రూ.100లోపు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే!

|

ఒకానొక సమయంలో మొబైల్ డేటాను చాలా పొదుపుగా ఆచితూచి వాడుకోవల్సి వచ్చేది. జియో రాకతో ఒక్కసారిగా పరిస్థితులన్ని మారిపోయాయి. జియో ఉచిత డేటా ఆఫర్లు మార్కెట్‌ను ముంచెత్తటంతో పోటీని తట్టుకునేందుకు ఎయిర్‌టెల్, ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థలు రూ.100లోపే ఆసక్తికర డేటా ప్లాన్లను అందించే ప్రయత్నం చేస్తున్నాయి. రూ.100 బడ్జెట్‌లో మార్కెట్లో సిద్థంగా ఉన్న బెస్ట్ డేటా ప్లాన్స్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

 

రిలయన్స్ జియో రూ.98 ప్లాన్..

రిలయన్స్ జియో రూ.98 ప్లాన్..

ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు. ప్లాన్‌లో భాగంగా మొత్తం 2.1జీబి 4జీ డేటా అందుబాటులో ఉంటుంది. రోజుకు 0.15జీబి డేటా చొప్పున వాడుకోవల్సి ఉంటుంది. డేటా లిమిట్ దాటిన తరువాత డేటా వేగం కాస్తా 64 కేబీపీఎస్‌కు పడిపోతుంది. రూ.98 ప్లాన్‌లో భాగంగా 2.1జీబి డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అలానే మెసేజెస్ అందుబాటులో ఉంటాయి. జియో యాప్ సూట్‌ను కూడా ఉచితంగా యాక్సిస్ చేసుకునే వీలుంటుంది.

 భారతీ ఎయిర్‌టెల్ రూ.98 ప్లాన్

భారతీ ఎయిర్‌టెల్ రూ.98 ప్లాన్

భారతీ ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తున్న అత్యుత్తమ డేటా ప్లాన్‌లలో రూ.98 డేటా ప్లాన్ ఒకటి. ఈ ప్లాన్‌లో భాగంగా 28 రోజుల పాటు రోజుకు 1జీబి 2G/3G/4G డేటాను ఆస్వాదించే వీలుంటుంది. మొబైల్ డేటా పై ఎక్కువుగా ఆధారపడే యూాజర్లకు ఈ ప్లాన్ బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తంది.

రూపాయికే అన్‌లిమిటెడ్ డేటా, అదిరే ఆఫర్ దిశగా Bsnl..రూపాయికే అన్‌లిమిటెడ్ డేటా, అదిరే ఆఫర్ దిశగా Bsnl..

ఐడియా సెల్యులార్ రూ.93 ప్లాన్
 

ఐడియా సెల్యులార్ రూ.93 ప్లాన్

ఐడియా సెల్యులార్ అందిస్తోన్న అత్యంత చవకైన ప్లాన్‌లలో రూ.93 ప్లాన్ ఒకటి. 10 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్ ఇంకా నేషనల్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. డేటా విషయానికి వచ్చేసరికి ప్లాన్ మొత్తం మీద 1జీబి 4జీ డేటా అందుబాటలో ఉంటుంది.

బీఎస్ఎన్ఎల్ రూ.98 ప్లాన్...

బీఎస్ఎన్ఎల్ రూ.98 ప్లాన్...

ఐడియా ఆఫర్ చేస్తోన్న అత్యంత చవకైన ప్రీపెయిడ్ ప్లాన్‌లలో రూ.98 ప్లాన్ ఒకటి. 10 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు ఇతర బెనిఫిట్స్ పొందుపరచబడి ఉన్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Here are the best prepaid plans priced under Rs. 100 from Airtel, Reliance Jio, Vodafone, Idea Cellular and BSNL. These plans offer unlimited calls and a specific amount of data for a limited period of time. You can opt for the best plan according to your usage by checking out the benefits offered by these plans.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X