రూ.500 లోపు ధరలో Tata Sky నుంచి వస్తున్న ఉత్తమ DTH ప్యాక్‌లు ఇవే
ఇండియాలోని డిటిహెచ్ ఆపరేటర్లలో నంబర్ వన్ స్థానంలో ఉన్న టాటా స్కై తన వినియోగదారులకు అద్భుతమైన ప్లాన్ లను మరియు ప్యాకేజీలను అందిస్తుంది. వినియోగదారులకు ఎంచుకోవడానికి చాలా ఎంపికలు అందుబాటులో ఉన్నప్పుడు ఎదురయ్యే అతి పెద్ద తలనొప్పి ఒకటి ఏమిటంటే ఏ ప్లాన్‌ను ఎంచుకోవాలో నిర్ణయించుకోవడం. మరి ముఖ్యంగా గుర్తుంచుకోవలసినది వారి యొక్క బడ్జెట్ ధరలో లభించే అద్బుతమైన ప్లాన్. సాధారణంగా చాలా మంది రూ.500 లోపు ధర వద్ద లభించే అద్భుతమైన ప్లాన్‌లను ఎంచుకోవడానికి ఇష్టపడతారు. టాటా స్కై ఈ ధర విభాగంలో అందించే ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

తెలుగు మలయాళ బేసిక్ HD ప్లాన్ పూర్తి వివరాలు
తెలుగు మలయాళ బేసిక్ హెచ్‌డి ఛానల్ ప్యాక్ మొత్తంగా 19 హెచ్‌డి ఛానెల్స్, 43 SD ఛానెళ్లను అందిస్తుంది. కాబట్టి ఈ ప్యాక్‌తో వినియోగదారులు మొత్తంగా 62 ఛానెల్‌లను పొందవచ్చు. వీటితో పాటుగా రెండు హిందీ న్యూస్ ఛానెల్‌లు మరియు ఒక హిందీ సినిమా ఛానెల్ కూడా అదనంగా లభిస్తుంది. కానీ ఈ ప్యాక్‌లో తెలుగు ప్రాంతీయ మరియు మలయాళ ప్రాంతీయ ఛానెల్‌లు కూడా అధికంగా ఉన్నాయి. అయితే ఈ ఛానల్ ప్యాక్ యొక్క ధర మొత్తం నెలకు రూ.343.49 మాత్రమే.

మరాఠీ హిందీ ప్రీమియం స్పోర్ట్స్ ఇంగ్లీష్ ప్యాక్ పూర్తి వివరాలు
మరాఠీ హిందీ ప్రీమియం స్పోర్ట్స్ ఇంగ్లీష్ ప్లాన్ కూడా టాటా స్కై నుండి రూ.500 ధర లోపు లభించే ఉత్తమమైన ప్లాన్‌లలో ఒకటి. దీని ధర నెలకు రూ.334.52 గా ఉంది. ఇది టన్నుల కొద్ది హిందీ మరియు మరాఠీ ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లను అందిస్తుంది. ఇందులో సినిమా ఛానెల్స్, న్యూస్ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్, మ్యూజిక్ ఛానల్స్, పిల్లల ఛానల్స్, లైఫ్ స్టైల్ మరియు నాలెడ్జ్ ఛానల్స్ కూడా అధికంగా ఉన్నాయి. ఈ ప్లాన్‌తో మీరు మొత్తంగా 122 ఛానెల్‌లను పొందవచ్చు. అయితే ఇది SD ఛానల్ ప్యాక్ కాబట్టి ఛానెల్‌లు ఏవీ హెచ్‌డిలో లభించవు.

తెలుగు ఫ్యామిలీ కిడ్స్ స్పోర్ట్స్ HD ప్యాక్ పూర్తి వివరాలు
చిన్న పిల్లలకు ఎక్కువ ఛానెల్‌లను అందించే మరో HD ఛానల్ ప్యాక్ ఇది. ఈ ప్యాక్ మీకు మొత్తంగా 81 ఛానెల్‌లను అందిస్తుంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే మొత్తం 81 ఛానెల్‌లలో 31 HD ఛానెల్‌లు మరియు 50 SD ఛానెల్‌లు ఉండడం. ఈ ప్యాక్ ధర నెలకు 441.96 రూపాయలు. ఇది మీకు అన్నికంటే ఉత్తమమైన వినోదాలు, పిల్లలు, సంగీతం ఛానెల్‌లను అందిస్తుంది. ఇందులో కొన్ని తెలుగు, మలయాళ ఛానల్స్ కూడా ఉన్నాయి.

కన్నడ ఫ్యామిలీ కిడ్స్ స్పోర్ట్స్ HD ప్యాక్ పూర్తి వివరాలు
తెలుగుతో పాటుగా కన్నడ ఛానెల్‌లను కూడా కోరుకునే వారికి కన్నడ ఫ్యామిలీ కిడ్స్ స్పోర్ట్స్ హెచ్‌డి ప్లాన్ నెలకు రూ.409.51ధర వద్ద ఉత్తమంగా ఉంది. ఇది మీకు వినోదం, స్పోర్ట్స్ , సినిమాలు, కిడ్స్ చానెల్స్ , న్యూస్ చానెల్స్, టెక్నాలజీ చానెల్స్, మ్యూజిక్ చానెల్స్ మరియు లైఫ్ స్టైల్ ఛానెల్‌లను అందిస్తుంది. ఈ ప్యాకేజీలో 28 HD ఛానెల్‌లు మరియు 45 SD ఛానెల్‌లు ఉన్నాయి కాబట్టి వినియోగదారునికి మొత్తంగా 73 ఛానెల్‌లు లభిస్తాయి. ఇందులో మలయాళం, తెలుగు మరియు కన్నడ ప్రాంతీయ భాష ఛానెల్‌లు కూడా అదనంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








