Amazon Great Freedom Festival Sale: స్మార్ట్‌టీవీల కొనుగోలుపై అదిరే డిస్కౌంట్ ఆఫర్స్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ రెండు కూడా తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్తగా అద్భుతమైన ఆఫర్లతో సేల్ లను ప్రారంబిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఆగస్టు 5 మరియు ఆగస్టు 9 మధ్య బిగ్ సేవింగ్స్ డే సేల్‌ను నిర్వహిస్తున్నది. అయితే దీనికి పోటీగా అమెజాన్ ఇండియా తన ప్లాట్‌ఫామ్‌లో "గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2021" సేల్‌ను నిర్వహిస్తోంది.

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్
జూలై 26 మరియు జూలై 27 మధ్య అమెజాన్ ప్రైమ్ యూసర్లకు మాత్రమే ఆఫర్లు అందించిన విధంగా కాకుండా ప్రస్తుత అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2021 అమ్మకంలో ప్రతి ఒక్కరు కొనుగోలు చేయడానికి వీలుగా వివిధ స్మార్ట్‌టీవీలు, ల్యాప్‌టాప్‌లు మరియు గృహోపకరణాల కొనుగోలుపై అధిక మొత్తంలో డిస్కౌంట్లను అందిస్తుంది. అదనంగా ఇ-రిటైల్ దిగ్గజం SBI క్రెడిట్ కార్డులు మరియు క్రెడిట్ కార్డ్ ఆధారిత EMI లావాదేవీలను ఉపయోగించి చేసిన కొనుగోళ్లపై 10% తక్షణ తగ్గింపును అందిస్తుంది. అంతేకాకుండా అదనంగా Amazon Pay కోసం సైన్ అప్ చేసిన కస్టమర్‌లు రూ.1,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందుతారు.

ఆగస్టులో రాబోయే స్వాతంత్ర దినోత్సవంను పురస్కరించుకొని అమెజాన్ లో ఇప్పుడు 'అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్' పేరుతో సేల్స్ ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఆగస్టు 9 అర్ధరాత్రి వరకు ఐదు రోజులపాటు జరిగే ఈ అమ్మకం సమయంలో స్మార్ట్‌టీవీలను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం డబ్బులు ఒకే సారి చెల్లించకుండా నెలవారీగా చెల్లించే వారికి అందుబాటులో ఉండేలా నో-కాస్ట్ EMI కూడా లభిస్తుంది.

అమెజాన్ స్మార్ట్ టీవీ ఆఫర్‌లు
స్మార్ట్ టీవీలలో ఆఫర్‌ల విషయానికి వస్తే అమెజాన్ ఇండియా 40-అంగుళాల మరియు 43-అంగుళాల స్మార్ట్ టీవీల కొనుగోలుపై 50% వరకు తగ్గింపును అందిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే పెద్ద స్క్రీన్ 4K టీవీల కొనుగోలుపై 60% వరకు తగ్గింపును కూడా అందిస్తుంది. అదనంగా రూ.12,999 ప్రారంభ ధరతో 32-అంగుళాల స్మార్ట్ టీవీలను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. మీరు పరిగణించవలసిన టాప్ ఆఫర్‌లు ఇక్కడ ఉన్నాయి.
- 55-అంగుళాల iFFALCON 4K UHD స్మార్ట్ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ LED TV 2021 వేరియంట్ ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో రూ.19,999 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా దీని యొక్క ధర రూ.36,999.
- మరోవైపు శామ్సంగ్ వండర్‌టైన్‌మెంట్ సిరీస్ HD Ready LED Smart TV అమెజాన్ లో ఇప్పుడు రూ.20,900 కి బదులుగా రూ.18,490 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.
- అలెక్సా అనుకూలతతో లభించే 55-అంగుళాల సోనీ బ్రావియా 4K అల్ట్రా HD స్మార్ట్ LED గూగుల్ టీవీ ప్రస్తుత అమ్మకంలో రూ.26,000 తగ్గింపు పొందిన తర్వాత రూ.83,990 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది.
- 43 అంగుళాల LG 4K అల్ట్రా HD స్మార్ట్ LED TV 43UP7500PTZ (రాకీ బ్లాక్) (2021 మోడల్) అమెజాన్ లో ఇప్పుడు రూ.21,990 తగ్గింపు ధరను అందుకున్న తరువాత కేవలం రూ.37,999 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
- అలెక్సా వాయిస్ రిమోట్ తో కలిగిన 42 అంగుళాల ఒనిడా ఫుల్ HD స్మార్ట్ IPS LED ఫైర్ టీవీ 42FIF (బ్లాక్) (2021 మోడల్) అమెజాన్ లో ఇప్పుడు రూ.8000 తగ్గింపు అందుకున్న తరువాత రూ.26,999 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








