బడ్జెట్ ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న ఉత్తమ Wi-Fi రూటర్‌లు ఇవే!!

|

కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ప్రతి ఒక్కరు ఇంటికి పరిమితం కావడంతో చాలా మంది ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి తమ యొక్క పనిని పూర్తి చేస్తున్నారు. అయితే ఇప్పటికి చాలా మంది ఇంటి వద్ద ఉండే పనిచేస్తున్నందున మీ ఇంటిలో మంచి ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. అలాగే కార్యాలయాలలో కూడా ఉత్తమమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉండడంతో ఇది కుటుంబం మరియు స్నేహితులతో కనెక్ట్ అవ్వడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అయితే ముఖ్యమైన వేగాన్ని నిర్ధారించడానికి మీ ఇంటి వద్ద మంచి Wi-Fi రూటర్ ఉండటం ముఖ్యం అని మీరు అర్థం చేసుకోవాలి.

Wi-Fi రూటర్

ప్రస్తుతం దేశంలోని చాలా ఇళ్లలో స్మార్ట్‌ఫోన్లను అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇటువంటి వారి యొక్క వినోద అవసరాలను తీర్చడానికి అధికంగా వీడియో స్ట్రీమింగ్ సేవలను ఉపయోగిస్తున్నారు. అంతరాయం లేని యూజర్ అనుభవం కోసం విశ్వసనీయ Wi-Fi రూటర్ ముఖ్యంగా ఉండవలసి ఉంటుంది. సమర్థవంతమైన రౌటర్ వినియోగదారులకు ఇబ్బంది లేని కనెక్టివిటీని మెరుగ్గా అందిస్తుంది. మీ బడ్జెట్‌ ధరలో లభించే ఉత్తమమైన Wi-Fi రూటర్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Intel ఆల్డర్ లేక్ CPU లు AMD రైజెన్‌ను ఓడించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయా?Intel ఆల్డర్ లేక్ CPU లు AMD రైజెన్‌ను ఓడించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయా?

TP- లింక్ ఆర్చర్ C20 AC750 వైర్‌లెస్ డ్యూయల్ బ్యాండ్ రౌటర్

TP- లింక్ ఆర్చర్ C20 AC750 వైర్‌లెస్ డ్యూయల్ బ్యాండ్ రౌటర్

TP- లింక్ ఆర్చర్ C20 AC750 వైర్‌లెస్ డ్యూయల్-బ్యాండ్ రౌటర్ 733Mbps వరకు ఇంటర్నెట్ వేగాన్ని సపోర్ట్ చేస్తుంది. ఈ రౌటర్ భారతదేశంలోని అధిక సంఖ్యలో ఇంటర్నెట్ వినియోగదారుల అవసరాలను తీరుస్తుంది. ఇది డ్యూయల్-బ్యాండ్ Wi-Fi కి మద్దతు ఇస్తుంది. మీకు వేగవంతమైన డేటా స్పీడ్ కావాలంటే 5GHz బ్యాండ్‌కి మారవచ్చు లేదా మీకు విస్తృత కవరేజ్ కావాలంటే 2 GHz బ్యాండ్‌ని ఉపయోగించవచ్చు. తగినంత నెట్‌వర్క్ కవరేజ్ ను అందించడం కోసం ఇది మూడు యాంటెన్నాలను కలిగి ఉంది. ఈ TP- లింక్ రౌటర్ ధర మరియు పనితీరు మధ్య మంచి సమతుల్యతను కలిగి ఉంది.

స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి మెరుగైన ఫోటోలను తీయడానికి టిప్స్ & ట్రిక్స్స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి మెరుగైన ఫోటోలను తీయడానికి టిప్స్ & ట్రిక్స్

టెండా N301 వైర్‌లెస్-N300 రౌటర్

టెండా N301 వైర్‌లెస్-N300 రౌటర్

టెండా N301 వైర్‌లెస్-N300 బ్లాక్ సెటప్ రూటర్ 300 Mbps వరకు గరిష్ట ఇంటర్నెట్ స్పీడ్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ బడ్జెట్ రౌటర్ రెండు యాంటెన్నాలను కలిగి ఉండి నిరంతరాయ నెట్‌వర్క్ కవరేజీని అందిస్తుంది. ఇది బడ్జెట్ రౌటర్ కాబట్టి ఇది 2.4 GHz బ్యాండ్‌కు మాత్రమే మద్దతును ఇస్తుంది. అయితే ఇది కూడా చాలా మందికి సరిపోతుంది. ముఖ్యంగా ఈ రౌటర్ దేశంలో అత్యుత్తమ బడ్జెట్ రౌటర్ ఎంపికలలో ఒకటి. ఎందుకంటే ఇది దేశంలోని చాలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌లకు మద్దతు ఇస్తుంది. కావున మీరు వెచ్చించిన డబ్బుకు ఇది ఉత్తమ విలువను అందిస్తుంది.

TP-Link TL-WR841N 300Mbps వైర్‌లెస్ రౌటర్

TP-Link TL-WR841N 300Mbps వైర్‌లెస్ రౌటర్

TP-Link TL-WR841N Wi-Fi రౌటర్ అనేది మరొక ప్రముఖ బడ్జెట్ వైర్‌లెస్ రౌటర్. ఇది డ్యూయల్-యాంటెన్నా డిజైన్‌తో వస్తుంది అలాగే ఇది 300 Mbps వరకు ఇంటర్నెట్ స్పీడ్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ రౌటర్ వెబ్ లాగిన్ ఎంపికను ఉపయోగించి ఒక సాధారణ సెటప్‌ను అందిస్తుంది. ప్రత్యామ్నాయంగా వినియోగదారులు TP- లింక్ టెథర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు దానిని తమ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా సెటప్ చేయవచ్చు.

Mi స్మార్ట్ రౌటర్ 4C

Mi స్మార్ట్ రౌటర్ 4C

Mi స్మార్ట్ రౌటర్ 4C అనేది సరసమైన ధరల విభాగంలో లభిస్తున్నప్పటికీ మెరుగైన చాలా ఫీచర్లను అందిస్తుంది. ఇది 300 Mbps వేగంతో లభించడమే కాకుండా సింగిల్ బ్యాండ్ 2.4 GHz వరకు మద్దతు ఇస్తుంది. మీ ఫోన్ నుండి రౌటర్ ఫీచర్‌లను నిర్వహించడానికి మిమ్మల్ని అనుమతించే ఒక యాప్ కూడా ఉంది. ఇది నాలుగు యాంటెన్నాలను కలిగి ఉన్న మంచి ఎంపికలలో ఇది ఒకటి.

Best Mobiles in India

English summary
Best Wi-Fi Routers Available to Buy at Budget Price

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X