రూ.15 వేలలో అదరహో అనిపించే బెస్ట్ రియల్‌మి స్మార్ట్‌ఫోన్స్

By Gizbot Bureau
|

ఇండియా మార్కెట్లోకి ఈ మధ్య అనేక రకాలైన కంపెనీ ఫోన్లు వస్తున్నాయి. ముఖ్యంగా చైనా కంపెనీల స్మార్ట్‌ఫోన్లు వెల్లువలా పచ్చిపడుతున్నాయి. షియోమి, రియల్ మి, ఒప్పో, వన్ ప్లస్, రెడ్ మి ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియన్ మొబైల్ మార్కెట్లో సింహభాగం దానిదే అని చెప్పవచ్చు. వీటిల్లో మధ్య రియల్‌మి నుంచి వచ్చిన మొబైల్స్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. బడ్జెట్ ధరలో ఇవి వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.ఈ శీర్షికలో భాగంగా బడ్జెట్ ధరలో అంటే రూ. 15 వేలలో అదిరే ఫీచర్లతో వచ్చిన రియల్ మి స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాం. మీకు ఏది నచ్చుతుందో ఓ సారి చెక్ చేసుకోండి.

Realme 5 Pro మార్కెట్ ధర
 

Realme 5 Pro మార్కెట్ ధర

మార్కెట్లో దీని ధర రూ. 15 వేలుగా ఉంది. రియల్‌మి నుంచి వచ్చిన ఫస్ట్ లైనప్ ఫోన్ ఇదేనని చెప్పవచ్చు. ఈ ఫోన్ బేస్ మోడల్ ధర రూ. 13,999 నుంచి ప్రారంభం అవుతుంది. కెమెరా ప్రధాన ఆకర్షణగా ఈ ఫోన్ విడుదలయిందని చెప్పవచ్చు.

రియల్‌మి 5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో.. 6.3 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 8, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4035 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

రియల్‌మి 5 స్మార్ట్‌ఫోన్‌

రియల్‌మి 5 స్మార్ట్‌ఫోన్‌

3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.9,999 ఉండగా, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.10,999 గా ఉంది. అలాగే 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధరను రూ.11,999గా ఉంది.

రియల్‌మి 5 స్మార్ట్‌ఫోన్‌లో.. 6.5 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్లస్ పొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 8, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. కాగా ఈ ఫోన్‌పై జియో తన కస్టమర్లకు రూ.7వేల విలువైన ప్రయోజనాలను అందివ్వనుంది. అలాగే రూ.750 విలువైన, రూ.20వేల ప్రయోజనాలతో కూడిన పేటీఎం మెంబర్‌షిప్ ఉచితంగా వస్తుంది.

Realme 3 ఫీచ‌ర్లు
 

Realme 3 ఫీచ‌ర్లు

రియ‌ల్ మి 3 డైన‌మిక్ బ్లాక్‌, రేడియెంట్ బ్లూ, క్లాసిక్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్లలో విడులైంది. ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.8,999, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.10,999 గా ఉంది.

రియ‌ల్ మి 3 ఫీచ‌ర్లు

6.2 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

రియల్‌మి 3ఐ స్మార్ట్‌ఫోన్‌

రియల్‌మి 3ఐ స్మార్ట్‌ఫోన్‌

3జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.7,999 ఉండగా, 4జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.9,999 గా ఉంది.

రియల్‌మి 3ఐ స్మార్ట్‌ఫోన్‌లో 6.22 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి60 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

Realme U1

Realme U1

ధర రూ. 10,00, బేస్ మోడల్ ధర రూ. 8,999

రియల్‌మి యు1 ఫీచర్లు

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2350 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

Realme C2

Realme C2

ఇది ఎంట్రీ లెవల్ ఫోన్. దీని ధర 5,999నుంచి ప్రారంభం అవుతుంది.

రియ‌ల్‌మి సి2 ఫీచ‌ర్లు...

6.22 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెస‌ర్‌, 2/4 జీబీ ర్యామ్‌, 16/32 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Most Read Articles
Best Mobiles in India

English summary
Best Realme phones to buy under Rs 15,000 in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X