108MP ఫీచర్లతో రూ.18 వేల నుండి లభించే స్మార్ట్‌ఫోన్‌ల మీద ఓ లుక్ వేయండి.....
ఇండియాలో ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం అధికంగా ఉంది. ప్రతి 100 మందిలో సుమారు 80 మందికి పైగా స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్నారు వీరిలో కొంత మంది రెండు లేదా మూడు ఫోన్లను కూడా ఉపయోగించే వారు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం అధిక రెసొల్యూషన్ కెమెరా ఫీచర్లను కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయడానికి కొంత మంది ఇష్టపడుతున్నారు. 108MP కెమెరా ఫీచర్స్ గల స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు బడ్జెట్ మరియు మిడ్-రేంజ్ ధరలో కూడా లభిస్తున్నాయి. ఈ ఫీచర్లతో బడ్జెట్ ధరలో లభించే స్మార్ట్‌ఫోన్‌లను గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్
108MP కెమెరా ఫీచర్స్ తో రూ.18,999 ప్రారంభ ధర వద్ద నుండి లభించే స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో మొదటివరుసలో గల ఫోన్ ఇటీవల విడుదలైన రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్. షియోమి సంస్థకు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ 108MP శామ్‌సంగ్ HM2 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. అలాగే 5MP సూపర్ మాక్రో సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్‌లతో క్వాడ్- రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇతర స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 6.67-అంగుళాల FHD + సూపర్ AMOLED డిస్ప్లే, 5020mAh బ్యాటరీ మరియు 16MP ఫ్రంట్ కెమెరా ఫీచర్లను కలిగి ఉన్నాయి.

షియోమి Mi10i
108MP కెమెరా ఫీచర్స్ జాబితాలో గల రెండవ ఫోన్ షియోమి Mi10i రూ.20,999 ప్రారంభ ధర నుండి లభిస్తుంది. ఇది క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 108MP శామ్‌సంగ్ HM2 సెన్సార్ ప్రాథమిక కెమెరాతో పాటుగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2MP మాక్రో కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. ఇతర స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 4820 mAh బ్యాటరీని కలిగి ఉండి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750G SoC చేత రన్ అవుతుంది.

షియోమి Mi10 & 10T ప్రో
రూ.39,999 అధిక ధర వద్ద నుండి లభించే షియోమి Mi10T ప్రో ఫోన్ కూడా 108MP కెమెరా ఫీచర్స్ జాబితాలో ఉంది. అయితే ఇది అధిక ధరను కలిగి ఉన్నప్పటికీ మెరుగైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ షియోమి స్మార్ట్‌ఫోన్ 108MP HMX సెన్సార్ OIS మద్దతుతో వస్తుంది. ఇది కాకుండా ఇందులో 13MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా మరియు 5MP మాక్రో లెన్స్ కెమెరాలు ఉన్నాయి. ఇంకా ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865 SoC, 6.67-అంగుళాల 144Hz డిస్ప్లే మరియు 5000mAh బ్యాటరీ వంటి ఇతర మెరుగైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. అలాగే షియోమి Mi10 కూడా ఇదే ఫీచర్లతో రూ.44,999 ధర వద్ద లభిస్తుంది.

Motorola Edge Plus
రూ.74,999 అధిక ధరను కలిగిఉన్న మోటరోలా ఎడ్జ్ ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో 108MP ప్రాధమిక సెన్సార్ ఎఫ్ / 1.8 లెన్స్ మరియు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) ఉన్నాయి. ఇది 16MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 8MP టెలిఫోటో షూటర్ మరియు ToF సెన్సార్‌తో జత చేయబడి ఉన్నాయి. ఇతర స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే ఇది 5,000mAh బ్యాటరీ, 6.7-అంగుళాల ఫుల్-HD + డిస్ప్లే మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉన్నాయి.

Samsung Galaxy S20 Ultra
రూ.97,999 భారీ ధరను కలిగి ఉండి ఐఫోన్ లకు సైతం సవాల్ విసురుతున్న శామ్‌సంగ్ ఫోన్ లలో గెలాక్సీ S20 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ కూడా 108MP మెయిన్ వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. అలాగే ఇది 48MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్, 12MP అల్ట్రావైడ్ సెన్సార్ మరియు టోఫ్ సెన్సార్‌లతో జత చేయబడి ఉన్నాయి. ఇతర స్పెసిఫికేషన్స్ విషయంలో ఎక్సినోస్ 990 SoC, 40MP సెల్ఫీ కెమెరా మరియు 5000mAh బ్యాటరీ వంటివి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








