Amazon Freedom Sale 2020: ఎలక్ట్రానిక్స్ ఉత్పతుల కొనుగోలుకు ఇదే సరైన సమయం!!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియాలో ప్రైమ్ సభ్యుల కోసం రెండు రోజుల ప్రైమ్ డే 2020 అమ్మకాలను నిర్వహించింది. ఈ అమ్మకం సమయం పూర్తి అవ్వడంతో ఇప్పుడు ఫ్రీడమ్ సేల్ పేరుతో మరొక సేల్ ను ప్రారంభించింది. ఆగష్టు 8 నుంచి ఆగష్టు 11 వరకు ఈ సేల్ జరుగుతుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ అమ్మకంలో అమెజాన్ కొన్ని రకాల ఉత్పతుల మీద అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

అమెజాన్ ఫ్రీడమ్ సేల్ ఆగష్టు 2020
ఆగష్టు 8 -11 మధ్య నాలుగు రోజులలో జరిగే ఈ అమ్మకంలో ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద గొప్ప తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది. SBI క్రెడిట్ కార్డు కొనుగోలు మీద 10% ఇన్స్టెంట్ క్యాష్‌బ్యాక్ ను కూడా అందిస్తోంది. ఈ అమ్మకంలో స్మార్ట్ ఫోన్ల కొనుగోలు మీద 40% వరకు తగ్గింపు, ఎలక్ట్రానిక్స్ డివైస్ మరియు ఆక్సిసిరీస్ మీద 55% వరకు తగ్గింపు మరియు హోమ్ & కిచెన్ అప్లియన్స్ మీద 70% వరకు తగ్గింపును అందిస్తోంది.

అమెజాన్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్స్
అమెజాన్ ఫ్రీడమ్ సేల్ లో లభిస్తున్న మరిన్ని ఆఫర్ల విషయానికి వస్తే ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్ అమ్మకాల మీద ఆధారపడే ప్రతి ఒక్కరికి ఇంటికి కావలసిన రోజువారి సరుకుల కొనుగోలు మీద 60% వరకు తగ్గింపు కూడా అందిస్తోంది. అలాగే లగేజీ బ్యాగ్ , స్మార్ట్ వాచ్, ఫుట్ వెర్ మరియు కొత్త రకం ఫ్యాషన్ బట్టల కొనుగోలు మీద కూడా 70% తగ్గింపు అందిస్తుంది.

అమెజాన్ ఫ్రీడమ్ సేల్ ల్యాప్‌టాప్ ల మీద తగ్గింపు ఆఫర్లు
కొనుగోలుదారులు ఎవరైనా కొత్త ల్యాప్‌టాప్లను కొనుగోలు చేయడానికి అమెజాన్ ఫ్రీడమ్ సేల్ లో అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఇందులో మరి ముఖ్యంగా Mi నోట్ బుక్ మరియు Mi నోట్ బుక్ హారిజోన్ ల్యాప్‌టాప్ల మీద రూ.2000 వరకు అద్భుతమైన తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది. ఇవి కాకుండా డెల్ సంస్థ యొక్క ల్యాప్‌టాప్ల మీద కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి.

అమెజాన్ ఫ్రీడమ్ సేల్ నో-కాస్ట్ EMI ఆఫర్స్
అమెజాన్ ఫ్రీడమ్ సేల్ అమ్మకంలో నో కాస్ట్ EMI ఆఫర్ ను అందిస్తోంది. నెల వారి EMI పద్ధతిలో ప్రొవైడర్‌కు ఉత్పత్తి ధరను మాత్రమే చెల్లించే ఆఫర్ ను అందిస్తోంది. అన్ని ప్రధాన బ్యాంకులు యాక్సిస్, ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, సిటీ బ్యాంక్, ఎస్‌బిఐ, IndusInd, yes బ్యాంక్, కోటక్, ఆర్‌బిఎల్, హెచ్‌ఎస్‌బిసి, స్టాండర్డ్ చార్టర్డ్ మరియు బజాజ్ ఫిన్‌సర్వ్ యొక్క క్రెడిట్ కార్డులపై నో-కాస్ట్ EMI అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications