Flipkart Big Billion Days Sale 2023.. ధర రూ.15 వేలలోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు..!
పండుగల సీజన్ కావడంతో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, సేల్ తేదీలను ప్రకటించాయి. అమెజాన్ ప్రైమ్, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఇవాళ్టి నుంచే సేల్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో (Flipkart Big Billion Days Sale 2023) భాగంగా స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.
రేపటి నుంచి అక్టోబర్ 15 వరకు ఫ్లిప్‌కార్ట్ సేల్ అందరికి అందుబాటులోకి ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్ల ప్రకటించింది. దీంతోపాటు బ్యాంక్ ఆఫర్లు, ఎక్చ్సేంజిపైనా డిస్కౌంట్లను ప్రకటించింది. 10 వేల రూపాయల నుంచి 15 వేల రూపాయల మధ్య స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఈ కథనం మీకోసం.

Realme 11X 5G : రియల్‌మీ సంస్థ ఈ ఫోన్‌ను ఆగస్టులో విడుదల చేసింది. విడుదల సమయంలో 6GB ర్యామ్+ 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్ ధర కనీసం 2 వేలు తగ్గే అవకాశం ఉంది. ఫలితంగా రూ.12,999కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బ్యాంక్ ఆఫర్లతో మరో 1000 రూపాయలు తగ్గే అవకాశం ఉంది.
రియల్‌మీ 11X 5G స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లే్ను కలిగి ఉంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ SoCతో రానుంది. మిడ్‌నైట్ బ్లాక్, పర్పల్ డాన్ రంగుల్లో లభిస్తుంది.

Infinix Note 30 5G : భారత్‌లో ఈ ఫోన్ జూన్‌లో లాంచ్ కానుంది. 108MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 6080 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల పుల్ HD+ IPS డిస్‌ప్లేతో రానుంది.
బ్లూ, మ్యాజిక్ బ్లాక్, సన్‌సెట్ గోల్డ్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. విడుదల సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.14999గా ఉండేది. ఈ సేల్‌లో భాగంగా రూ.13499కే లభించనుంది. మరియు బ్యాంక్ ఆఫర్లతో ధర మరింత తగ్గే అవకాశం ఉంది.
Redme Note 12 5G : ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో ఈ సంవత్సరం జనవరిలో విడుదల చేసింది. లాంచ్ సమయంలో 4GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,999గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా రూ.15999కే అందుబాటులోకి రానుంది. బ్యాంకు ఆఫర్లతో అదనంగా మరో రూ.1000 తగ్గింపును పొందవచ్చు.
రెడ్‌మీ నోట్ 12 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల పుల్ HD అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 SoC ప్రాసెసర్‌తో రానుంది. వెనుకవైపు 48MP+8MP+ 2MP కెమెరాలను కలిగి ఉంటుంది.

Samsung Galaxy F34 5G : ఈ స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం ఆగస్టులో విడుదల అయింది. 6.46 అంగుళాల పుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 6000mAh బ్యాటరీతో వస్తుంది. ఆక్టాకోర్ Exynos 1280 SoC ప్రాసెసర్‌తో వస్తుంది. ఎలక్ట్రిక్ బ్లాక్, మిస్టిక్ గ్రీన్, ఆర్చడ్ వైలెట్ రంగుల ఎంపికలలో లభిస్తుంది.
విడుదల సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.18999గా ఉంది. అయితే ఈ సేల్‌లో భాగంగా రూ.16,499కే లభించనుంది. దీంతోపాటు బ్యాంక్ ఆఫర్లతో మరో రూ.1500 వరకు తగ్గింపును పొందే అవకాశం ఉంది.
Poco X5 5G : ఈ స్మార్ట్‌ఫోన్ మార్చిలో లాంచ్ అయింది. 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.20,999గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా రూ.14,999కే కొనుగోలు చేయవచ్చు. స్నాప్‌డ్రాగన్ 695 SoCపై పనిచేస్తుంది. 120Hz రీప్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమోలెడ్ పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. వెనుకవైపు 48MP ప్రైమరీ కెమెరా, 8MP, 2MP కెమెరాలను కలిగి ఉంటుంది.
Motorola G54 5G : స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 SoC పైన పనిచేస్తుంది. వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. అందులో 50MP ప్రధాన కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌ను గతనెలలో 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను రూ.18,999 ధరకు విడుదల చేశారు. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా రూ.15,999 కే కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో మరో రూ.1000 అదనంగా తగ్గే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








