జూలై నెలలో RS.15,000 లోపు ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

|

స్మార్ట్ ఫోన్ విభాగంలో 15 వేల రూపాయల దిగువన మీరు ఎంచుకోవడానికి చాలా రకాల స్మార్ట్ ఫోన్ ఎంపికలు ఉన్నాయి. ఆసక్తికరంగా ఈ రోజుల్లో అందరు 48 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా , 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, పెద్ద స్క్రీన్, ట్రిపుల్ కెమెరాలు మరియు మరిన్ని ఫీచర్లు గల బడ్జెట్ ఫోన్‌ను తమ బడ్జెట్ లో పొందవచ్చు.

 

జూలై నెలలో RS.15,000 లోపు ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

అంతేకాకుండా బయోమెట్రిక్ యాక్సిస్ కోసం అధునాతన డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను మరియు పంచ్-హోల్ కెమెరా డిస్ప్లే డిజైన్ ను కూడా పొందవచ్చు. ఈ లక్షణాలతో పాటు ఫోన్ మేకర్స్ అందమైన గ్రేడియంట్ డిజైన్‌తో ఫోన్లను కూడా అందిస్తున్నారు. కాబట్టి మీరు రూ .15,000 లోపు బడ్జెట్ ఫోన్ కోసం మార్కెట్లో ఉంటే ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌ల జాబితా ఇక్కడ ఉంది.

15 వేల లోపు ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లు:

15 వేల లోపు ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లు:

వివో Z1 ప్రో:

వివో Z1 ప్రో ప్రస్తుతం మార్కెట్లో పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్‌ గల చౌకైన స్మార్ట్‌ఫోన్‌లో ఇది ఒకటి. ఇది మంచి సరసమైన గేమింగ్ స్మార్ట్‌ఫోన్లలో ఒకటి. వివోZ1 ప్రో భారతదేశంలో రూ.14,990 నుండి ప్రారంభమవుతుంది. వివో Z1 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.53-అంగుళాల డిస్ప్లే, 4GB RAM +64GB స్టోరేజ్ మరియు 6GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ లలో వస్తుంది. ఇది 48-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు 32-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ పై ఫన్‌టచ్OS9 ఆధారంగా రన్ అవుతుంది. అంతేకాకుండా ఇది 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది.

 

రియల్‌మి 3i:

రియల్‌మి 3i:

ఇటీవల విడుదల చేసిన రియల్‌మి3i పది వేల రూపాయల పరిధిలోని ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. రియల్‌మి3i యొక్క 3GB ర్యామ్ మోడల్ ధర 7,999 రూపాయలు, 4GB ర్యామ్ మోడల్ ధర 9,999 రూపాయల వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డైమండ్ బ్యాక్ ఫినిష్, డ్యూయల్ రియర్ కెమెరాలు, మీడియాటెక్ హెలియోP60 SOC , ఆండ్రాయిడ్ పై OS వంటి ఫీచర్స్ తో వస్తుంది. ఈ మొబైల్ ను జూలై 23 నుండి ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి.కామ్ నుండి కొనుగోలు చేయవచ్చు.

టెక్నో ఫాంటమ్ 9:
 

టెక్నో ఫాంటమ్ 9:

టెక్నో ఫాంటమ్ 9 ఇటీవలే ఇండియాలో ప్రారంభించబడింది ఇది రూ.14,999 ధర వద్ద విక్రయించబడుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6GB RAM+ 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. ఫోన్ యొక్క లాప్‌లాండ్ అరోరా కలర్ ఆప్షన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. టెక్నో ఫాంటమ్ 9 స్మార్ట్‌ఫోన్‌ 6.4-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే 19: 5: 9 కారక నిష్పత్తితో వస్తుంది మరియు ఇందులో 91.47 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో ఉన్నది .ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్యానెల్ ఫుల్ HD + (1080 x 2340 పిక్సెల్స్) రిజల్యూషన్ వద్ద పనిచేస్తుంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో P35 SoC శక్తి చేత పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 3,500 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క వెనుక భాగంలో మూడు కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ సెటప్‌లో 16 మెగాపిక్సెల్ సెన్సార్ మరియు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. మరియు డీప్ సెన్సింగ్ కోసం 2 మెగాపిక్సెల్ సెన్సార్‌ కూడా జత చేయబడి ఉంటుంది.

షియోమి రెడ్‌మి నోట్ 7 ప్రో, రెడ్‌మి నోట్ 7S :

షియోమి రెడ్‌మి నోట్ 7 ప్రో, రెడ్‌మి నోట్ 7S :

షియోమి యొక్క టాప్-ఎండ్ డివైస్ రెడ్‌మి నోట్ 7 ప్రో మొబైల్ 15,000రూపాయలలోపు ఉన్న ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. షియోమి ఈ ఏడాది భారత మార్కెట్లో విడుదల చేసిన తాజా రెడ్‌మి 7 లైనప్ లో ఇది ఒకటి. ఈ స్మార్ట్‌ఫోన్‌ అప్‌డేటెడ్ డిజైన్‌తో 6.3-అంగుళాల IPS LDC డిస్‌ప్లే మరియు "డాట్ నాచ్" తో వస్తుంది. ఇది 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది. ఇది 6 జిబి ర్యామ్+128GB స్టోరేజ్ తో పాటు స్నాప్డ్రాగన్ 675 SoC చేత జత చేయబడి ఉంటుంది. కెమెరా విషయంలో ఇందులో వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ సెన్సార్‌తో ప్రైమరీ కెమెరా మరియు డెప్త్ మ్యాపింగ్ కోసం 5 మెగాపిక్సెల్ సెన్సార్‌తో సెకండరీ కెమెరా ఉన్నాయి. దీని యొక్క ధర 13,999 రూపాయల నుండి ప్రారంబమవుతుంది.

షియోమి కంపెనీ 9,999రూపాయల ధరతో షియోమి రెడ్‌మి నోట్ 7Sను విడుదల చేసింది. ఇది వెనుక వైపు 48 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది మరియు స్నాప్‌డ్రాగన్ 660 SoC చేత రన్ అవుతుంది. రెడ్‌మి నోట్ 7S స్మార్ట్‌ఫోన్ 3GB / 4GB RAM, 32GB / 64GB స్టోరేజ్ ఆప్షన్లతో వస్తుంది. మిగిలిన అన్ని ఫీచర్స్ మరియు డిజైన్ రెడ్‌మి నోట్ 7 ప్రో మాదిరి ఉంటుంది.

 

 రియల్‌మి 3 ప్రో:

రియల్‌మి 3 ప్రో:

రియల్‌మి సంస్థ తన సరికొత్త టాప్-ఆఫ్-లైన్ రియల్‌మి3 ప్రోను విడుదల చేసింది. ఇది స్నాప్‌డ్రాగన్ 710 SoC చేత రన్ అవుతుంది. ఇది 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 6GB RAM వరకు గల వేరియంట్లు ఉన్నాయి. 48-మెగాపిక్సెల్ గల డ్యూయల్ రియర్ కెమెరాలు మరియు 25 మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్ గల కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ పై ఆధారిత కలర్ OS 6 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. 4 జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్ బేస్ మోడల్ ధర రూ.13,499 కాగా 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ ఉన్న టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.15,999. ఇతర ఫోన్‌ల మాదిరిగానే ఇది కూడా రూ.15,000 లోపు ఉన్న ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి

శామ్‌సంగ్ గెలాక్సీ M30:

శామ్‌సంగ్ గెలాక్సీ M30:

4 GBర్యామ్, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న సామ్‌సంగ్ గెలాక్సీM30 యొక్క బేస్ మోడల్ ధర 13,990 రూపాయలు. దీని యొక్క స్పెసిఫికేషన్ పరిశీలిస్తే ఈ డివైస్ 6.4-అంగుళాల సూపర్ అమోలేడ్ డిస్‌ప్లేను Exynos 7904 SoC ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ సెన్సార్ గల ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెన్సార్ అల్ట్రా-వైడ్ లెన్స్‌తో ద్వితీయ కెమెరా మరియు డెప్త్ మ్యాపింగ్ కోసం 5 మెగాపిక్సెల్ సెన్సార్‌తో మూడవ కెమెరా ఉన్నాయి.. ఇది 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది.

హానర్ 10 లైట్:

హానర్ 10 లైట్:

చైనీస్ ఎలక్ట్రానిక్స్ మరియు టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం హువాయి ఉప బ్రాండ్ అయిన హానర్ నుండి వచ్చిన మొదటి ఫోన్ హానర్10 లైట్. ఇది 3 GB ర్యామ్+32 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో కూడిన డివైస్ బేస్ మోడల్‌ను ధర 9,999రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. 10 లైట్ 6.21-అంగుళాల డిస్ప్లేతో హిసిలికాన్ కిరిన్ 710 SoC తో వస్తుంది. 6GB RAM మరియు 64GB స్టోరేజ్ మెమొరీ వరకు గల వివిధ వేరియంట్ లలో వస్తుంది. ఇది 3,400mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ మొబైల్ కు వెనుకవైపు 13 మెగాపిక్సెల్ సెన్సార్‌ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ గల డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది మరియు సెల్ఫీల కోసం ముందు భాగంలో 24 మెగాపిక్సెల్ మరియు 2 మెగాపిక్సెల్ సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
best smartphones under rs 15K

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X