రూ.300లో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే, ఓ సారి చెక్ చేసుకోండి
ఇండియాలో టెలికాం రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. జియో రాకతో టెలికాం మార్కెట్లో ప్రకంపనలు మొదలైన సంగతి తెలిసిందే. మొత్తం టెలికాం రంగాన్నే జియో కుదిపేసింది.
ఇండియాలో టెలికాం రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. జియో రాకతో టెలికాం మార్కెట్లో ప్రకంపనలు మొదలైన సంగతి తెలిసిందే. మొత్తం టెలికాం రంగాన్నే జియో కుదిపేసింది. ఒక్కసారిగా డేటా ధరలు ఆకాశం నుంచి నేలవైపు చూశాయి. ఇదిలా ఉంటే జియో తన ప్రస్థానాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు ఉచితం అంటూ యూజర్లను తన వైపుకు తిప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జియోతో పాటుగా మిగతా టెల్కోలు కూడా తన దారిని మార్చుకోక తప్పని పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో అత్యంత తక్కువ ధరకే ప్లాన్లను అందించేందుకు అన్ని కంపెనీలు పోటీపడుతున్నాయి. ఈ శీర్షికలో భాగంగా రూ.300 లోపులో టెల్కోలు అందిస్తున్న ప్లాన్ల వివరాలను అందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఎయిర్‌టెల్
రూ.199 ప్లాన్ : రోజుకు 1.4 జిబి డేటా , 28 రోజుల వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు
రూ.249 ప్లాన్ : రోజుకు 2.4 జిబి డేటా , 28 రోజుల వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు

వొడాఫోన్
రూ.255 ప్లాన్ : రోజుకు 2 జిబి డేటా , 28 రోజుల వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు
రూ.209 ప్లాన్ : రోజుకు 1.5 జిబి డేటా , 28 రోజుల వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు
రూ.199 ప్లాన్ : రోజుకు 1.4 జిబి డేటా , 28 రోజుల వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు

రిలయన్స్ జియో
రూ.149 ప్లాన్ : రోజుకు 1.5 జిబి డేటా , 28 రోజుల వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు
రూ.198 ప్లాన్ : రోజుకు 2 జిబి డేటా , 28 రోజుల వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు
రూ.299 ప్లాన్ : రోజుకు 3 జిబి డేటా , 28 రోజుల వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు


Click it and Unblock the Notifications








