Just In
Don't Miss
- News
దిశ చట్టం.. కొత్త చట్టాలతో ఉపయోగం ఏంటి: వివేకా హత్య కేసులోనూ 21రోజల్లోనే చేయచ్చుగా: పవన్
- Sports
చెన్నైలో తొలి వన్డే.. మ్యాచ్‌కు వర్షం ముప్పు?!!
- Finance
ఆర్థిక మందగమనం: బడ్జెట్‌పై నిర్మలా సీతారామన కసరత్తు
- Movies
గొల్లపూడి భౌతిక కాయానికి నివాలి : అది నా దురదృష్టం.. చిరు కన్నీటి వీడ్కోలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు డిసెంబర్ 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
వొడాఫోన్ VS ఎయిర్టెల్, రూ.999 ప్లాన్‌లో బెస్ట్ సెలక్ట్ చేయండి
జియో వచ్చాక దేశీయ టెలికాం రంగం పరిస్థితి మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. టాక్ టైం, ఎస్ఎంఎస్, డేటాతో పాటు సరికొత్త పాటల కోసం జియో మ్యూజిక్, టీవీ కోసం జియో టీవీ, జియో సినిమా పేరిట ఓ స్ట్రీమింగ్ సర్వీస్ కు సంబంధించిన యాక్సెస్ కూడా ఒకే రీచార్జ్ తో రావడం ప్రారంభమైంది. దీంతో టెలికాం రంగంలో పోటీ విపరీతంగా పెరిగిపోయింది. క్రమంగా టెలికాం కంపెనీలు తమ రీచార్జ్ ల్లో ఓటీటీ యాప్స్ ను కూడా చేర్చడం మొదలు పెట్టాయి. ఇప్పుడు వొడాఫోన్ దాన్ని తర్వాత స్థాయికి తీసుకువెళ్లింది. తన ప్రీమియం ప్లాన్ ద్వారా ప్రముఖ ఓటీటీ యాప్స్ అయిన అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ5 వంటి సర్వీసుల సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తోంది. దీనికి తోడుగా ఎయిర్టెల్ కూడా కొత్తగా దూసుకువస్తోంది. వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ప్లాన్లను అందిస్తోంది. ఇప్పుడు రూ.999లో లభిస్తున్న రెండు బెస్ట్ ప్లాన్లను ఓ సారి చూద్దాం.

వొడాఫోన్ రెడ్ఎక్స్
టెలికాం సంస్థ వొడాఫోన్ తన పోస్ట్పెయిండ్ కస్టమర్ల కోసం వొడాఫోన్ రెడ్ఎక్స్ పేరిట ఓ నూతన లిమిటెడ్ ఎడిషన్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. రూ.999 రెంటల్‌తో ఈ ప్లాన్ కస్టమర్లకు లభిస్తుండగా, ప్రస్తుతం ఉన్న వొడాఫోన్ రెడ్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు కూడా ఈ ప్లాన్‌కు అర్హులేనని ఆ కంపెనీ తెలిపింది. ఇక ఇందులో వినియోగదారులకు అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, నెలకు 150జీబీ డేటా లభిస్తాయి. ఈ ప్లాన్ పొందిన కస్టమర్లు 50 శాతం ఎక్కువ స్పీడ్‌తో నెట్‌ను యాక్సెస్ చేసుకునేందుకు వీలుంటుంది.

ఎంపిక చేసిన కస్టమర్లకే
వొడాఫోన్ రెడ్ఎక్స్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను కేవలం ఎంపిక చేసిన కస్టమర్లకే అందివ్వనున్నారు. అయితే వొడాఫోన్ రెడ్ కస్టమర్లతోపాటు ఇతరులు కూడా ఈ ప్లాన్‌ను ప్రీఆర్డర్ చేయవచ్చు. కానీ ఎంపిక చేసిన వారికే దీన్ని అందిస్తారు. ఈ నెల 25వ తేదీ తరువాత ఈ ప్లాన్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతారు. ఇక ఈ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, వొడాఫోన్ ప్లే తదితర యాప్‌లకు బండిల్డ్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్లను పొందవచ్చు. దీంతోపాటు రూ.2999 విలువైన రోమింగ్ ప్యాక్‌ను ఈ ప్లాన్‌లో ఉచితంగా అందిస్తున్నారు. అలాగే రూ.20వేల విలువైన ప్రయోజనాలను ఈ ప్లాన్‌తో కస్టమర్లు పొందవచ్చు.

ఎయిర్టెల్ రూ .998 ప్రీపెయిడ్ ప్లాన్:
ఎయిర్టెల్ మైప్లాన్ పోస్ట్‌పెయిడ్ చందా ధర రూ .999 (ప్లస్ జిఎస్టి), మరియు కాలింగ్ పరంగా, భారతదేశంలో ఎక్కడి నుండైనా, ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత లోకల్, ఎస్టిడి మరియు నేషనల్ రోమింగ్ కాల్‌లను అందిస్తుంది. ఇక్కడ అంతర్జాతీయ కాలింగ్ హక్కులు లేనప్పటికీ, ఈ ప్లాన్‌తో కూడిన ఉచిత యాడ్-ఆన్ కనెక్షన్ మీకు లభిస్తుంది, ఇది భారతదేశం అంతటా అపరిమిత ఉచిత కాలింగ్‌ను కూడా పొందుతుంది.

SMS సందేశ సేవలు
ప్రతి రోజు 100 ఉచిత SMS సందేశాలను అందిస్తాయి, దీనికి మించి ప్రామాణిక రేట్లు (జాతీయానికి Re 1, అంతర్జాతీయంగా దేశ-నిర్దిష్ట) వర్తిస్తాయి. డేటా కోసం, రూ .999 ప్లాన్ 150 జీబీ హై స్పీడ్ డేటాను అందిస్తుంది, డేటా రోల్ఓవర్ గరిష్టంగా 500 జీబీ. 500GB డేటా పరిమితికి మించి, వేగం 80kbps కు తీవ్రంగా ఉంటుంది.

కంటెంట్ మరియు ప్రత్యేక ప్రయోజనాలు
మూడు నెలల నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్ (ఖాతాకు 1,500 రూపాయలు, వ్యవధిని తగ్గించే ప్రణాళికను అప్‌గ్రేడ్ చేయడం), ఒక సంవత్సరం అమెజాన్ ప్రైమ్ మరియు జీ 5 యొక్క ప్రీమియం షోలు మరియు చలన చిత్రాల యాకసస్ పొందవచ్చు.. ఎయిర్టెల్ యూజర్లు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌తో పాటు హ్యాండ్సెట్ ప్రొటెక్షన్ ప్లాన్‌కు కూడా అర్హత పొందుతారు.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790