Jio vs Airtel vs Vodafone,రూ.100 ప్లాన్లలో ఏది బెస్ట్..?
టెలికాం రంగంలో రోజురోజుకు వార్ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దిగ్గజాలు తమ కస్టమర్లను కాపాడుకునేందుకే ప్రాధాన్యాత ఇస్తున్నాయి.
టెలికాం రంగంలో రోజురోజుకు వార్ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దిగ్గజాలు తమ కస్టమర్లను కాపాడుకునేందుకే ప్రాధాన్యాత ఇస్తున్నాయి. అందులో భాగంగా తక్కవు ధరలకే డేటా ప్లాన్లను అందిస్తూ వస్తున్నాయి. ఓ కంపెనీ ఆఫర్ రిలీజ్ చేయగానే మరో కంపెనీ దాని కన్నా తక్కువ ధరలో మెరుగైన ఆఫర్ ను అందించేందుకు రెడీ అవుతూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. జియో రాకతో టెలికం రంగం ఒక్కసారిగా కుదుపులకు లోనై ఇప్పుడిప్పుడే కొంచెం తేరుకుంటోంది. జియో ఆఫర్ల సునామి దెబ్బకు దిగ్గజాలన్నీ కోట్ల నష్టాలను చవిచూశాయి. ఇప్పుడు జియో కూడా ఫ్రీ నుంచి డబ్బుల్లోకి తమ ఆఫర్లను మార్చడంతో టెలికం రంగం కొంచెం ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మార్కెట్లో రూ. 100 లో లభిస్తున్న బెస్ట్ ప్లాన్లపై ఓ లుక్కేద్దాం.

ఎయిర్‌టెల్
రూ.98 ప్లాన్
రూ.98 ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో 3జీబీ డాటాను అందిస్తోంది . అంతేకాకుండా అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, ఉచిత రోమింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అదనం. కాలపరిమితి 28 రోజులు.
రూ.95 ప్లాన్
రూ.95 ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో 500ఎంబీ డాటాను అందిస్తోంది .ఇందులో 95 టాక్ టైం లభిస్తుంది. లోకల్, ఎస్టీడీ కాల్స్ కు 1నిమిషానికి 30 పైసలు ఛార్జ్ పడుతుంది . కాలపరిమితి 28 రోజులు.

రిలయన్స్ జియో
రూ.98 ప్లాన్
రూ.98 ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో రోజుకి 2జీబీ డాటాను అందిస్తోంది . అంతేకాకుండా అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, ఉచిత రోమింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అదనం. కాలపరిమితి 28 రోజులు.

వోడాఫోన్
రూ.95 ప్లాన్
రూ.95 ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో 500ఎంబీ డాటాను అందిస్తోంది .ఇందులో 95 టాక్ టైం లభిస్తుంది అయితే ఈ ప్లాన్ లో అపరిమిత కాల్స్ మరియు ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉండవు. కాలపరిమితి 28 రోజులు.


Click it and Unblock the Notifications








