రూ.50 బడ్జెట్‌లో బెస్ట్ ప్లాన్స్ ఇవే...

|

ఒకానొక సమయంలో మొబైల్ డేటాను చాలా పొదుపుగా ఆచితూచి వాడుకోవల్సి వచ్చేది. జియో రాకతో ఒక్కసారిగా పరిస్థితులన్ని మారిపోయాయి. జియో ఉచిత డేటా ఆఫర్లు మార్కెట్‌ను ముంచెత్తటంతో పోటీని తట్టుకునేందుకు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా వంటి సంస్థలు తక్కవ ధరల్లో బెస్ట్ డేటా ప్లాన్‌లను అందించే ప్రయత్నం చేస్తున్నాయి. రూ.50 అంతకంటే తక్కువ టారిఫ్‌లలో మార్కెట్లో సిద్థంగా ఉన్న బెస్ట్ డేటా ప్లాన్స్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

 

రూ.50 బడ్జెట్‌లో బెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్..

రూ.50 బడ్జెట్‌లో బెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్..

మీరు జియో నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటోన్నట్లయితే రూ.19 ప్లాన్ మరింత హ్యాండీగా అనిపిస్తుంది. రోజు వ్యాలిడిటీతో లభించే ఈ ప్యాక్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు 0.15జీబి 4జీ డేటా అందుబాటులో ఉంటుంది. జియో ఫోన్ యూజర్లను దృష్టిలో ఉంచుకని రూ.49 బడ్జెట్‌లో జియో అందిస్తోన్న మరో ప్లాన్‌లో భాగంగా 1జీబి 4జీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు.

రూ.50 బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్..

రూ.50 బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్..

మీరు ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటోన్నట్లయితే రూ.50 బడ్జెట్‌లో అనేక ప్లాన్స్ మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ఒకటైన రూ.9 ప్లాన్‌ను మీరు సబ్‌స్ర్కైబ్ చేసుకున్నట్లయితే 100 ఎంబి ఇంటర్నెట్‌తో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ అలానే 100 ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. ప్లాన్ వ్యాలిడిటీ ఒక్కరోజు మాత్రమే. రెండు రోజుల వ్యాలిడిటీతో లభ్యమవుతోన్న రూ.23 ప్లాన్‌ను మీరు సబ్‌స్ర్కైబ్ చేసుకున్నట్లయితే 200 ఎంబి డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అలానే మెసేజెస్ అందుబాటులో ఉంటాయి. రూ.29 ప్లాన్‌ను ఆప్ట్ చేసుకోవటం ద్వారా 28 రోజుల వ్యాలిడిటితో కూడిన 150 ఎంబి డేటా మీకు లభిస్తుంది. రూ.49 ప్లాన్‌ను తీసుకున్నట్లయితే 1జీబి డేటా మీకు లభిస్తుంది.

రూ.50 బడ్జెట్‌లో బెస్ట్ వొడాఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్స్..
 

రూ.50 బడ్జెట్‌లో బెస్ట్ వొడాఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్స్..

వొడాఫోన్ ప్రీపెయిడ్ యూజర్లు రూ.21 పెట్టీ రీఛార్జ్ చేసుకోవటం ద్వారా గంట పాటు అపరిమితమైన 3జీ లేదా 4జీ డేటాను వినియోగించుకోవచ్చు. మరో ప్లాన్‌లో భాగంగా రూ.29 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే
28 రోజుల వ్యాలిడిటితో కూడిన 150 ఎంబి డేటా లభిస్తుంది. మరో ప్యాక్‌లో భాగంగా రూ.44 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 7 రోజుల వ్యాలిడిటితో కూడిన 450 ఎంబి డేటా అందుబాటులో ఉంటుంది.

రూ.50 బడ్జెట్‌లో బెస్ట్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్స్..

రూ.50 బడ్జెట్‌లో బెస్ట్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్స్..

ఐడియా ప్రీపెయిడ్ యూజర్లు రూ.21 పెట్టి రీఛార్జ్ చేసుకోవటం ద్వారా అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు 150 ఎంబి డేటా వారికి అందుబాటులో ఉంటుంది. ప్లాన్ వ్యాలిటిడీ ఒక రోజు మాత్రమే. మరొక ప్లాన్‌లో భాగంగా ఐడియా యూజర్లు రూ.47 పెట్టి రీఛార్జ్ చేసుకోవటం ద్వారా ఐడియా టు ఐడియా కాల్స్‌తో పాటు 250 ఎంబి డేటా మీకు లభిస్తుంది. ప్లాన్ వ్యాలిడిటీ 7 రోజులు.

Best Mobiles in India

English summary
Vodafone, Reliance Jio, Airtel, Idea: Enjoy these best plans under Rs 50 without burning your pocket

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X