస్తున్న వారికి 30వాట్ డార్ట్ ఛార్జ్ సపోర్ట్ తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్‌తో రన్ అయ్యే రియల్‌మి 7 మిస్ట్ వైట్, మిస్ట్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. రియల్‌మి 7 స్మార్ట్‌ఫోన్ యొక్క 6GB ర్యామ్ +64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా 8GB ర్యామ్ +128GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.16,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే ఎక్లిప్స్ బ్లాక్, లూనార్ వైట్ కలర్స్‌లో లభించే Realme 6i యొక్క 4GB ర్యామ్ +64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999 కాగా 6GB ర్యామ్ +64Gb స్టోరేజ్ వేరియంట్ ను రూ.13,999 ధర వద్ద పొందవచ్చు.

బడ్జెట్ ధరలోని రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌లు
ఇండియాలో బడ్జెట్ ధరలో ఎక్కువ మంది కొనడానికి ఇష్టపడే స్మార్ట్‌ఫోన్‌లలో రెడ్‌మీ బ్రాండ్ మొదటి వరుసలో ఉంటుంది. ఈ బ్రాండ్ యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఒకటైన రెడ్‌మీ నోట్ 9 ప్రో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5020mAh బ్యాటరీతో అరోరా బ్లూ, గ్లేసియర్ వైట్, ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది.ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క 4GB ర్యామ్ +64GB స్టోరేజ్ ధర రూ.13,999 కాగా, 4GB ర్యామ్ +128GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.14,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే 5,020ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 10+ MIUI11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతూ ఆక్వా గ్రీన్, పెబ్బెల్ గ్రే, అర్క్టిక్ వైట్ కలర్స్‌లో లభించే రెడ్‌మీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్ యొక్క 4GB ర్యామ్ +64GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.11,999 కాగా 6GB ర్యామ్ +128GB స్టోరేజ్ హైఎండ్ వేరియంట్ ను రూ.14,999 ధర వద్ద ప్రస్తుతం కొనుగోలు చేయవచ్చు.

Moto G9
5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, డ్యూయెల్ నానో సిమ్ సపోర్ట్ ఫీచర్లతో ఫారెస్ట్ గ్రీన్, సాఫైర్ బ్లూ కలర్స్‌లో లభించే మోటో జీ9 స్మార్ట్‌ఫోన్ యొక్క 4GB ర్యామ్ +64GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.10,999 ధర వద్ద పొందవచ్చు.

Samsung Galaxy M30s
సాంసంగ్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలని ఇష్టపడే వారికి బడ్జెట్ ధరలో లభించే గెలాక్సీ M30s ఫోన్ ఉపయోగకరంగా ఉంటుంది. 48+8+5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫీచర్లతో పాటు ఆండ్రాయిడ్ 9 పై + వన్ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్ తో రన్ అవుతూ ఓపల్ బ్లాక్, సాఫైర్ బ్లూ, పెరల్ వైట్ కలర్స్‌లో లభించే సాంసంగ్ గెలాక్సీ M30s యొక్క 4GB ర్యామ్ +64GB స్టోరేజ్ యొక్క ధర రూ.13,999 కాగా 6Gb ర్యామ్ +128GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.16,999 ధర వద్ద పొందవచ్చు.

Micromax In Note 1
ఇండియా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి కొత్తగా విడుదల అయిన మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 ఫోన్ సరిగ్గా సరిపోతుంది.18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, డ్యూయెల్ సిమ్ సపోర్ట్ ఫీచర్లతో గ్రీన్, వైట్ కలర్స్‌లో లభించే మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 స్మార్ట్‌ఫోన్ యొక్క 4Gb ర్యామ్ +64GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.10,999 ధర వద్ద మరియు 4GB ర్యామ్ +128GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.12,499 బడ్జెట్ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








